Pathaan 37 Days Collections: పఠాన్‌కు షాకింగ్ కలెక్షన్లు.. లాభాలే వందల కోట్లు.. రాజమౌళిని దాటేసేలా!

పేరుకు హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోనే అయినా.. దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు వరల్డ్ వైడ్‌గా ఫాలోయింగ్‌ను ఏర్పరచుకున్నాడు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్. విలక్షణమైన నటన, విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను సుదీర్ఘ కాలంగా ఫిదా చేస్తోన్న అతడు.. ఈ మధ్య కాలంలో మాత్రం కాస్త నెమ్మదించాడు. ఈ పరిస్థితుల్లో ఇటీవలే షారూఖ్ 'పఠాన్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి మొదటి నుంచీ భారీ వసూళ్లు వస్తున్నాయి. ఇదే 6 వారంలోనూ కంటిన్యూ అవుతోంది. ఈ నేపథ్యంలో 'పఠాన్' సినిమా 37 రోజుల రిపోర్టు మీకోసమే!

పఠాన్‌గా షారూఖ్ ఖాన్ ప్రవేశం

పఠాన్‌గా షారూఖ్ ఖాన్ ప్రవేశం

సీనియర్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన తాజా సినిమానే 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం విలన్‌గా నటించాడు. అలాగే, మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్‌ చేశాడు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. విశాల్ శేఖర్ దీనికి మ్యూజిక్ ఇచ్చాడు.

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్

సూపర్ స్టార్ల కలయికలో రూపొందిన 'పఠాన్'పై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్‌కు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 - 260 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అందుకు తగ్గట్లుగానే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8000లకు పైగా థియేటర్లలో దీన్ని తీసుకొచ్చారు.

36 రోజుల్లో ఎంత వచ్చిందంటే

36 రోజుల్లో ఎంత వచ్చిందంటే

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'పఠాన్' సినిమాకు ఆరంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీ స్థాయిలోనే వస్తున్నాయి. ఇలా 36 రోజుల్లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 528.12 కోట్లు నెట్‌, రూ. 1026 కోట్లు గ్రాస్‌ను వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

37వ రోజు ఎంత కలెక్ట్ చేసింది

37వ రోజు ఎంత కలెక్ట్ చేసింది


షారూఖ్ ఖాన్ హీరోగా సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించిన 'పఠాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే 37వ రోజు కూడా దీనికి వసూళ్లు తగ్గి రూ. 1.50 కోట్లు గ్రాస్, రూ. 70 లక్షలు నెట్ వసూలైనట్లు తెలిసింది.

37 రోజులకూ కలిపి ఎంతంటే?

37 రోజులకూ కలిపి ఎంతంటే?


బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ నటించిన 'పఠాన్' మూవీకి ఓవరాల్‌గా మాత్రం భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 37 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 528.82 కోట్లు నెట్ వసూలైది. ఇందులో రూ. 18.24 కోట్లు నెట్ దక్షిణాది భాషల నుంచి వచ్చింది. అలాగే, ఈ మూవీ రూ. 1027.50 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

ఓవర్సీస్‌లో ఎంత వచ్చింది?

ఓవర్సీస్‌లో ఎంత వచ్చింది?

స్పై థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన 'పఠాన్' చిత్రాన్ని షారూఖ్ ఖాన్ క్రేజ్‌ వల్ల చాలా దేశాల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అందుకు తగ్గట్లుగానే విదేశాల్లో కూడా ఈ సినిమా భారీ స్పందనను సొంతం చేసుకుంది. అలాగే, కలెక్షన్లను కూడా అత్యధికంగానే రాబట్టింది. ఫలితంగా ఈ మూవీ 37 రోజుల్లో ఓవర్సీస్‌లో 47 మిలియన్ డాలర్లు (386 కోట్లు) వరకూ వసూళ్లను రాబట్టి సత్తా చాటింది.

బాహుబలికి షాకిచ్చేలా పఠాన్

బాహుబలికి షాకిచ్చేలా పఠాన్

భారీ బడ్జెట్‌తో రూపొందిన 'పఠాన్' 37 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 528.82 కోట్లు నెట్‌ను రాబట్టింది. అందులో హిందీ వెర్షన్‌‌కు మాత్రమే రూ. 510.60 కోట్లు నెట్‌ వచ్చింది. తద్వారా 'బాహుబలి 2' రికార్డు (511 కోట్లు)కు రూ. 41 లక్షలు దూరంలో నిలిచింది. అలాగే, ఈ మూవీ ఇప్పటి వరకూ రూ. 268 కోట్లకు పైగా లాభాలను సొంతం చేసుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X