Pathaan 22 Days Collections: పఠాన్‌కు తొలి షాక్.. అయినా వందల కోట్లు.. మరో బాహుబలి రికార్డు బ్రేక్
ఇండియన్ సినిమాలో చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకుని బిగ్ స్టార్లుగా వెలుగొందుతోన్నారు. అందులో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ ఒకరు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. ఈ మధ్య కాలంలో చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే షారూఖ్ 'పఠాన్' అనే మూవీతో వచ్చాడు. దీనికి ఆరంభం నుంచే భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా కలెక్షన్లు పోటెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'పఠాన్' మూవీ 22 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరే చూసేయండి!

పఠాన్‌గా వచ్చిన షారూఖ్ ఖాన్
బాలీవుడ్ బడా హీరో షారూఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రమే 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం కీలక పాత్రను చేశాడు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ చిన్న పాత్రలో కనిపించాడు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. విశాల్ శేఖర్ దీనికి సంగీతం అందించాడు.

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'పఠాన్'పై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలున్నాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్‌కు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 - 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అందుకు అనుగుణంగానే దాదాపు 8000లకు పైగా థియేటర్లలో దీన్ని విడుదల చేశారు.

21 రోజుల్లో ఎంత వచ్చిందంటే
షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన యాక్షన్ మూవీ 'పఠాన్'కు ఆరంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీ స్థాయిలోనే వస్తున్నాయి. ఇలా 21 రోజుల్లో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 498.85 కోట్లు నెట్, రూ. 963 కోట్లు గ్రాస్ వచ్చింది.

22వ రోజు ఎంత కలెక్ట్ చేసింది
షారూఖ్ ఖాన్ - సిద్దార్థ్ ఆనంద్ కలయికలో తెరకెక్కిన 'పఠాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. అయితే 22వ రోజు మాత్రమ బాగా పడిపోయి రూ. 6 - 6.50 కోట్లు గ్రాస్, రూ. 3 - 3.50 కోట్లు నెట్ వచ్చినట్లు తెలిసింది.

22 రోజులకూ కలిపి ఎంతంటే?
క్రేజీ కాంబినేషన్‌లో స్పై థ్రిల్లర్‌గా రూపొందిన 'పఠాన్' మూవీకి ఓవరాల్‌గా మాత్రం భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 22 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 501.85 కోట్లు వరకూ నెట్ వసూలు అయింది. అలాగే, రూ. 970 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలిసింది. తద్వారా ఈ క్రేజీ మూవీ ఇప్పటికే ఎన్నో రికార్డులను కూడా బ్రేక్ చేసేసింది.

అక్కడ బాహుబలి రికార్డు ఔట్
బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు. ఫలితంగా ఈ మూవీ 3 వారాల్లో ఓవర్సీస్‌లో 44.30 మిలియన్ డాలర్లు (366 కోట్లు) వరకూ రాబట్టింది. తద్వారా ఓవర్సీస్‌లో ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన బాహుబలి 2 (44 మిలియన్లు) రికార్డును బ్రేక్ చేసింది. అలాగే, ఆస్ట్రేలియాలోనూ ఈ సినిమాను దాటేసి చరిత్ర సృష్టించింది.

తొలి షాక్.. అయినా ఆ మార్క్
పాన్ ఇండియా సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' చిత్రానికి 22వ రోజు చాలా తక్కువ వసూళ్లు వచ్చాయి. అంటే ఇది విడుదలైన తర్వాత తొలి షాక్ తగిలినట్లు అయింది. అయితే, 22 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 500 కోట్లు నెట్‌ను వసూలు చేసింది. తద్వారా బాలీవుడ్‌లో ఈ మార్కును సాధించిన తొలి చిత్రంగా నిలిచింది.


Click it and Unblock the Notifications











