Pathaan 31 Days Collections: మళ్లీ పెరిగిన వసూళ్లు.. మన సినిమానే టార్గెట్.. 31 రోజుల్లో వందల కోట్లు

బాలీవుడ్‌లో దాదాపు నాలుగున్నర దశాబ్దాలకు పైగానే హవాను చూపిస్తూ నెంబర్ వన్ హీరోగా వెలుగొందుతోన్నాడు బాద్‌షా షారూఖ్ ఖాన్. ఇలా సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న ఆయన.. ఏకధాటిగా సినిమాలు చేస్తూ వచ్చాడు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం గ్యాప్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే షారూఖ్ 'పఠాన్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభం నుంచే భారీ స్పందన వస్తోంది. ఇదే ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. ఈ నేపథ్యంలో 'పఠాన్' సినిమా 31 రోజుల రిపోర్టును మీరే చూసేయండి మరి!

 ‘పఠాన్‌'గా వచ్చేసిన షారూఖ్

‘పఠాన్‌'గా వచ్చేసిన షారూఖ్

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన యాక్షన్ మూవీనే 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం కీలక పాత్రను చేశాడు. విశాల్ శేఖర్ దీనికి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించాడు.

 పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్

భారీ స్థాయి యాక్షన్ చిత్రంగా రూపొందిన 'పఠాన్'పై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్‌కు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 - 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అందుకు తగ్గట్లుగానే దాదాపు 8000లకు పైగా థియేటర్లలో దీన్ని రిలీజ్ చేశారు.

30 రోజుల్లో ఎంత వచ్చిందంటే

30 రోజుల్లో ఎంత వచ్చిందంటే

షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహం కలిసి నటించిన 'పఠాన్' సినిమాకు ఆరంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీ స్థాయిలోనే వస్తున్నాయి. ఇలా 30 రోజుల్లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 520.06 కోట్లు నెట్‌, రూ. 1009 కోట్లు గ్రాస్‌ను వసూలైంది.

31వ రోజు ఎంత కలెక్ట్ చేసింది

31వ రోజు ఎంత కలెక్ట్ చేసింది

సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే 31వ రోజు కూడా దీనికి కాస్త పెరిగి రూ. 3 కోట్లు గ్రాస్, రూ. 1.35 కోట్లు నెట్ వచ్చినట్లు తెలిసింది.

31 రోజులకూ కలిపి ఎంతంటే?

31 రోజులకూ కలిపి ఎంతంటే?

స్పై థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన 'పఠాన్' మూవీకి ఓవరాల్‌గా మాత్రం భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 31 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 521.41 కోట్లు నెట్ వసూలు అయింది. ఇందులో రూ. 18.11 కోట్లు నెట్ దక్షిణాది భాషల నుంచి వసూలైంది. అలాగే, ఈ మూవీ రూ. 1011 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

ఓవర్సీస్‌లో అదే రేంజ్‌లోనే

ఓవర్సీస్‌లో అదే రేంజ్‌లోనే

బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే విదేశాల్లో కూడా ఈ సినిమా భారీ స్పందనను సొంతం చేసుకుంది. అలాగే, కలెక్షన్లను కూడా అత్యధికంగానే రాబట్టింది. ఫలితంగా ఈ మూవీ 31 రోజుల్లో ఓవర్సీస్‌లో 46.40 మిలియన్ డాలర్లు (380 కోట్లు) వరకూ వసూళ్లను సంపాదించుకుంది.

బాహుబలికి రికార్డుకు చేరువ

బాహుబలికి రికార్డుకు చేరువ

పాన్ ఇండియా స్టార్ షారూఖ్ ఖాన్ నటించిన యాక్షన్ మూవీ 'పఠాన్'కు మొత్తంగా రూ. 260 కోట్లు వరకూ బిజినెస్ అయింది. దీంతో 31 రోజుల్లోనే ఈ మూవీ రూ. 260 కోట్లకు పైగా లాభాలను సొంతం చేసుకుంది. ఇక, హిందీ వెర్షన్‌ మాత్రమే రూ. 503.30 కోట్లు నెట్‌ను సాధించిన ఈ చిత్రం.. 'బాహుబలి 2' రికార్డు (511 కోట్లు)కు రూ. 7.70 కోట్లు దూరంలోనే ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X