Pathaan 29 Days Collections: పఠాన్‌కు బిగ్ షాక్.. బాహుబలి రికార్డు సేఫేనా.. లాభాలతో మాత్రం రికార్డు

దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా ఇండియన్ సినిమాపై తనదైన రీతిలో హవాను చూపిస్తూ స్టార్ హీరోగా దూసుకుపోతోన్నాడు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్. విలక్షణమైన నటనతో పాటు పక్కా కమర్షియల్ సినిమాలు ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకున్న ఆయన.. ఈ మధ్య చాలా కాలం గ్యాప్ తీసుకున్నాడు. అయితే, ఇటీవలే షారూఖ్ 'పఠాన్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభం నుంచే భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా కలెక్షన్లు ఇప్పటికీ పోటెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'పఠాన్' మూవీ 29 రోజుల రిపోర్టును మీరే చూసేయండి!

‘పఠాన్‌’గా షారూఖ్ ఊరమాస్

‘పఠాన్‌’గా షారూఖ్ ఊరమాస్

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన సినిమానే 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం కీలక పాత్రను చేశాడు. విశాల్ శేఖర్ దీనికి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్‌ను చేశాడు.

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్

పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'పఠాన్'పై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్‌కు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 - 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అందుకు అనుగుణంగానే దాదాపు 8000లకు పైగా థియేటర్లలో రిలీజ్ అయింది.

28 రోజుల్లో ఎంత వచ్చిందంటే

28 రోజుల్లో ఎంత వచ్చిందంటే


షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణె కలయికలో రూపొందిన 'పఠాన్' సినిమాకు ఆరంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీ స్థాయిలోనే వస్తున్నాయి. ఇలా 28 రోజుల్లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 518.06 కోట్లు నెట్‌, రూ. 1004 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

29వ రోజు ఎంత కలెక్ట్ చేసింది

29వ రోజు ఎంత కలెక్ట్ చేసింది

షారూఖ్ ఖాన్ హీరోగా సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించిన 'పఠాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే 29వ రోజు భారీగా పడిపోయి రూ. 1.75 కోట్లు గ్రాస్, రూ. 85 - 95 లక్షలు నెట్ వచ్చినట్లు తెలిసింది.

29 రోజులకూ కలిపి ఎంతంటే?

29 రోజులకూ కలిపి ఎంతంటే?

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'పఠాన్' మూవీకి ఓవరాల్‌గా మాత్రం భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 29 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 519 కోట్లు వరకూ నెట్ వసూలు అయింది. అలాగే, రూ. 1005 - 1006 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలిసింది. దీంతో చైనాలో రిలీజ్ లేకుండానే రూ. 1000 కోట్లు దాటిన హిందీ సినిమాగా నిలిచింది.

అక్కడ కూడా స్లో అయిందిగా

అక్కడ కూడా స్లో అయిందిగా

బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే విదేశాల్లో కూడా ఈ సినిమా భారీ స్పందనను సొంతం చేసుకుంది. అలాగే, కలెక్షన్లను కూడా అత్యధికంగానే రాబట్టింది. ఫలితంగా ఈ మూవీ 29 రోజుల్లో ఓవర్సీస్‌లో 46.10 మిలియన్ డాలర్లు (382 కోట్లు) వరకూ వసూళ్లను కూడా రాబట్టింది.

బాహుబలి రికార్డు సేఫ్ అని

బాహుబలి రికార్డు సేఫ్ అని

స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' చిత్రానికి రూ. 260 కోట్లు వరకూ బిజినెస్ జరిగింది. దీంతో 29 రోజుల్లోనే ఈ మూవీ రూ. 250 కోట్లకు పైగా లాభాలన సొంతం చేసుకుని సత్తా చాటింది. ఇక, హిందీ వెర్షన్‌ మాత్రమే రూ. 500 కోట్లు నెట్‌ను సాధించిన ఈ చిత్రం.. 'బాహుబలి 2' రికార్డు (510.96 కోట్లు)కు చేరువగా వచ్చింది. కానీ, ఇది చేరడం కష్టమే అని చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X