Pathaan 39 Days Collections: పఠాన్ ఊచకోత.. 39వ రోజు అన్ని కోట్లు.. లాభాలతో సంచలన రికార్డు
ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎంతో మంది పాన్ ఇండియా స్టార్లుగా సందడి చేస్తున్నారు. కానీ, చాలా కాలం క్రితమే తనదైన రీతిలో సత్తా చాటి నేషనల్ రేంజ్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్. పక్కా కమర్షియల్ చిత్రాలతో పాటు అప్పుడప్పుడూ ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను సుదీర్ఘ కాలంగా ఫిదా చేస్తోన్న అతడు.. ఈ మధ్య నెమ్మదించాడు. ఈ పరిస్థితుల్లో ఇటీవలే షారూఖ్ 'పఠాన్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి మొదటి నుంచీ భారీ వసూళ్లు రాబడుతూ.. 6 వారంలోనూ దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో 'పఠాన్' సినిమా 39 రోజుల రిపోర్టును చూడండి!

పఠాన్‌గా షారూఖ్ ఖాన్ అరాచకం
సీనియర్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన తాజా సినిమానే 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం విలన్‌గా నటించాడు. అలాగే, మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేశాడు. విశాల్ శేఖర్ దీనికి మ్యూజిక్ అందించారు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు.

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్
షారూఖ్, దీపిక, జాన్ అబ్రహం నటించిన 'పఠాన్'పై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్‌కు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 - 260 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అందుకు తగ్గట్లే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8000లకు పైగా థియేటర్లలో దీన్ని తీసుకొచ్చారు.

38 రోజుల్లో ఎంత వచ్చిందంటే
స్పై థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన 'పఠాన్'కు ఆరంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీ స్థాయిలోనే వస్తున్నాయి. ఇలా 38 రోజుల్లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 530.09 కోట్లు నెట్, రూ. 1029 కోట్లు గ్రాస్‌ను వచ్చినట్లు నిర్మాతలు వెల్లడించారు.

39వ రోజు ఎంత కలెక్ట్ చేసింది
షారూఖ్ ఖాన్ - సిద్దార్థ్ ఆనంద్ కాంబోలో వచ్చిన 'పఠాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే 39వ రోజు భారీగా పెరిగి రూ. 3.50 కోట్లు గ్రాస్, రూ. 2 కోట్లు వరకూ నెట్ వసూలైనట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

39 రోజులకూ కలిపి ఎంతంటే?
స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' మూవీకి ఓవరాల్‌గా మాత్రం భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 39 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 532.00 కోట్లు నెట్ వసూలైది. ఇందులో రూ. 18.28 కోట్లు నెట్ దక్షిణాది భాషల నుంచి వచ్చింది. అలాగే, ఈ మూవీ రూ. 1032 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

ఓవర్సీస్‌లో ఎంత వచ్చింది?
బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ నటించిన 'పఠాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అందుకు తగ్గట్లుగానే విదేశాల్లో కూడా ఈ సినిమా భారీ స్పందనను సొంతం చేసుకుంది. అలాగే, కలెక్షన్లను కూడా భారీ స్థాయిలోనే రాబట్టింది. ఫలితంగా ఈ మూవీ 39 రోజుల్లో ఓవర్సీస్‌లో 47.10 మిలియన్ డాలర్లు (386.70 కోట్లు) వరకూ వసూళ్లను రాబట్టి సత్తా చాటింది.

లాభాలతో రికార్డు.. ఇప్పటికీ
సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' మూవీ 39వ రోజు కూడా రూ. 2 కోట్లుకు పైగా నెట్‌ను వసూలు చేసి సత్తా చాటింది. తద్వారా ఇప్పటికీ ఈ సినిమా హవాను చూపిస్తూనే ఉంది. ఇక, రూ. 260 కోట్లు టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకూ రూ. 270 కోట్లకు పైగా లాభాలను సొంతం చేసుకుని మరో రికార్డు సాధించింది.


Click it and Unblock the Notifications











