Pathaan 30 Days Collections: మళ్లీ వసూళ్లు డౌన్.. వందల కోట్ల లాభాలు.. అన్ని కోట్లు వస్తే బాహుబలి ఔట్

సుదీర్ఘ కాలంగా ఇండియన్ సినిమాలతో తనదైన రీతిలో ప్రేక్షకులను అలరిస్తూ.. స్టార్ హీరోగా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నాడు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన ఆయన.. ఈ మధ్య చాలా కాలం గ్యాప్ తీసుకున్నాడు. అయితే, ఇటీవలే షారూఖ్ 'పఠాన్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభం నుంచే భారీ స్పందన దక్కుతోంది. అయితే, ఇప్పుడు వసూళ్లు డౌన్ అవుతోన్నాయి. ఈ నేపథ్యంలో 'పఠాన్' మూవీ 30 రోజుల రిపోర్టును మీరే చూసేయండి మరి!

‘పఠాన్‌’గా ఎంటరైన షారూఖ్

‘పఠాన్‌’గా ఎంటరైన షారూఖ్

బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన సినిమానే 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం కీలక పాత్రను చేశాడు. విశాల్ శేఖర్ దీనికి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ అదిరిపోయే రోల్ చేశాడు.

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్

ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన 'పఠాన్'పై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్‌కు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 - 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అందుకు తగ్గట్లుగానే దాదాపు 8000లకు పైగా థియేటర్లలో దీన్ని తీసుకొచ్చారు.

29 రోజుల్లో ఎంత వచ్చిందంటే

29 రోజుల్లో ఎంత వచ్చిందంటే

షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణె జోడీగా నటించిన 'పఠాన్' సినిమాకు ఆరంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీ స్థాయిలోనే వస్తున్నాయి. ఇలా 29 రోజుల్లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 519.59 కోట్లు నెట్‌, రూ. 1006 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

30వ రోజు ఎంత కలెక్ట్ చేసింది

30వ రోజు ఎంత కలెక్ట్ చేసింది

షారూఖ్ ఖాన్ - సిద్దార్థ్ ఆనంద్ కాంబోలో వచ్చిన 'పఠాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే 30వ రోజు భారీగా పడిపోయి రూ. 1.50 కోట్లు గ్రాస్, రూ. 60 లక్షలు నెట్ వచ్చినట్లు తెలిసింది.

30 రోజులకూ కలిపి ఎంతంటే?

30 రోజులకూ కలిపి ఎంతంటే?

ఎంతో మంది స్టార్లు నటించిన 'పఠాన్' మూవీకి ఓవరాల్‌గా మాత్రం భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 30 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 520.16 కోట్లు నెట్ వసూలు అయింది. ఇందులో రూ. 18.06 కోట్లు నెట్ దక్షిణాది భాషల నుంచి వసూలు అయింది. అలాగే, ఈ మూవీ రూ. 1007.50 - 1008 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలిసింది.

ఓవర్సీస్‌లో అన్ని కోట్లతో రచ్చ

ఓవర్సీస్‌లో అన్ని కోట్లతో రచ్చ

ఇండియన్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే విదేశాల్లో కూడా ఈ సినిమా భారీ స్పందనను సొంతం చేసుకుంది. అలాగే, కలెక్షన్లను కూడా అత్యధికంగానే రాబట్టింది. ఫలితంగా ఈ మూవీ 30 రోజుల్లో ఓవర్సీస్‌లో 46.20 మిలియన్ డాలర్లు (380 కోట్లు) వరకూ వసూళ్లను కూడా రాబట్టింది.

బాహుబలికి అన్ని కోట్లు దూరం

బాహుబలికి అన్ని కోట్లు దూరం

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన యాక్షన్ మూవీ 'పఠాన్'కు మొత్తంగా రూ. 260 కోట్లు వరకూ బిజినెస్ జరిగింది. దీంతో 30 రోజుల్లోనే ఈ మూవీ రూ. 260 కోట్ల వరకూ లాభాలను సొంతం చేసుకుని సత్తా చాటింది. ఇక, హిందీ వెర్షన్‌ మాత్రమే రూ. 502.10 కోట్లు నెట్‌ను సాధించిన ఈ చిత్రం.. 'బాహుబలి 2' రికార్డు (511 కోట్లు)కు రూ. 8.90 కోట్లు దూరంలో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X