Pathaan 3 Weeks Collections: 3 వారాల్లో వందల కోట్లు.. బాహుబలి రికార్డుకు ఎసరు.. అక్కడ రాజమౌళికి చెక్

ఇండియాలో ఎంతో మంది స్టార్ హీరోలు సందడి చేస్తోన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుని సత్తా చాటుతోన్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ ఒకరు. సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న ఆయన.. కొంత గ్యాప్ తర్వాత ఇటీవలే 'పఠాన్' అనే మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభం నుంచే భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా కలెక్షన్లు అత్యధికంగా వస్తూనే ఉన్నాయి. మరి ఆలస్యం లేకుండా 'పఠాన్' మూవీ 21 రోజుల రిపోర్టును చూద్దామా!

పఠాన్‌గా షారూఖ్ ఖాన్ ఎంటర్

పఠాన్‌గా షారూఖ్ ఖాన్ ఎంటర్

బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రమే 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం కీలక పాత్రను చేశాడు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ చిన్న పాత్రలో కనిపించాడు. విశాల్ శేఖర్ దీనికి సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు.

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్

యాక్షన్ మూవీగా రూపొందిన 'పఠాన్'పై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలున్నాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్‌కు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 - 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అందుకు అనుగుణంగానే దాదాపు 8000లకు పైగా థియేటర్లలో దీన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు.

20 రోజుల్లో ఎంత వచ్చిందంటే

20 రోజుల్లో ఎంత వచ్చిందంటే

షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహం కలిసి నటించిన యాక్షన్ మూవీ 'పఠాన్'కు ఆరంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీ స్థాయిలోనే వస్తున్నాయి. ఇలా 19 రోజుల్లో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 493.25 కోట్లు నెట్‌, రూ. 953 కోట్లు గ్రాస్ వచ్చింది.

21వ రోజు ఎంత కలెక్ట్ చేసింది

21వ రోజు ఎంత కలెక్ట్ చేసింది

షారూఖ్ ఖాన్ - సిద్దార్థ్ ఆనంద్ కాంబినేషన్‌లో రూపొందిన 'పఠాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇలా వాలంటైన్స్ డే అయిన 21వ రోజు కాస్త పెరిగి రూ. 12 - 14 కోట్లు గ్రాస్, రూ. 6 - 7 కోట్లు నెట్ వచ్చినట్లు తెలిసింది.

3 వారాలకూ కలిపి ఎంతంటే?

3 వారాలకూ కలిపి ఎంతంటే?

పూర్తి స్థాయిలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'పఠాన్' మూవీకి హిందీలో మాత్రం భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 3 వారాల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 500 కోట్లు వరకూ నెట్ వసూలు అయింది. అలాగే, రూ. 965 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలిసింది. తద్వారా ఈ క్రేజీ మూవీ ఇప్పటికే ఎన్నో రికార్డులను నమోదు చేసింది.

ఓవర్సీస్‌లోనూ బాహుబలితో

ఓవర్సీస్‌లోనూ బాహుబలితో


బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్‌కు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకు అనుగుణంగానే 'పఠాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు. ఫలితంగా ఈ మూవీ 3 వారాల్లో ఓవర్సీస్‌లో 44 మిలియన్ డాలర్లు (364 కోట్లు) వరకూ రాబట్టింది. తద్వారా ఓవర్సీస్‌లో ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన బాహుబలి 2 (44 మిలియన్లు) రికార్డును సమం చేసేసింది.

మరో బాహుబలి రికార్డు ఎసరు

మరో బాహుబలి రికార్డు ఎసరు

ఇండియన్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' 3 వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 500 కోట్లు నెట్‌ను వసూలు చేసింది. తద్వారా బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలను ఒక్కొక్కటిగా దాటుకుంటూ వచ్చింది. ఇక, ఈ లిస్టులో టాప్‌లో ఉన్న 'బాహుబలి 2' రికార్డుకు (రూ. 511 కోట్లు) కూడా ఇధి ఎసరు పెట్టేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X