Pathaan 27 Days Collections: 1000 కోట్లతో సంచలనం.. టాప్ 5 చిత్రాల్లో ఒకటిగా.. RRRను దాటాలంటే మాత్రం!
ఇండియన్ సినీ చరిత్రలో చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నారు. అందులో బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ ఒకరు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న ఆయన.. ఈ మధ్య కొంత గ్యాప్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే షారూఖ్ 'పఠాన్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభం నుంచే భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా కలెక్షన్లు ఇప్పటికీ పోటెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'పఠాన్' మూవీ 27 రోజుల రిపోర్టు మీకోసమే!

పఠాన్‌గా షారూఖ్ అరాచకం
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన సినిమానే 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం కీలక పాత్రను చేశాడు. విశాల్ శేఖర్ దీనికి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ చిన్న పాత్రలో కనిపించాడు.

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్
స్పై థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన 'పఠాన్'పై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్‌కు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 - 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అందుకు అనుగుణంగానే దాదాపు 8000లకు పైగా థియేటర్లలో దీన్ని విడుదల చేశారు.

26 రోజుల్లో ఎంత వచ్చిందంటే
షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహం కాంబోలో వచ్చిన 'పఠాన్' సినిమాకు ఆరంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీ స్థాయిలోనే వస్తున్నాయి. ఇలా 26 రోజుల్లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 515.67 కోట్లు నెట్, రూ. 996 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

27వ రోజు ఎంత కలెక్ట్ చేసింది
షారూఖ్ ఖాన్ - సిద్దార్థ్ ఆనంద్ కలయికలో రూపొందిన 'పఠాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే 27వ రోజు కూడా ఈ సినిమాకు రూ. 6 - 7 కోట్లు గ్రాస్, రూ. 2 - 2.50 కోట్లు నెట్ వచ్చినట్లు తెలిసింది.

27 రోజులకూ కలిపి ఎంతంటే?
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'పఠాన్' మూవీకి ఓవరాల్‌గా మాత్రం భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 27 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 517.50 కోట్లు వరకూ నెట్ వసూలు అయింది. అలాగే, రూ. 1002 - 1003 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలిసింది. దీంతో రూ. 1000 కోట్లు మార్కును దాటిన చిత్రంగా మరో రికార్డును సాధించింది.

ఓవర్సీస్‌లోనూ అదే దూకుడు
బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే విదేశాల్లో కూడా ఈ సినిమా భారీ స్పందనను సొంతం చేసుకుంది. అలాగే, కలెక్షన్లను కూడా అత్యధికంగానే రాబట్టింది. ఫలితంగా ఈ మూవీ 27 రోజుల్లో ఓవర్సీస్‌లో 45.90 మిలియన్ డాలర్లు (379 కోట్లు) వరకూ వసూళ్లను కూడా రాబట్టింది.

టాప్ మూవీస్‌లో ఐదో స్థానానికి
షారూఖ్ ఖాన్ 'పఠాన్' చిత్రం ఇప్పుడు ఏకంగా రూ. 1000 కోట్లు గ్రాస్ మార్కును కూడా చేరుకుంది. తద్వారా ఈ ఘనతను అందుకున్న ఐదో సినిమాగా నిలిచింది. దీనికంటే ముందు 'దంగల్', 'బాహుబలి 2', RRR, 'కేజీఎఫ్ 2' ఉన్నాయి. ఇప్పుడు 'పఠాన్' మూవీ ఈ జాబితాలో నాలుగో స్థానానికి చేరాలంటే మాత్రం మరో 200 కోట్లు వరకూ రాబట్టాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications











