Pathaan 18 Days Collections: పఠాన్ ఊరమాస్.. అన్ని వందల కోట్లు.. సినీ చరిత్రలో ఏకైక సినిమా రికార్డు
విలక్షణమైన నటన, విభిన్నమైన సబ్జెక్టులతో సినిమాలు చేస్తూ దాదాపు నలభై ఏళ్లుగా ఇండియన్ సినిమాపై తనదైన రీతిలో హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నాడు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్. కెరీర్ ఆరంభం నుంచీ హిట్లు ఫ్లాపులను చూడకుండా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన అతడు.. ఈ మధ్య కాలంలో మాత్రం చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'పఠాన్' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దీనికి ఆరంభం నుంచే భారీ స్పందన వస్తోంది. దీంతో కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఆలస్యం లేకుండా 'పఠాన్' మూవీ 18 రోజుల రిపోర్టును చూడండి!

పఠాన్‌గా వచ్చేసిన షారూఖ్ ఖాన్
సీనియర్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం కీలక పాత్రను చేశాడు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ చిన్న పాత్రలో కనిపించాడు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. విశాల్ శేఖర్ దీనికి మ్యూజిక్‌ను అందించాడు.

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'పఠాన్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలున్నాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 - 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అందుకు అనుగుణంగానే దాదాపు 8000లకు పైగా థియేటర్లలో దీన్ని రిలీజ్ చేసుకున్నారు.

17 రోజుల్లో ఎంత వచ్చిందంటే
షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహం కాంబోలో వచ్చిన యాక్షన్ మూవీ 'పఠాన్'కు ఆరంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గానే వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీ స్థాయిలోనే వస్తున్నాయి. ఇలా 17 రోజుల్లో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 464 కోట్లు నెట్, రూ. 901 కోట్లు గ్రాస్ వచ్చింది.

18వ రోజు ఎంత కలెక్ట్ చేసింది
షారూఖ్ ఖాన్ - సిద్దార్థ్ ఆనంద్ కలయికలో వచ్చిన 'పఠాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇలా 18వ రోజు భారీగా పెరిగి కేవలం రూ. 22 - 24 కోట్లు గ్రాస్, రూ. 11 - 13 కోట్లు నెట్ వచ్చినట్లు తెలిసింది.

18 రోజులకు కలిపి ఎంతంటే?
పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'పఠాన్' మూవీకి హిందీలో మాత్రం భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 18 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 475 కోట్లు వరకూ నెట్ వసూలు అయింది. అలాగే, రూ. 925 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలిసింది. తద్వారా ఈ ప్రతిష్టాత్మక సినిమా ఇప్పటికే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది.

ఓవర్సీస్‌లోనూ మరో ఘనత
పాన్ ఇండియన్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్‌కు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకు అనుగుణంగానే 'పఠాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు. దీంతో దీనికి కలెక్షన్లు పోటెత్తాయి. ఫలితంగా ఈ మూవీ 18 రోజుల్లో ఓవర్సీస్‌లో 42 మిలియన్ డాలర్ల వరకూ రాబట్టి సత్తా చాటుకుంది. అంటే భారతీయ కరెన్సీలో ఇది రూ. 350 కోట్లు వసూలు చేసింది.

ఏకైక చిత్రం.. RRR టార్గెట్
'పఠాన్' 18 రోజుల్లోనే రూ. 925 కోట్ల వరకూ గ్రాస్ రాబట్టింది. తద్వారా హిందీ చలన చిత్ర చరిత్రలోనే 900 కోట్లు మార్కును దాటిన ఏకైక చిత్రంగా ఇది రికార్డును సాధించింది. ఇక, ఇండియాలో అత్యధిక గ్రాస్‌ను రాబట్టిన చిత్రాల్లో 'భజరంగీ భాయ్‌జాన్' (910 కోట్లు)ను దాటేసి టాప్ 5కి చేరింది. ఇందులో దంగల్, బాహుబలి 2, కేజీఎఫ్ 2, RRR 4 స్థానాల్లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











