Pathaan 32 Days Collections: మళ్లీ కుమ్మేసిన పఠాన్.. ఏకంగా అన్ని కోట్లు.. ప్రభాస్ రికార్డుకు చేరువ
ఇండియన్ సినిమాలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా స్టార్ హీరోగా హవాను చూపిస్తున్నాడు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్. కెరీర్ ఆరంభం నుంచీ హిట్లు ఫ్లాపులు పట్టించుకోకుండా సినిమాలు చేస్తోన్న ఆయన.. ఈ మధ్య కాలంలో మాత్రం చాలా బ్రేక్ తీసుకున్నాడు. ఈ పరిస్థితుల్లో ఇటీవలే 'పఠాన్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభం నుంచే భారీ స్పందన వస్తోంది. ఇదే ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. ఈ నేపథ్యంలో 'పఠాన్' సినిమా 32 రోజుల రిపోర్టును మీరే చూసేయండి!

‘పఠాన్'గా షారూఖ్ విశ్వరూపం
బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ నటించిన తాజా సినిమానే 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం కీలక పాత్రను చేశాడు. విశాల్ శేఖర్ దీనికి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్‌ను చేశాడు.

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్
హై బడ్జెట్‌తో యాక్షన్ మూవీగా రూపొందిన 'పఠాన్'పై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్‌కు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 - 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అందుకు తగ్గట్లుగానే దాదాపు 8000లకు పైగా థియేటర్లలో దీన్ని తీసుకొచ్చారు.

31 రోజుల్లో ఎంత వచ్చిందంటే
క్రేజీ స్టార్ కాస్ట్‌తో రూపొందిన 'పఠాన్' సినిమాకు ఆరంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీ స్థాయిలోనే వస్తున్నాయి. ఇలా 31 రోజుల్లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 521.18 కోట్లు నెట్, రూ. 1011 కోట్లు గ్రాస్‌ను వసూలైనట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

32వ రోజు ఎంత కలెక్ట్ చేసింది
షారూఖ్ ఖాన్ - దీపికా జంటగా సిద్దార్థ్ ఆనంద్ తీసిన 'పఠాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే 32వ రోజు కూడా దీనికి కాస్త పెరిగి రూ. 6 కోట్లు గ్రాస్, రూ. 2.05 కోట్లు నెట్ వచ్చినట్లు తెలిసింది.

32 రోజులకూ కలిపి ఎంతంటే?
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'పఠాన్' మూవీకి ఓవరాల్‌గా మాత్రం భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 32 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 523.23 కోట్లు నెట్ వసూలు అయింది. ఇందులో రూ. 18.13 కోట్లు నెట్ దక్షిణాది భాషల నుంచి వచ్చింది. అలాగే, ఈ మూవీ రూ. 1017 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

ఓవర్సీస్‌లో మళ్లీ పుంజుకుని
స్పై థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన 'పఠాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే విదేశాల్లో కూడా ఈ సినిమా భారీ స్పందనను సొంతం చేసుకుంది. అలాగే, కలెక్షన్లను కూడా అత్యధికంగానే రాబట్టింది. ఫలితంగా ఈ మూవీ 32 రోజుల్లో ఓవర్సీస్‌లో 46.60 మిలియన్ డాలర్లు (383 కోట్లు) వరకూ వసూళ్లను రాబట్టి సత్తా చాటుకుంది.

ప్రభాస్ రికార్డుకు దగ్గరగానే
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన యాక్షన్ మూవీ 'పఠాన్' 32 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 523.23 కోట్లు నెట్‌ను వసూలు చేసింది. అందులో హిందీ వెర్షన్‌కు మాత్రమే రూ. 505.10 కోట్లు నెట్ వచ్చింది. తద్వారా 'బాహుబలి 2' హిందీ వెర్షన్ ఫుల్ రన్‌లో సాధించిన రికార్డు (511 కోట్లు)కు చేరువైంది. ఇది రూ. 5.90 కోట్లు రాబడితే టాప్ ప్లేస్‌కు చేరుతుంది.


Click it and Unblock the Notifications











