Pathaan 24 Days Collections: వెయ్యి కోట్లకు ఇదే బెస్ట్ ఛాన్స్.. ఇప్పటివరకు వచ్చిన మొత్తం ఎంతంటే?
జీరో సినిమా తర్వాత షారుక్ ఖాన్ నిజంగానే జీరో అయ్యాడు అని భిన్న రకాల ట్రోల్లింగ్స్ అయితే వచ్చాయి. కానీ ఆ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న బాలీవుడ్ బాద్షా మొత్తానికి పఠాన్ సినిమాతో బాక్సాఫీస్ ను ఒక్కసారిగా షేక్ చేసేసాడు. షారుక్ ఖాన్ రెచ్చిపోతే ఎలా ఉంటుందో పఠాన్ సినిమాతో పర్ఫెక్ట్ గా చూపించాడు. ఇక పఠాన్ సినిమా విడుదలై మూడు వారాలు అయినా కూడా ఇంకా బాక్సాఫీస్ వద్ద కోట్లల్లోనే కలెక్షన్స్ అందుకుంటుంది. ఇక మొత్తంగా 24వ రోజు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది? అలాగే ఈ వారం కూడా మంచి కలెక్షన్స్ వస్తే మొత్తం ఎంత? వస్తాయి అనే వివరాల్లోకి వెళితే..

పనైపోయింది అనుకున్నారు
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేసిన షారుక్ ఖాన్ పఠాన్ సినిమా కంటే ముందు తీవ్ర స్థాయిలో కొంత డిజాస్టర్స్ ను చూడాల్సి వచ్చింది. షారుఖ్ నుంచి చివరగా వచ్చిన జీరో సినిమా ఊహించని విధంగా దెబ్బకొట్టింది. ఆ సినిమా దారుణంగా నష్టాలను కలిగించింది. దీంతో షారుక్ ఖాన్ పని అయిపోయింది అని అందరూ అనుకున్నారు. అంతేకాకుండా అతను సినిమాలకు రిటైర్మెంట్ కూడా ఇస్తున్నాడు అని అనుకున్నారు. కానీ పఠాన్ దెబ్బతోనే తన సత్తా ఏమిటో చూపించాడు.

ఎవరు ఊహించలేదు..
పఠాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో లాభాలను అందిస్తోంది. అసలు ఈ సినిమా ఈ రేంజ్ లో సక్సెస్ అవుతుంది అని ఎవరు ఊహించలేదు. జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో దీపికా పదుకొనే అందచందాలు అలాగే సల్మాన్ ఖాన్ అతిధి పాత్ర కూడా ఎంతగానో ఉపయోగపడింది. ఇక దర్శకుడు సిద్ధార్థ ఆనంద్ మేకింగ్ విధానం యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ వాల్యూస్ మొత్తానికి పఠాన్ బాలీవుడ్ కు సరికొత్త ఊపిరిపోసింది.

సరికొత్త రికార్డులు
ఇక పటాన్ సినిమా కేవలం షారుక్ ఖాన్ కు మాత్రమే కాకుండా యష్ రాజ్ ఫిలిమ్స్ స్థాయిని పెంచే విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ప్రాఫిట్స్ అందిస్తోంది. ఈ సినిమా కలెక్షన్స్ తోనే రోజురోజుకు సరికొత్తగా షాక్ ఇస్తుంది. ఇక ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద 23 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 52 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ అందుకుంది. అంటే ప్రపంచ వ్యాప్తంగా 970 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

24వ రోజుల కలెక్షన్స్
ఇక 24వ రోజు కూడా ఈ సినిమాకు అదిరిపోయేలా కలెక్షన్స్ వచ్చాయి. ఇండియా మొత్తంలో కూడా 24 రోజుల్లో పటాన్ సినిమా 508.10 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఈ రేంజ్ లో ఈ సినిమా కలెక్షన్స్ అందుకుంటుంది అని ఎవరు ఊహించలేదు ఇక ఇండియా మొత్తంలో కూడా ఈ సినిమాకు 612 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

టోటల్ కలెక్షన్స్
ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఓవర్సీస్ లో చాలా ఏరియాలలో పటాన్ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఇక ఓవర్సీస్ లో ఇప్పటివరకు అత్యధిక 369 కోట్ల కలెక్షన్స్ అందుకోవడం విశేషం. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే పటాన్ సినిమాకు టోటల్ 981 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

వెయ్యి కోట్లకు ఇదే మంచి ఛాన్స్
పటాన్ సినిమా తప్పకుండా 1000 కోట్లను టచ్ చేస్తుంది అని అందరూ కూడా ఒక అంచనా తో ఉన్నారు. ఎందుకంటే ఈ వీకెండ్ లోనే సినిమాకు కలెక్షన్స్ ఎక్కువ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. శనివారం శివరాత్రి కావడం అలాగే ఆదివారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ రెండు రోజుల్లో సినిమా ఎంతో కొంత నెంబర్స్ పెంచుకోగలిగితే ఈజీగా 990 కోట్లను దాటే అవకాశం ఉంది ఇక మిగతా వారం రోజుల్లో సినిమాకు మరో 10 కోట్లు వస్తే 1000 కోట్లను టచ్ చేస్తుంది.


Click it and Unblock the Notifications











