Pathaan 23 Days Collections: పఠాన్ మరో సంచలనం.. అన్ని కోట్లు వస్తే బాహుబలి ఔట్.. ఇండియాలో ఫస్ట్ మూవీ
విలక్షణమైన నటనతో పాటు విభిన్నమైన సినిమాలు చేస్తూ ఇండియన్ సినిమాలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న సూపర్ స్టార్ హీరోనే బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్. దాదాపు నలభై ఏళ్లుగా వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న ఆయన.. ఈ మధ్య కాలంలో చాలా గ్యాప్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే గత జనవరిలో షారూఖ్ 'పఠాన్' అనే మూవీతో వచ్చాడు. దీనికి ఆరంభం నుంచే భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా కలెక్షన్లు పోటెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'పఠాన్' మూవీ 23 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరే చూడండి!

పఠాన్‌గా ఎంటరైన షారూఖ్ ఖాన్
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన సినిమానే 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం కీలక పాత్రను చేశాడు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ చిన్న పాత్రలో కనిపించాడు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. విశాల్ శేఖర్ దీనికి సంగీతం సమకూర్చాడు.

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'పఠాన్'పై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్‌కు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 - 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అందుకు అనుగుణంగానే దాదాపు 8000లకు పైగా థియేటర్లలో దీన్ని రిలీజ్ చేశారు.

22 రోజుల్లో ఎంత వచ్చిందంటే
షారూఖ్ ఖాన్ - సిద్దార్థ్ ఆనంద్ కాంబోలో రూపొందిన యాక్షన్ మూవీ 'పఠాన్'కు ఆరంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీ స్థాయిలోనే వస్తున్నాయి. ఇలా 22 రోజుల్లో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 502.45 కోట్లు నెట్, రూ. 970 కోట్లు గ్రాస్ వచ్చింది.

23వ రోజు ఎంత కలెక్ట్ చేసింది
షారూఖ్ ఖాన్ - దీపిక పదుకొణె జంటగా నటించిన 'పఠాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. అయితే 23వ రోజు మాత్రమ బాగా పడిపోయి రూ. 6 - 8 కోట్లు గ్రాస్, రూ. 3 - 3.25 కోట్లు నెట్ వచ్చినట్లు తెలిసింది.

23 రోజులకూ కలిపి ఎంతంటే?
స్పై థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన 'పఠాన్' మూవీకి ఓవరాల్‌గా మాత్రం భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 23 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 505.50 కోట్లు వరకూ నెట్ వసూలు అయింది. అలాగే, రూ. 976 - 978 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలిసింది. ఇక, రూ. 500 కోట్లు నెట్ సాధించిన ఏకైక బాలీవుడ్ మూవీగా చరిత్రను సృష్టించింది.

అక్కడ బాహుబలి రికార్డు ఔట్
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే విదేశాల్లో కూడా ఈ సినిమా భారీ స్పందనను సొంతం చేసుకుంది. అలాగే, కలెక్షన్లను కూడా అత్యధికంగానే రాబట్టింది. ఫలితంగా ఈ మూవీ 23 రోజుల్లో ఓవర్సీస్‌లో 44.40 మిలియన్ డాలర్లు (367 కోట్లు) వరకూ వసూళ్లను రాబట్టింది.

8 కోట్లు వస్తే బాహుబలి అవుట్
ఇండియన్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో కలెక్షన్లు దక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ చిత్రం ఏకంగా రూ. 502 కోట్లు నెట్‌ను వసూలు చేసింది. దీంతో హిందీలో అత్యధిక కలెక్షన్లను సాధించిన 'బాహుబలి 2' (510 కోట్లు)కు చేరువగా వచ్చింది. అంటే మరో 8 కోట్లు వస్తే ఇండియాలో టాప్ మూవీ అవుతుంది.


Click it and Unblock the Notifications











