Pathaan 26 Days Collections: సండే ఊహించని వసూళ్లు.. అన్ని వందల కోట్ల లాభాలు.. 3 కోట్లు వస్తే చరిత్రే

ప్రత్యేకమైన శైలి యాక్టింగ్‌తో పాటు కమర్షియల్ చిత్రాలు చేస్తూ.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండియాలోనే సూపర్ స్టార్‌గా వెలుగొందుతోన్నాడు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్. హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసే ఆయన.. దాదాపు ఐదేళ్ల పాటు గ్యాప్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే షారూఖ్ 'పఠాన్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభం నుంచే భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా కలెక్షన్లు ఇప్పటికీ పోటెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'పఠాన్' మూవీ 26 రోజుల రిపోర్టును చూడండి!

పఠాన్‌గా షారూఖ్ ఖాన్ ఊరమాస్

పఠాన్‌గా షారూఖ్ ఖాన్ ఊరమాస్

సీనియర్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన సినిమానే 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం కీలక పాత్రను చేశాడు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ చిన్న పాత్రలో కనిపించాడు. విశాల్ శేఖర్ దీనికి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు.

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్


యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'పఠాన్'పై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్‌కు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 260 - 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అందుకు అనుగుణంగానే దాదాపు 8000లకు పైగా థియేటర్లలో దీన్ని రిలీజ్ చేశారు.

25 రోజుల్లో ఎంత వచ్చిందంటే

25 రోజుల్లో ఎంత వచ్చిందంటే


షారూఖ్ ఖాన్ - దీపికా పదుకొణె కలిసి నటించిన 'పఠాన్' సినిమాకు ఆరంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీ స్థాయిలోనే వస్తున్నాయి. ఇలా 25 రోజుల్లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 511.42 కోట్లు నెట్‌, రూ. 988 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

26వ రోజు ఎంత కలెక్ట్ చేసింది

26వ రోజు ఎంత కలెక్ట్ చేసింది


షారూఖ్ ఖాన్ హీరోగా సిద్దార్థ్ ఆనంద్ రూపొందించిన 'పఠాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే 26వ రోజు కూడా ఈ సినిమాకు రూ. 9 - 10 కోట్లు గ్రాస్, రూ. 5 - 5.50 కోట్లు నెట్ వచ్చినట్లు తెలిసింది.

26 రోజులకూ కలిపి ఎంతంటే?

26 రోజులకూ కలిపి ఎంతంటే?

స్పై థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన 'పఠాన్' మూవీకి ఓవరాల్‌గా మాత్రం భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 26 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 516.50 కోట్లు వరకూ నెట్ వసూలు అయింది. అలాగే, రూ. 997 - 998 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఈ చిత్రం ఎన్నో ఊహించని రికార్డులను సైతం బద్దలు కొట్టేసింది.

ఓవర్సీస్‌లో పెను సంచలనం

ఓవర్సీస్‌లో పెను సంచలనం


బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే విదేశాల్లో కూడా ఈ సినిమా భారీ స్పందనను సొంతం చేసుకుంది. అలాగే, కలెక్షన్లను కూడా అత్యధికంగానే రాబట్టింది. ఫలితంగా ఈ మూవీ 26 రోజుల్లో ఓవర్సీస్‌లో 45.5 మిలియన్ డాలర్లు (376 కోట్లు) వరకూ వసూళ్లను కూడా రాబట్టింది.

లాభాలతో రికార్డు సాధించింది

లాభాలతో రికార్డు సాధించింది

షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో కలెక్షన్లు దక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ చిత్రం ఏకంగా రూ. 515 కోట్లు వరకూ నెట్‌ను వసూలు చేసింది. దీంతో రూ. 260 కోట్లు టార్గెట్‌తో వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ. 250 కోట్లు లాభాలను సొంతం చేసుకుని సరికొత్త చరిత్రను సృష్టించింది. అలాగే, 3 కోట్లు వస్తే 1000 కోట్ల మార్కును చేరుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X