Pathaan 4 Days Collections: పఠాన్ పెను సంచలనం.. అప్పుడే అన్ని వందల కోట్లు.. రాజమౌళి రికార్డు బద్దలు

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎంతో మంది హీరోలు పాన్ ఇండియా స్టార్లుగా హవాను చూపిస్తున్నారు. అయితే, చాలా కాలం క్రితమే ఈ రేంజ్‌ను ఏర్పరచుకున్న హీరో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్. అయితే, దాదాపు ఐదేళ్లుగా ఈ సీనియర్ హీరో సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇటీవలే షారూఖ్ 'పఠాన్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. దీంతో ఈ క్రేజీ యాక్షన్ మూవీ భారీ వసూళ్లను రాబడుతూ సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో 'పఠాన్' నాలుగు రోజుల కలెక్షన్ల రిపోర్టును మీరే చూసేయండి!

పఠాన్‌గా షారూఖ్ ఖాన్ విశ్వరూపం

పఠాన్‌గా షారూఖ్ ఖాన్ విశ్వరూపం

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రమే 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. ఇందులో జాన్ అబ్రహం కీలక పాత్రను చేశాడు. విశాల్ శేఖర్ ఈ మూవీకి సంగీతం అందించాడు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేశాడు.

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్

సీనియర్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 - 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే దీన్ని దాదాపు 8000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేశారు.

మూడు రోజుల్లో ఎంత వచ్చింది?

మూడు రోజుల్లో ఎంత వచ్చింది?

సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో సీనియర్ పానిండియా స్టార్ షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గానే వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఇలా రెండు రోజుల్లో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 165 కోట్లు నెట్, రూ. 315 కోట్లు గ్రాస్ వచ్చింది.

నాలుగో రోజు సంచలన వసూళ్లు

నాలుగో రోజు సంచలన వసూళ్లు

షారూఖ్ ఖాన్ - దీపికా పదుకొనె జోడీగా చేసిన 'పఠాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇలా నాలుగో రోజు ఈ చిత్రానికి ఓవరాల్‌గా రూ. 104 కోట్లు గ్రాస్, రూ. 53 కోట్లు నెట్ వచ్చినట్లు తెలిసింది.

నాలుగు రోజులకు కలిపి ఇలా

నాలుగు రోజులకు కలిపి ఇలా

పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'పఠాన్' మూవీకి హిందీలో మాత్రం భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. నాలుగు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 214 కోట్లు వరకూ నెట్ వసూలు అయింది. అలాగే, రూ. 417 గ్రాస్ కలెక్ట్ చేసింది. తద్వారా ఎన్నో రికార్డులను సైతం ఈ మూవీ బద్దలు కొట్టేసింది.

ఓవర్సీస్‌లోనూ ఆ మార్కు దాటి

ఓవర్సీస్‌లోనూ ఆ మార్కు దాటి


బాలీవుడ్ సీనియర్ షారూఖ్ ఖాన్‌ను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే 'పఠాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు. దీంతో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 20 మిలియన్స్ వరకూ రాబట్టి సంచలనం సృష్టించింది. ఇందులో ఒక్క నార్త్ అమెరికాలోనే దాదాపు ఆరు మిలియన్లను కలెక్ట్ చేసి సత్తా చాటుకుంది.

బాహుబలి, కేజీఎఫ్‌ను నెట్టేసి

బాహుబలి, కేజీఎఫ్‌ను నెట్టేసి


షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' మూవీ నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 214 కోట్లు నెట్‌ వసూలు చేసింది. తద్వారా ఇండియాలో తక్కువ రోజుల్లోనే ఈ మార్కును చేరుకున్న ఇండియన్ సినిమాగా ఇది చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలోనే 'కేజీఎఫ్ 2' పేరిట ఉన్న ఐదు రోజులు, 'బాహుబలి 2' పేరిట ఉన్న ఆరు రోజులు రికార్డులను బ్రేక్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X