Pathaan 13 Days Collections: పఠాన్ సంచలన రికార్డు.. బాహుబలి, RRR షాకింగ్‌గా.. అన్ని వందల కోట్లా!

బాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ నెంబర్ వన్ హీరోగా వెలుగొందుతోన్నాడు బాద్‌షా షారూఖ్ ఖాన్. కెరీర్ ఆరంభం నుంచీ ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోన్న ఆయన.. ఈ మధ్య కాలంలో మాత్రం చాలా కాలం పాటు గ్యాప్ తీసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే అతడు గత జనవరిలో 'పఠాన్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ చిత్రానికి ఆరంభం నుంచే భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. దీంతో కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'పఠాన్' మూవీ 13 రోజుల కలెక్షన్ల రిపోర్టును మీరు కూడా లుక్కేయండి మరి!

పఠాన్‌గా షారూఖ్ ఖాన్ దూకుడు

పఠాన్‌గా షారూఖ్ ఖాన్ దూకుడు

బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ నటించిన తాజా సినిమానే 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం కీలక పాత్రను చేశాడు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ చిన్న పాత్రలో కనిపించాడు. విశాల్ శేఖర్ దీనికి మ్యూజిక్ అందించాడు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు.

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్

బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 - 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే దీన్ని దాదాపు 8000లకు పైగా థియేటర్లలో దీన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

12 రోజుల్లో ఎంత వచ్చిందంటే

12 రోజుల్లో ఎంత వచ్చిందంటే


షారూఖ్ ఖాన్ హీరోగా జాన్ అబ్రహం, దీపిక పదుకొనె ప్రధాన పాత్రలను చేసిన 'పఠాన్' మూవీకి ఆరంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గానే వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఇలా పది రోజుల్లో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 429 కోట్లు నెట్‌, రూ. 832 కోట్లు గ్రాస్ వసూలైంది.

13వ రోజు ఎంత కలెక్ట్ చేసింది

13వ రోజు ఎంత కలెక్ట్ చేసింది

షారూఖ్ ఖాన్ - సిద్దార్థ్ ఆనంద్ కాంబోలో వచ్చిన 'పఠాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇలా 13వ రోజు ఈ చిత్రానికి ఓవరాల్‌గా రూ. 18 - 20 కోట్లు గ్రాస్, రూ. 9 - 10 కోట్లు నెట్ వచ్చినట్లు తెలిసింది.

13 రోజులకు కలిపి ఎంతంటే?

13 రోజులకు కలిపి ఎంతంటే?


క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'పఠాన్' మూవీకి హిందీలో మాత్రం భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 13 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 437 - 439 కోట్లు వరకూ నెట్ వసూలు అయింది. అలాగే, రూ. 850 - 852 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసింది. తద్వారా ఈ ప్రతిష్టాత్మక సినిమా ఇప్పటికే ఎన్నో రికార్డులను సైతం క్రియేట్ చేసుకుంది.

ఓవర్సీస్‌లోనూ రికార్డు వసూళ్లు

ఓవర్సీస్‌లోనూ రికార్డు వసూళ్లు

బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్‌‌కు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకు అనుగుణంగానే 'పఠాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు. దీంతో ఈ మూవీ 13 రోజుల్లో ఓవర్సీస్‌లో 40 మిలియన్ డాలర్లకు పైగానే రాబట్టి సంచలనం సృష్టించింది. అంటే.. ఇండియన్ కరెన్సీలో దాదాపుగా ఈ సినిమా రూ. 330 కోట్లు వరకూ గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

కేజీఎఫ్ 2 టార్గెట్.. అవే ముందు

కేజీఎఫ్ 2 టార్గెట్.. అవే ముందు


'పఠాన్' 13 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 437 కోట్ల వరకూ నెట్ రాబట్టింది. అందులో హిందీలోనే రూ. 420 కోట్ల వరకూ వచ్చాయి. తద్వారా బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో 'కేజీఎఫ్ 2' రూ. 434 కోట్లు నెట్‌కు చేరువగా వచ్చింది. అలాగే, వేగంగా రూ. 850 కోట్లు గ్రాస్ సాధించిన చిత్రాల్లో బాహుబలి2, RRR, కేజీఎఫ్ 2 తర్వాతనే ఈ చిత్రం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X