Pathaan 36 Days Collections: పఠాన్‌కు ఊహించని వసూళ్లు.. వామ్మో అన్ని కోట్లా.. బాహుబలికి షాకిచ్చేలా!
బాలీవుడ్ హీరోగా వచ్చినా.. దేశ వ్యాప్తంగా కాదు కాదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకుని.. సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో సందడి చేస్తోన్నాడు బాద్‌షా షారూఖ్ ఖాన్. రిజల్ట్‌తో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తోన్న ఆయన.. ఈ మధ్య కాలంలో మాత్రం చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇటీవలే షారూఖ్ 'పఠాన్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి మొదటి నుంచీ భారీ వసూళ్లు వస్తున్నాయి. ఇదే 6 వారంలోనూ కంటిన్యూ అవుతోంది. ఈ నేపథ్యంలో 'పఠాన్' సినిమా 36 రోజుల రిపోర్టును చూడండి!

పఠాన్‌గా షారూఖ్ ఖాన్ ఎంటర్
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన తాజా సినిమానే 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం విలన్‌గా నటించాడు. అలాగే, మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేశాడు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. విశాల్ శేఖర్ దీనికి సంగీతాన్ని అందించారు.

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్
షారూఖ్, దీపిక, జాన్ కలిసి నటించిన 'పఠాన్'పై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్‌కు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 - 260 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అందుకు తగ్గట్లుగానే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8000లకు పైగా థియేటర్లలో దీన్ని రిలీజ్ చేశారు.

35 రోజుల్లో ఎంత వచ్చిందంటే
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'పఠాన్' సినిమాకు ఆరంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీ స్థాయిలోనే వస్తున్నాయి. ఇలా 35 రోజుల్లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 527.36 కోట్లు నెట్, రూ. 1023 కోట్లు గ్రాస్‌ను వసూలైనట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

36వ రోజు ఎంత కలెక్ట్ చేసింది
షారూఖ్ ఖాన్ - సిద్దార్థ్ ఆనంద్ కాంబోలో వచ్చిన 'పఠాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో రిలీజ్ చేసుకున్నారు. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే 36వ రోజు కూడా దీనికి వసూళ్లు తగ్గి రూ. 1.50 కోట్లు గ్రాస్, రూ. 71 - 73 లక్షలు నెట్ వసూలైంది.

36 రోజులకూ కలిపి ఎంతంటే?
చాలా గ్యాప్ తర్వాత షారూఖ్ నటించిన 'పఠాన్' మూవీకి ఓవరాల్‌గా మాత్రం భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 36 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 528.06 కోట్లు నెట్ వసూలైది. ఇందులో రూ. 18.22 కోట్లు నెట్ దక్షిణాది భాషల నుంచి వచ్చింది. అలాగే, ఈ మూవీ రూ. 1024.50 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఓవర్సీస్‌లో ఎంత వచ్చింది?
ఎంతో మంది స్టార్లు కలిసి నటించిన 'పఠాన్' చిత్రాన్ని షారూఖ్ ఖాన్ క్రేజ్ వల్ల చాలా దేశాల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అందుకు తగ్గట్లుగానే విదేశాల్లో కూడా ఈ సినిమా భారీ స్పందనను సొంతం చేసుకుంది. అలాగే, కలెక్షన్లను కూడా అత్యధికంగానే రాబట్టింది. ఫలితంగా ఈ మూవీ 36 రోజుల్లో ఓవర్సీస్‌లో 46.95 మిలియన్ డాలర్లు (385.50 కోట్లు) వరకూ వసూళ్లను రాబట్టింది.

బాహుబలికి షాకిచ్చేలా పఠాన్
బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' 36 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 528.06 కోట్లు నెట్‌ను రాబట్టింది. అందులో హిందీ వెర్షన్‌కు మాత్రమే రూ. 509.85 కోట్లు నెట్ వచ్చింది. తద్వారా 'బాహుబలి 2' రికార్డు (511 కోట్లు)కు రూ. 1.15 కోట్లు దూరంలో నిలిచింది. ఈ రెండు మూడు రోజుల్లోనే ఈ చిత్రం మన తెలుగు సినిమాకు షాకిచ్చేలా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











