Pathaan 19 Days Collections: పఠాన్ ప్రపంచ రికార్డు.. ఏకైక ఇండియన్ మూవీగా.. 50 కోట్లు వస్తే సంచలనమే

ప్రస్తుతం చాలా మంది హీరోలు పాన్ ఇండియా స్టార్లుగా సత్తా చాటుతోన్నారు. కానీ, చాలా ఏళ్ల క్రితమే తనదైన శైలి చిత్రాలు, నటనతో దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించాడు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్. అంతేకాదు, వరల్డ్ వైడ్‌గా తన ఫాలోయింగ్ పెంచుకున్న ఆయన.. వరుస చిత్రాలతో తెగ సందడి చేశాడు. ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకుని ఇటీవలే షారూఖ్ ఖాన్ 'పఠాన్' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభం నుంచే భారీ స్పందన వస్తోంది. దీంతో కలెక్షన్లు భారీగా వస్తూనే ఉన్నాయి. ఆలస్యం లేకుండా 'పఠాన్' మూవీ 19 రోజుల రిపోర్టును చూద్దామా!

పఠాన్‌గా షారూఖ్ ఖాన్ అరాచకం

పఠాన్‌గా షారూఖ్ ఖాన్ అరాచకం

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రమే 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం కీలక పాత్రను చేశాడు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ చిన్న పాత్రలో కనిపించాడు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. విశాల్ శేఖర్ దీనికి సంగీతం అందించాడు.

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'పఠాన్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలున్నాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్‌కు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 - 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అందుకు అనుగుణంగానే దాదాపు 8000లకు పైగా థియేటర్లలో దీన్ని విడుదల చేశారు.

18 రోజుల్లో ఎంత వచ్చిందంటే

18 రోజుల్లో ఎంత వచ్చిందంటే

షారూఖ్ ఖాన్ - జాన్ అబ్రహం హీరో, విలన్‌గా నటించిన యాక్షన్ మూవీ 'పఠాన్'కు ఆరంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీ స్థాయిలోనే వస్తున్నాయి. ఇలా 18 రోజుల్లో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 476.05 కోట్లు నెట్‌, రూ. 924 కోట్లు గ్రాస్ వచ్చింది.

19వ రోజు ఎంత కలెక్ట్ చేసింది

19వ రోజు ఎంత కలెక్ట్ చేసింది

షారూఖ్ ఖాన్ - దీపికా పదుకొణె జంటగా నటించిన 'పఠాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇలా 19వ రోజు భారీగా పెరిగి కేవలం రూ. 25 - 27 కోట్లు గ్రాస్, రూ. 14 - 15 కోట్లు నెట్ వచ్చినట్లు తెలిసింది.

19 రోజులకు కలిపి ఎంతంటే?

19 రోజులకు కలిపి ఎంతంటే?


ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'పఠాన్' మూవీకి హిందీలో మాత్రం భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 19 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 490.30 కోట్లు వరకూ నెట్ వసూలు అయింది. అలాగే, రూ. 950 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలిసింది. తద్వారా ఈ క్రేజీ మూవీ ఇప్పటికే ఎన్నో రికార్డులను కూడా బ్రేక్ చేసేసింది.

ఓవర్సీస్‌లోనూ మరో ఘనత

ఓవర్సీస్‌లోనూ మరో ఘనత


బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్‌కు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగానే 'పఠాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు. దీంతో దీనికి కలెక్షన్లు పోటెత్తాయి. ఫలితంగా ఈ మూవీ 19 రోజుల్లో ఓవర్సీస్‌లో 43.5 మిలియన్ డాలర్ల వరకూ రాబట్టింది. అంటే భారతీయ కరెన్సీలో ఇది రూ. 359 కోట్లు వరకూ వసూలు చేసింది.

ప్రపంచంలోనే ఆరో స్థానంలో

ప్రపంచంలోనే ఆరో స్థానంలో


షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' 19 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని 113 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. తద్వారా 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ఆరో స్థానానికి చేరుకుంది. ఈ క్రమంలోనే చైనా చిత్రం 'డీప్ సీ' మూవీని (112.1 మిలియన్) దాటింది. ఈ లిస్టులో Full River Red మూవీ మొదటి స్థానంలో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X