Pathaan 16 Days Collections: పఠాన్‌కు బిగ్ షాక్.. అయినా అన్ని వందల కోట్లు.. బాహుబలిని బీట్ చేయాలంటే!

దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండియన్ సినిమాపై తనదైన రీతిలో ప్రభావాన్ని చూపిస్తూ నెంబర్ వన్ హీరోగా సత్తా చాటుతోన్నాడు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్. చాలా ఏళ్ల క్రితమే పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్న ఆయన.. వరుసగా సినిమాలు చేస్తూ వచ్చారు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం చాలా గ్యాప్ తీసుకుని.. ఇప్పుడు 'పఠాన్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ చిత్రానికి ఆరంభం నుంచే భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'పఠాన్' మూవీ 16 రోజుల రిపోర్టును మీరే చూసేయండి!

పఠాన్‌గా ఎంటరైన షారూఖ్ ఖాన్

పఠాన్‌గా ఎంటరైన షారూఖ్ ఖాన్

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం కీలక పాత్రను చేశాడు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ చిన్న పాత్రలో కనిపించాడు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. విశాల్ శేఖర్ దీనికి సంగీతాన్ని ఇచ్చాడు.

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్

క్రేజీ కాంబోలో వచ్చిన 'పఠాన్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలున్నాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 - 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అందుకు అనుగుణంగానే దాదాపు 8000లకు పైగా థియేటర్లలో ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేశారు.

15 రోజుల్లో ఎంత వచ్చిందంటే

15 రోజుల్లో ఎంత వచ్చిందంటే

షారూఖ్ ఖాన్ - సిద్దార్థ్ ఆనంద్ కాంబోలో వచ్చిన యాక్షన్ మూవీ 'పఠాన్'కు ఆరంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గానే వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీ స్థాయిలోనే వస్తున్నాయి. ఇలా 14 రోజుల్లో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 452 కోట్లు నెట్‌, రూ. 877 కోట్లు గ్రాస్ వచ్చింది.

16వ రోజు ఎంత కలెక్ట్ చేసింది

16వ రోజు ఎంత కలెక్ట్ చేసింది

షారూఖ్ ఖాన్ - దీపిక పదుకొణె కలయికలో వచ్చిన 'పఠాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇలా 16వ రోజు భారీగా పడిపోయి కేవలం రూ. 12 కోట్లు గ్రాస్, రూ. 6 కోట్లు నెట్ మాత్రమే వచ్చినట్లు తెలిసింది.

16 రోజులకు కలిపి ఎంతంటే?

16 రోజులకు కలిపి ఎంతంటే?

ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'పఠాన్' మూవీకి హిందీలో మాత్రం భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 16 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 459.50 కోట్లు వరకూ నెట్ వసూలు అయింది. అలాగే, రూ. 889 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసింది. తద్వారా ఈ ప్రతిష్టాత్మక సినిమా ఇప్పటికే ఎన్నో రికార్డులను కూడా నమోదు చేసుకుంది.

ఓవర్సీస్‌లోనూ స్పీడు తగ్గింది

ఓవర్సీస్‌లోనూ స్పీడు తగ్గింది


ఇండియన్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్‌కు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకు అనుగుణంగానే 'పఠాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు. దీంతో దీనికి కలెక్షన్లు పోటెత్తాయి. అయితే, రెండు మూడు రోజులుగా ఇవి డౌన్ అవుతూనే వస్తున్నాయి. ఫలితంగా ఈ మూవీ 16 రోజుల్లో ఓవర్సీస్‌లో 41 మిలియన్ డాలర్ల వరకూ రాబట్టి సత్తా చాటుకుంది.

బాహుబలి రికార్డు చేరుతుందా

బాహుబలి రికార్డు చేరుతుందా


షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' 16 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 459 కోట్ల వరకూ నెట్ రాబట్టింది. అందులో హిందీలోనే రూ. 443.25 కోట్ల వరకూ వచ్చాయి. తద్వారా బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలను ఒక్కొక్కటిగా దాటుకుంటూ వచ్చింది. ఇక, ఈ లిస్టులో 'బాహుబలి 2' రూ. 511 కోట్లతో టాప్‌లో ఉంది. మరి దీన్ని పఠాన్ చేరుతుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X