Pathaan 4 Weeks Collections: 4 వారాల్లోనే వందల కోట్లు.. లాభాలతో సంచలనం.. బాహుబలి 34 అయితే పఠాన్ 28
విలక్షణమైన నటన, విభిన్నమైన సినిమాలతో ఇండియన్ ఫిల్మ్ లవర్స్‌ను సుదీర్ఘ కాలంగా అలరిస్తూ.. చాలా కాలం క్రితమే పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్నాడు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్. తనదైన చిత్రాలతో దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తోన్న ఈ స్టార్ హీరో.. కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఇక, ఇటీవలే షారూఖ్ 'పఠాన్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభం నుంచే భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా కలెక్షన్లు ఇప్పటికీ పోటెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'పఠాన్' మూవీ 4 వారాల రిపోర్టు మీకోసమే!

‘పఠాన్’గా షారూఖ్ విశ్వరూపం
బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన సినిమానే 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం కీలక పాత్రను చేశాడు. విశాల్ శేఖర్ దీనికి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్‌తో అలరించాడు.

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్
ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'పఠాన్'పై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్‌కు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 - 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అందుకు అనుగుణంగానే దాదాపు 8000లకు పైగా థియేటర్లలో ఇది విడుదలైంది.

27 రోజుల్లో ఎంత వచ్చిందంటే
షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన 'పఠాన్' సినిమాకు ఆరంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీ స్థాయిలోనే వస్తున్నాయి. ఇలా 26 రోజుల్లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 516.92 కోట్లు నెట్, రూ. 1000 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

28వ రోజు ఎంత కలెక్ట్ చేసింది
షారూఖ్ ఖాన్ - సిద్దార్థ్ ఆనంద్ కాంబినేషన్‌లో రూపొందిన 'పఠాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే 28వ రోజు కూడా ఈ సినిమాకు రూ. 3.50 - 4 కోట్లు గ్రాస్, రూ. 1.25 - 1.50 కోట్లు నెట్ వచ్చినట్లు తెలిసింది.

4 వారాలకూ కలిపి ఎంతంటే?
స్పై థ్రిల్లర్ కాన్సెప్టుతో రూపొందిన 'పఠాన్' మూవీకి ఓవరాల్‌గా మాత్రం భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 4 వారాల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 518 కోట్లు వరకూ నెట్ వసూలు అయింది. అలాగే, రూ. 1003 - 1004 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలిసింది. దీంతో చైనాలో రిలీజ్ లేకుండానే రూ. 1000 కోట్లు దాటిన చిత్రంగా నిలిచింది.

ఓవర్సీస్‌లో ఇంకా ప్రభావం
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే విదేశాల్లో కూడా ఈ సినిమా భారీ స్పందనను సొంతం చేసుకుంది. అలాగే, కలెక్షన్లను కూడా అత్యధికంగానే రాబట్టింది. ఫలితంగా ఈ మూవీ 4 వారాల్లో ఓవర్సీస్‌లో 46 మిలియన్ డాలర్లు (381 కోట్లు) వరకూ వసూళ్లను కూడా రాబట్టింది.

250 కోట్ల లాభం.. మరో రికార్డు
షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' చిత్రానికి రూ. 260 కోట్లు వరకూ బిజినెస్ జరిగింది. దీంతో నాలుగు వారాల్లోనే ఈ మూవీ రూ. 250 కోట్లకు పైగా లాభాలన సొంతం చేసుకుంది. ఇక, హిందీ వెర్షన్ మాత్రమే రూ. 500 కోట్లు నెట్‌ను సాధించిన ఈ చిత్రం మరో రికార్డును సాధించింది. ఇది నాలుగు వారాల్లోనే ఈ మార్కును చేరుకోగా.. 'బాహుబలి 2'కి 34 రోజులు సమయం పట్టింది.


Click it and Unblock the Notifications











