Pathaan 2 Weeks Collections: పఠాన్ సంచలన వసూళ్లు.. 2 వారాల్లోనే వందల కోట్లు.. RRR రికార్డు బ్రేక్
ఇప్పుడు చాలా మందే పాన్ ఇండియా హీరోలు ఉన్నారు. కానీ, గతంలో కొందరు మాత్రమే దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించి స్టార్లుగా సందడి చేశారు. అందులో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ ఒకడు. తనదైన శైలి యాక్టింగ్, స్టైల్స్‌తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అతడు.. చాలా గ్యాప్ తర్వాత ఇటీవలే 'పఠాన్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ చిత్రానికి ఆరంభం నుంచే భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. దీంతో కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'పఠాన్' మూవీ రెండు వారాల కలెక్షన్ల రిపోర్టును మీరు కూడా లుక్కేయండి మరి!

పఠాన్‌గా షారూఖ్ ఖాన్ ఊచకోత
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన తాజా సినిమానే 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం కీలక పాత్రను చేశాడు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ చిన్న పాత్రలో కనిపించాడు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. విశాల్ శేఖర్ దీనికి మ్యూజిక్ అందించాడు.

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్
సీనియర్ స్టార్ హీరో 'పఠాన్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 - 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే దీన్ని దాదాపు 8000లకు పైగా థియేటర్లలో దీన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు.

13 రోజుల్లో ఎంత వచ్చిందంటే
షారూఖ్ ఖాన్, జాన్ అబ్రహం, దీపిక పదుకొనె ప్రధాన పాత్రల్లో నటించిన 'పఠాన్' మూవీకి ఆరంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గానే వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఇలా 13 రోజుల్లో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 438 కోట్లు నెట్, రూ. 849 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.

14వ రోజు ఎంత కలెక్ట్ చేసింది
షారూఖ్ ఖాన్ - సిద్దార్థ్ ఆనంద్ కలయికలో వచ్చిన 'పఠాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇలా 14వ రోజు ఈ చిత్రానికి ఓవరాల్‌గా రూ. 15 - 16 కోట్లు గ్రాస్, రూ. 7 - 8 కోట్లు నెట్ వచ్చినట్లు తెలిసింది.

2 వారాలకు కలిపి ఎంతంటే?
ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'పఠాన్' మూవీకి హిందీలో మాత్రం భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 14 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 445 కోట్లు వరకూ నెట్ వసూలు అయింది. అలాగే, రూ. 865 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసింది. తద్వారా ఈ ప్రతిష్టాత్మక సినిమా ఇప్పటికే ఎన్నో రికార్డులను కూడా నమోదు చేసుకుంది.

ఓవర్సీస్‌లోనూ రికార్డు వసూళ్లు
ఇండియన్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్‌కు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకు అనుగుణంగానే 'పఠాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు. దీంతో ఈ మూవీ 2 వారాల్లో ఓవర్సీస్‌లో 41 మిలియన్ డాలర్లకు పైగానే రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక, నార్త్ అమెరికాలో RRR పేరిట ఉన్న 14.33 మిలియన్ డాలర్ల రికార్డును ఇది బ్రేక్ చేసేసింది.

రెండు వారాల్లో ఎన్నో రికార్డ్స్
షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' 2 వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 438 కోట్ల వరకూ నెట్ రాబట్టింది. అందులో హిందీలోనే రూ. 430 కోట్ల వరకూ వచ్చాయి. తద్వారా బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో 'కేజీఎఫ్ 2' రూ. 434 కోట్లు నెట్‌కు మరింత చేరువైంది. దీనితో పాటు వేగంగా రూ. 400 కోట్లు నెట్ సాధించిన చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది.


Click it and Unblock the Notifications











