Pathaan 17 days collections 900 కోట్ల పఠాన్.. ఇండియాలో బాహుబలి2 రికార్డుకు చేరువగా షారుక్ ఖాన్!

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్, దీపిక పదుకోన్, జాన్ అబ్రహం నటించిన పఠాన్ చిత్రం మూడో వారంలోకి ప్రవేశించింది. గత రెండు వారాల్లో బాక్సాఫీస్ ద్ద రికార్డు వసూళ్లు సాధించిన ఈ చిత్రం 17వ రోజున కూడా భారీ వసూళ్లు సాధించింది. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇండియా, ఓవర్సీస్‌లో రికార్డులు తిరుగరాస్తున్నాయి. అయితే గత 17వ రోజుల్లో ఈ చిత్రం ఎంత వసూళ్లు సాధించిందంటే?

తొలి రెండు వారాల్లో పఠాన్ వసూళ్లు

తొలి రెండు వారాల్లో పఠాన్ వసూళ్లు

పఠాన్ చిత్రం తొలివారంలో ఇండియాలో రికార్డులను కొల్లగొట్టింది. అన్ని భాషల్లో కలిపి ఈ చిత్రం ఫస్ట్ వీక్‌లో 364 కోట్ల రూపాయలు వసూలు చేసింది. హిందీ వెర్షన్‌ 351 కోట్లు, తెలుగు వెర్షన్ 9 కోట్లు, తమిళ వెర్షన్ 4.15 కోట్లు రాబట్టింది. రెండోవారంలో కూడా అదే జోష్‌ను కొనసాగించి సుమారు 95 కోట్లు రాబట్టింది. హిందీలో 92 కోట్లు, తెలుగులో 2 కోట్లు, తమిళంలో 1.15 కోట్లు వసూలు చేసింది.

బాహుబలి2 రికార్డుపై గురి

బాహుబలి2 రికార్డుపై గురి

పఠాన్ చిత్రానికి దేశవ్యాప్తంగా అనూహ్యమైన ఓపెనింగ్స్ రావడంతో బాక్సాఫీస్ జర్నీ ఘనంగా మొదలైంది. గత రెండు వారాల్లో అన్ని భాషల్లో కలిపి 465 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇదే జోష్ కోనసాగిస్తే ఇండియాలో బాహుబలి2 సినిమా సాధించిన అత్యధిక కలెక్షన్లు 511 కోట్ల రికార్డుకు పఠాన్ చేరువైంది. ఈ రికార్డును షారుక్ అధిగమిస్తాడా? లేదా అనే విషయం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నది.

నాలుగో వారంలో భారీ సవాల్

నాలుగో వారంలో భారీ సవాల్

గత వారంలో బాక్సాఫీస్ వద్ద ఎదురే లేకుండా పోయిన పఠాన్ చిత్రానికి నాలుగోవారంలో భారీ పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. కార్తీక్ ఆర్యన్ నటించిన షెహ్‌జాదా, హాలీవుడ్ చిత్రం యాంట్ మ్యాన్ అండ్ వాల్స్: క్వాంటుమేనియా చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఈ రెండు చిత్రాల పోటీని తట్టుకొంటే పఠాన్ చిత్రం బాహుబలి2 సినిమా రికార్డును అధిగమించే ఛాయిస్ ఉంటుందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

500 కోట్లకు చేరువగా పఠాన్

500 కోట్లకు చేరువగా పఠాన్

పఠాన్ చిత్రం ఇండియాలో బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. దంగల్, టైగర్ జిందా హై, కేజీఎఫ్ చాప్టర్ 2, కశ్మీర్ ఫైల్స్ చిత్రాల రికార్డులను అధిగిమించింది. త్వరలోనే ఈ చిత్రం ఇండియాలో 500 కోట్ల క్లబ్‌లో చేరేందుకు రెడీగా ఉంది. ఈ సినిమా మూడోవారంలో 500 కోట్ల క్లబ్‌లో చేరవచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

 17వ రోజు పఠాన్ ఆక్యుపెన్సీ

17వ రోజు పఠాన్ ఆక్యుపెన్సీ

పఠాన్ చిత్రం 17వ రోజున పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ముంబై, ఢిల్లీ, పూణే, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, జైపూర్‌లో ఓ మాదిరి ఆక్యుపెన్సీని నమోదు చేసింది. చెన్నైలో 33 శాతం, హైదరాబాద్‌లో 25 శాతం, కోల్ కతాలో 20 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 5 కోట్ల నికర వసూళ్లు, ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల షేర్ సాధించింది.

17 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు

17 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు

పఠాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెలితే.. ఇండియాలో 465 కోట్ల షేర్, 550 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఓవర్సీస్‌లో మొత్తంగా 338 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 889 కోట్ల వసూళ్లను సాధించిది. త్వరలోనే ఈ చిత్రం 900 కోట్ల క్లబ్‌లోకి చేరే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X