Pathaan 11 Days Collections: చరిత్ర సృష్టించిన పఠాన్.. దేశంలోనే టాప్ మూవీగా.. అన్ని వందల కోట్లతో హవా
పేరుకు బాలీవుడ్ హీరోనే అయినా దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తూ.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా స్టార్ హీరోగా సందడి చేస్తోన్నాడు బాద్‌షా షారూఖ్ ఖాన్. సీనియర్ హీరో అయినా ప్రయోగాలు చేస్తూ సత్తా చాటుతోన్న అతడు.. కొంత కాలం పాటు సినిమాలు చేయడం ఆపేశాడు. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే షారూఖ్ 'పఠాన్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ చిత్రానికి ఆరంభం నుంచే భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో 'పఠాన్' మూవీ 11 రోజుల కలెక్షన్ల రిపోర్టును మీరు కూడా చూసేయండి మరి!

పఠాన్‌గా షారూఖ్ ఖాన్ ఎంట్రీ
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన తాజా సినిమానే 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం కీలక పాత్రను చేశాడు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ చిన్న పాత్ర చేశాడు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. విశాల్ శేఖర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించాడు.

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్
షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 - 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే దీన్ని దాదాపు 8000లకు పైగా థియేటర్లలో దీన్ని గ్రాండ్‌గా విడుదల చేసుకున్నారు.

పది రోజుల్లో ఎంత వచ్చింది?
షారూఖ్ ఖాన్, జాన్ అబ్రహం, దీపిక పదుకొనె ప్రధాన పాత్రల్లో నటించిన 'పఠాన్' మూవీకి ఆరంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గానే వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఇలా పది రోజుల్లో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 374 కోట్లు నెట్, రూ. 729 కోట్లు గ్రాస్ వసూలైంది.

11వ రోజు ఎంత వసూలైంది?
షారూఖ్ ఖాన్ - దీపికా పదుకొనె కలిసి నటించిన 'పఠాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇలా 11వ రోజు ఈ చిత్రానికి ఓవరాల్‌గా రూ. 43 - 46 కోట్లు గ్రాస్, రూ. 22 - 26 కోట్లు నెట్ వచ్చినట్లు తెలిసింది.

11 రోజులకు కలిపి ఎంతంటే?
ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'పఠాన్' మూవీకి హిందీలో మాత్రం భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 11 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 400 కోట్లు వరకూ నెట్ వసూలు అయింది. అలాగే, రూ. 770 - 780 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసింది. తద్వారా ఈ ప్రతిష్టాత్మక సినిమా ఇప్పటికే ఎన్నో రికార్డులను సైతం నమోదు చేసింది.

ఓవర్సీస్‌లోనూ భారీ వసూళ్లు
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్‌కు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకు అనుగుణంగానే 'పఠాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు. దీంతో ఈ మూవీ 11 రోజుల్లో ఓవర్సీస్‌లో 36 మిలియన్స్ వరకూ రాబట్టి సంచలనం సృష్టించింది. తద్వారా ఎన్నో దేశాల్లో నెంబర్ వన్ పొజిషన్‌కు చేరింది. అయితే, నార్త్ అమెరికాలో మాత్రం 4వ స్థానంలో ఉంది.

ఇండియాలోనే ఫస్ట్ ప్లేస్‌లోకి
'పఠాన్' మూవీ 11 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 400 కోట్ల వరకూ నెట్ వసూలు చేసింది. అందులో హిందీలోనే రూ. 380 కోట్ల వరకూ వచ్చింది. తద్వారా బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల జాబితాలో 'దంగల్' రూ. 374 కోట్లు నెట్ రికార్డు బ్రేక్ చేసింది. అలాగే, వేగంగా రూ. 400 కోట్లు నెట్ సాధించిన ఏకైక ఇండియన్ మూవీగా ఇది రికార్డు సాధించింది.


Click it and Unblock the Notifications











