Pathaan 25 Days Collections: పఠాన్ మరో సంచలనం.. బాహుబలి టాప్ రికార్డు బద్దలు.. ఇండియాలో ఏకైక మూవీగా!

ఇండియాలో ప్రస్తుతం ఎంతో మంది సూపర్ స్టార్ హీరోలు ఉన్నారు. అయితే, రెండు మూడు దశాబ్దాల క్రితం మాత్రం చాలా తక్కువ మందే ఉండేవాళ్లు. అందులో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ ఒకడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ తన రేంజ్‌ను ఏమాత్రం తగ్గించుకోకుండా ముందుకు సాగుతోన్న అతడు.. ఇటీవలే 'పఠాన్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

దీనికి ఆరంభం నుంచే భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా కలెక్షన్లు ఇప్పటికీ పోటెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'పఠాన్' మూవీ 25 రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!

పఠాన్‌గా వచ్చేసి షారూఖ్ ఖాన్

పఠాన్‌గా వచ్చేసి షారూఖ్ ఖాన్

బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన సినిమానే 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం కీలక పాత్రను చేశాడు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ చిన్న పాత్రలో కనిపించాడు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. విశాల్ శేఖర్ దీనికి సంగీతాన్ని అందించారు.

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్

స్పై థ్రిల్లర్ కాన్సెప్టుతో రూపొందిన 'పఠాన్'పై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్‌కు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 - 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అందుకు అనుగుణంగానే దాదాపు 8000లకు పైగా థియేటర్లలో దీన్ని తీసుకు వచ్చారు.

24 రోజుల్లో ఎంత వచ్చిందంటే

24 రోజుల్లో ఎంత వచ్చిందంటే

షారూఖ్ ఖాన్ - దీపికా పదుకొణె జంటగా నటించిన యాక్షన్ మూవీ 'పఠాన్'కు ఆరంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీ స్థాయిలోనే వస్తున్నాయి. ఇలా 24 రోజుల్లో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 508.10 కోట్లు నెట్‌, రూ. 981 కోట్లు గ్రాస్ వచ్చింది.

 25వ రోజు ఎంత కలెక్ట్ చేసింది

25వ రోజు ఎంత కలెక్ట్ చేసింది

షారూఖ్ ఖాన్ - సిద్దార్థ్ ఆనంద్ కాంబినేషన్‌లో వచ్చిన 'పఠాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే 25వ రోజు కూడా ఈ సినిమాకు రూ. 9 - 10 కోట్లు గ్రాస్, రూ. 5 - 5.25 కోట్లు నెట్ వచ్చినట్లు తెలిసింది.

25 రోజులకూ కలిపి ఎంతంటే?

25 రోజులకూ కలిపి ఎంతంటే?

క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'పఠాన్' మూవీకి ఓవరాల్‌గా మాత్రం భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 25 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 511.50 కోట్లు వరకూ నెట్ వసూలు అయింది. అలాగే, రూ. 988 - 990 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఈ చిత్రం ఎన్నో గొప్ప గొప్ప రికార్డులను కూడా బ్రేక్ చేసేసింది.

అక్కడ కూడా భారీ వసూళ్లతో

అక్కడ కూడా భారీ వసూళ్లతో

సీనియర్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే విదేశాల్లో కూడా ఈ సినిమా భారీ స్పందనను సొంతం చేసుకుంది. అలాగే, కలెక్షన్లను కూడా అత్యధికంగానే రాబట్టింది. ఫలితంగా ఈ మూవీ 25 రోజుల్లో ఓవర్సీస్‌లో 45 మిలియన్ డాలర్లు (372 కోట్లు) వరకూ వసూళ్లను కూడా రాబట్టింది.

బాహుబలి టాప్ రికార్డు బ్రేక్

బాహుబలి టాప్ రికార్డు బ్రేక్

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో కలెక్షన్లు దక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ చిత్రం ఏకంగా రూ. 511 కోట్లు వరకూ నెట్‌ను వసూలు చేసింది. దీంతో హిందీలో అత్యధిక కలెక్షన్లను సాధించిన 'బాహుబలి 2' (510 కోట్లు) రికార్డును బ్రేక్ చేసింది. తద్వారా ఇండియాలోనే టాప్ మూవీగా ఇది ఘనతను సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X