Pathaan 34 Days Collections: పఠాన్ వీర విహారం.. లాభాలే వందల కోట్లు.. బాహుబలికి ఎన్ని కోట్ల దూరమంటే!

దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా ఇండియన్ సినిమాపై తన ప్రభావాన్ని చూపిస్తూ టాప్ హీరోగా వెలుగొందుతోన్నాడు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్. విభిన్నమైన చిత్రాలను చేస్తూ సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తోన్న ఆయన.. ఈ మధ్య కాలంలో మాత్రం చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే షారూఖ్ 'పఠాన్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభం నుంచే భారీ స్పందన వస్తోంది. ఇదే 5 వారంలోనూ కంటిన్యూ అవుతోంది. ఈ నేపథ్యంలో 'పఠాన్' సినిమా 34 రోజుల రిపోర్టును మీరే చూసేయండి!

‘పఠాన్‌’గా షారూఖ్ వచ్చేశాడు

‘పఠాన్‌’గా షారూఖ్ వచ్చేశాడు

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన తాజా సినిమానే 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం కీలక పాత్రను చేశాడు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్‌‌లో కనిపించాడు. విశాల్ శేఖర్ దీనికి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు.

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్

భారీ బడ్జెట్‌తో రూపొందిన 'పఠాన్'పై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్‌కు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 - 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అందుకు తగ్గట్లుగానే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8000లకు పైగా థియేటర్లలో దీన్ని రిలీజ్ చేశారు.

33 రోజుల్లో ఎంత వచ్చిందంటే

33 రోజుల్లో ఎంత వచ్చిందంటే

ఎంతో మంది స్టార్లు కలిసి నటించిన 'పఠాన్' సినిమాకు ఆరంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీ స్థాయిలోనే వస్తున్నాయి. ఇలా 33 రోజుల్లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 525.76 కోట్లు నెట్‌, రూ. 1020 కోట్లు గ్రాస్‌ను వసూలైనట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

34వ రోజు ఎంత కలెక్ట్ చేసింది

34వ రోజు ఎంత కలెక్ట్ చేసింది

షారూఖ్ ఖాన్ - సిద్దార్థ్ ఆనంద్ కాంబినేషన్‌లో రూపొందిన 'పఠాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే 34వ రోజు కూడా దీనికి కాస్త పెరిగి రూ. 2.25 కోట్లు గ్రాస్, రూ. 90 లక్షలు - 1 కోటి నెట్ వసూలైంది.

34 రోజులకూ కలిపి ఎంతంటే?

34 రోజులకూ కలిపి ఎంతంటే?

స్పై థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన 'పఠాన్' మూవీకి ఓవరాల్‌గా మాత్రం భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 34 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 526.70 కోట్లు నెట్ వసూలు అయింది. ఇందులో రూ. 18.20 కోట్లు నెట్ దక్షిణాది భాషల నుంచి వచ్చింది. అలాగే, ఈ మూవీ రూ. 1022 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఓవర్సీస్‌లో మళ్లీ స్లో అయింది

ఓవర్సీస్‌లో మళ్లీ స్లో అయింది

పూర్తి స్థాయి యాక్షన్ నేపథ్యంలో రూపొందిన 'పఠాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే విదేశాల్లో కూడా ఈ సినిమా భారీ స్పందనను సొంతం చేసుకుంది. అలాగే, కలెక్షన్లను కూడా అత్యధికంగానే రాబట్టింది. ఫలితంగా ఈ మూవీ 34 రోజుల్లో ఓవర్సీస్‌లో 46.85 మిలియన్ డాలర్లు (384 కోట్లు) వరకూ వసూళ్లను రాబట్టింది.

బాహుబలికి ఎంత దూరమంటే

బాహుబలికి ఎంత దూరమంటే


షారూఖ్ ఖాన్ నటించిన యాక్షన్ మూవీ 'పఠాన్' 34 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 526.70 కోట్లు నెట్‌ను వసూలు చేసింది. అందులో హిందీ వెర్షన్‌‌కు మాత్రమే రూ. 508.60 కోట్లు నెట్‌ వచ్చింది. తద్వారా 'బాహుబలి 2' రికార్డు (511 కోట్లు)కు చేరువైంది. ఇది రూ. 2.40 కోట్లు రాబడితే టాప్ ప్లేస్‌కు చేరుతుంది. ఇక, ఈ చిత్రం ఇప్పటికే రూ. 260 కోట్ల లాభాలను అందుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X