Pathaan 15 Days Collections: పఠాన్ దండయాత్ర.. కేజీఎఫ్ 2 రికార్డు ఫినీష్.. ఇండియాలోనే తొలి సినిమాగా!
విలక్షణమైన నటన, విభిన్నమైన కమర్షియల్ సినిమాలు చేస్తూ చాలా కాలం క్రితమే దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకుని పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్. దాదాపు నలభై ఏళ్ల పాటు ఏకధాటిగా సినిమాలు చేసిన అతడు.. ఈ మధ్య చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే 'పఠాన్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ చిత్రానికి ఆరంభం నుంచే భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'పఠాన్' మూవీ 15 రోజుల రిపోర్టును చూద్దాం పదండి!

పఠాన్‌గా వచ్చేసిన షారూఖ్ ఖాన్
స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన తాజా సినిమానే 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం కీలక పాత్రను చేశాడు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ చిన్న పాత్రలో కనిపించాడు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. విశాల్ శేఖర్ ఈ మూవీకి సంగీతాన్ని అందించాడు.

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్
'పఠాన్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 - 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అందుకు అనుగుణంగానే దీన్ని దాదాపు 8000లకు పైగా థియేటర్లలో దీన్ని ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తెచ్చారు.

14 రోజుల్లో ఎంత వచ్చిందంటే
షారూఖ్ ఖాన్ హీరోగా సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించిన యాక్షన్ మూవీ 'పఠాన్'కు ఆరంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గానే వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీ స్థాయిలోనే వస్తున్నాయి. ఇలా 14 రోజుల్లో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 446 కోట్లు నెట్, రూ. 865 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

15వ రోజు ఎంత కలెక్ట్ చేసింది
షారూఖ్ ఖాన్ - దీపిక పదుకొణె జంటగా నటించిన 'పఠాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇలా 15వ రోజు ఈ చిత్రానికి ఓవరాల్‌గా రూ. 14 - 15 కోట్లు గ్రాస్, రూ. 7 - 7.50 కోట్లు నెట్ వచ్చినట్లు తెలిసింది.

15 రోజులకు కలిపి ఎంతంటే?
పూర్తి స్థాయిలో యాక్షన్ మూవీగా రూపొందిన 'పఠాన్' మూవీకి హిందీలో మాత్రం భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 15 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 453 కోట్లు వరకూ నెట్ వసూలు అయింది. అలాగే, రూ. 879 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసింది. తద్వారా ఈ ప్రతిష్టాత్మక సినిమా ఇప్పటికే ఎన్నో రికార్డులను కూడా ఖాతాలో వేసేసుకుంది.

ఓవర్సీస్‌లోనూ మరింతగానే
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్‌కు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే 'పఠాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు. దీంతో ఈ మూవీ 15 రోజుల్లో ఓవర్సీస్‌లో 41 మిలియన్ డాలర్లకు పైగానే రాబట్టి సంచలనం సృష్టించింది. తద్వారా ఓవర్సీస్‌లో ఎక్కువ కలెక్షన్లను సాధించిన చిత్రాల జాబితాలోకి చేరింది.

కేజీఎఫ్ 2 ఔట్.. టాప్ మూవీగా
షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' 15 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 453 కోట్ల వరకూ నెట్ రాబట్టింది. అందులో హిందీలోనే రూ. 437 కోట్ల వరకూ వచ్చాయి. తద్వారా బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో 'కేజీఎఫ్ 2' రూ. 434 కోట్లు రికార్డును బ్రేక్ చేసింది. ఫలితంగా ఎక్కువ నెట్‌ను రాబట్టిన బాలీవుడ్ సినిమాగానూ నిలిచి సరికొత్త చరిత్రను నమోదు చేసింది.


Click it and Unblock the Notifications











