Pathaan 38 Days Collections: పఠాన్‌ కొత్త చరిత్ర.. బాహుబలి రికార్డు బ్రేక్.. ఇండియాలోనే టాప్ మూవీగా!

విలక్షణమైన నటనతో పాటు ప్రేక్షకులను అలరించే పక్కా కమర్షియల్ చిత్రాలు చేస్తూ సుదీర్ఘ కాలంగా ఇండియన్ సినిమాలో తనదైన మార్కును చూపిస్తూ దూసుకుపోతోన్నాడు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్. విలక్షణమైన నటన, విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను సుదీర్ఘ కాలంగా ఫిదా చేస్తోన్న అతడు.. ఈ మధ్య కాలంలో మాత్రం కాస్త నెమ్మదించాడు. ఈ పరిస్థితుల్లో ఇటీవలే షారూఖ్ 'పఠాన్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి మొదటి నుంచీ భారీ వసూళ్లు రాబడుతూ.. 6 వారంలోనూ రచ్చ లేపుతోంది. ఈ నేపథ్యంలో 'పఠాన్' సినిమా 38 రోజుల రిపోర్టును చూద్దామా!

 పఠాన్‌గా షారూఖ్ ఖాన్ ఎంటర్

పఠాన్‌గా షారూఖ్ ఖాన్ ఎంటర్


ఇండియన్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన తాజా సినిమానే 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం విలన్‌గా నటించాడు. అలాగే, మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్‌ చేశాడు. విశాల్ శేఖర్ దీనికి మ్యూజిక్ అందించారు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు.

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్


పలువురు స్టార్లు కలిసి నటించిన 'పఠాన్'పై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్‌కు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 - 260 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అందుకు తగ్గట్లుగానే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8000లకు పైగా థియేటర్లలో దీన్ని రిలీజ్ చేశారు.

37 రోజుల్లో ఎంత వచ్చిందంటే

37 రోజుల్లో ఎంత వచ్చిందంటే


పక్కా యాక్షన్ మూవీగా రూపొందిన 'పఠాన్'కు ఆరంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీ స్థాయిలోనే వస్తున్నాయి. ఇలా 37 రోజుల్లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 528.89 కోట్లు నెట్‌, రూ. 1026 కోట్లు గ్రాస్‌ను వచ్చినట్లు నిర్మాతలు వెల్లడించారు.

38వ రోజు ఎంత కలెక్ట్ చేసింది

38వ రోజు ఎంత కలెక్ట్ చేసింది


షారూఖ్ ఖాన్ - సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించిన 'పఠాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే 38వ రోజు భారీగా పెరిగి రూ. 2.50 కోట్లు గ్రాస్, రూ. 1.20 కోట్లు నెట్ వసూలైనట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

38 రోజులకూ కలిపి ఎంతంటే?

38 రోజులకూ కలిపి ఎంతంటే?


షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణె నటించిన 'పఠాన్' మూవీకి ఓవరాల్‌గా మాత్రం భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 38 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 530.09 కోట్లు నెట్ వసూలైది. ఇందులో రూ. 18.26 కోట్లు నెట్ దక్షిణాది భాషల నుంచి వచ్చింది. అలాగే, ఈ మూవీ రూ. 1028.50 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

ఓవర్సీస్‌లో ఎంత వచ్చింది?

ఓవర్సీస్‌లో ఎంత వచ్చింది?


బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ నటించిన 'పఠాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అందుకు తగ్గట్లుగానే విదేశాల్లో కూడా ఈ సినిమా భారీ స్పందనను సొంతం చేసుకుంది. అలాగే, కలెక్షన్లను కూడా అత్యధికంగానే రాబట్టింది. ఫలితంగా ఈ మూవీ 38 రోజుల్లో ఓవర్సీస్‌లో 47 మిలియన్ డాలర్లు (386.50 కోట్లు) వరకూ వసూళ్లను రాబట్టి సత్తా చాటింది.

 బాహుబలి రికార్డు బ్రేక్ చేసేసి

బాహుబలి రికార్డు బ్రేక్ చేసేసి


'పఠాన్' మూవీ 38 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 530.09 కోట్లు నెట్‌ను రాబట్టింది. అందులో హిందీ వెర్షన్‌‌కు మాత్రమే రూ. 511.78 కోట్లు నెట్‌ వచ్చింది. తద్వారా 'బాహుబలి 2' రికార్డు (511 కోట్లు) రికార్డును బ్రేక్ చేసేసి ఇండియాలోనే టాప్ హిందీ మూవీగా నిలిచింది. అలాగే, ఈ మూవీ ఇప్పటి వరకూ రూ. 270 కోట్లకు పైగా లాభాలను సొంతం చేసుకుని మరో రికార్డు సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X