Pathaan 3 Days Collections: ఇండియాలో టాప్ మూవీగా పఠాన్.. కేజీఎఫ్, బాహుబలికి షాక్.. చిరంజీవినీ దాటి!

ఇండియాలో చాలా మంది సూపర్ స్టార్లు ఉన్నారు. అందులో కొందరు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. వారిలో బాద్‌షా షారూఖ్ ఖాన్ ఒకరు. బాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తోన్న ఆయన.. కొంత కాలం పాటు సినిమాలకు బ్రేక్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సీనియర్ హీరో 'పఠాన్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కింది. దీంతో ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతూ సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో 'పఠాన్' మూడు రోజుల కలెక్షన్ల రిపోర్టును చూద్దాం పదండి!

 పఠాన్‌గా షారూఖ్ ఖాన్ విశ్వరూపం

పఠాన్‌గా షారూఖ్ ఖాన్ విశ్వరూపం

ఇండియన్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రమే 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. ఇందులో జాన్ అబ్రహం కీలక పాత్రను చేశాడు. విశాల్ శేఖర్ ఈ మూవీకి సంగీతం అందించాడు. సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేశాడు.

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 - 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే దీన్ని దాదాపు 8000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

రెండు రోజుల్లో ఎంత వచ్చింది?

రెండు రోజుల్లో ఎంత వచ్చింది?


సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో సీనియర్ పానిండియా స్టార్ షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గానే వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఇలా రెండు రోజుల్లో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 127.50 కోట్లు నెట్, రూ. 219.6 కోట్లు గ్రాస్ వచ్చింది.

మూడో రోజూ భారీగానే రాబట్టి

మూడో రోజూ భారీగానే రాబట్టి

షారూఖ్ ఖాన్ - దీపికా పదుకొనె జంటగా నటించిన 'పఠాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇలా మూడో రోజు ఈ చిత్రానికి ఓవరాల్‌గా రూ. 61 - 64 కోట్లు వరకూ గ్రాస్‌ను వసూలు చేసినట్లు తెలిసింది.

 హిందీలో అరాచకమైన వసూళ్లు

హిందీలో అరాచకమైన వసూళ్లు

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'పఠాన్' మూవీకి హిందీలో మాత్రం భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం హిందీ బెల్ట్‌లోనే మూడో రోజు రూ. 35 కోట్లు వరకూ నెట్‌ కలెక్సన్లను వసూలు చేసింది. ఇలా మూడు రోజుల్లోనే ఈ సినిమా హిందీలో రూ. 165 కోట్లు వరకూ నెట్ వసూలు అయింది. అలాగే, రూ. 300 గ్రాస్ వచ్చినట్లు సమాచారం.

ఓవర్సీస్‌లోనూ భారీ వసూళ్లతో

ఓవర్సీస్‌లోనూ భారీ వసూళ్లతో

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్‌ను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే 'పఠాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు. దీంతో ఈ మూవీ ఏకంగా ఓవర్సీస్‌లో మాత్రమే 4.5 మిలియన్స్ వరకూ సంచలనం సృష్టించింది. ఇక, ఆయా దేశాల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మరో హాఫ్ మిలియన్ డాలర్లకు పైగానే వసూలు చేసింది.

ఆ రికార్డులన్నీ బద్దలు కొట్టేసి

ఆ రికార్డులన్నీ బద్దలు కొట్టేసి

'పఠాన్' మూవీ మూడు రోజుల్లో దాదాపు రూ. 300 కోట్లు వరకూ వసూలు చేసింది. తద్వారా ఇండియాలో మూడు రోజుల్లో ఎక్కువ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ క్రమంలోనే 'కేజీఎఫ్ 2', 'బాహుబలి 2' రికార్డులు బ్రేక్ చేసింది. అలాగే, హిందీలోనూ టాప్ మూవీగా సంచలనం సృష్టించింది. ఇక, 2023లో ఎక్కువ నెట్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ క్రమంలోనే 'వారిసు', 'వాల్తేరు వీరయ్య'ను దాటేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X