Pathaan 40 Days Collections: చరిత్ర సృష్టించిన పఠాన్.. 40వ రోజు అన్ని కోట్లా.. లాభం ఎంతో తెలిస్తే!
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్.. ఈ పేరుకు అస్సలు పరిచయం అవసరం లేదు. అంతలా ఈ స్టార్ హీరో దాదాపు నాలుగు దశాబ్దాలుగా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ.. ఇండియాలోనే టాప్ హీరోలలో ఒకడిగా దూసుకుపోతోన్నాడు. దీంతో వరుసగా సినిమాలు చేస్తోన్నాడు. కానీ, ఈ మధ్య చాలా గ్యాప్ తీసుకున్న షారూఖ్.. ఇటీవలే 'పఠాన్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభం నుంచీ భారీ వసూళ్లు వస్తున్నాయి. అదే 6 వారంలోనూ కొనసాగుతోంది. ముఖ్యంగా 40వ రోజు ఇది చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో 'పఠాన్' సినిమా బాక్సాఫీస్ రిపోర్టును చూడండి!

పఠాన్‌గా షారూఖ్ ఖాన్ ఊరమాస్
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన తాజా సినిమానే ‘పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం విలన్‌గా నటించాడు. అలాగే, మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేశాడు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. విశాల్ శేఖర్ దీనికి మ్యూజిక్ అందించారు.

పఠాన్ మూవీ బిజినెస్, విడుదల
షారూఖ్ ఖాన్ - దీపిక జంటగా నటించిన ‘పఠాన్'పై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్‌కు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 - 260 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అందుకు తగ్గట్లే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8000లకు పైగా థియేటర్లలో దీన్ని రిలీజ్ చేశారు.

39 రోజుల్లో ఎంత వచ్చిందంటే
ఎన్నో వివాదాల నడుమ విడుదలైన ‘పఠాన్'కు ఆరంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీ స్థాయిలోనే వస్తున్నాయి. ఇలా 39 రోజుల్లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 532.00 కోట్లు నెట్, రూ. 1032 కోట్లు గ్రాస్‌ను వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించారు.

40వ రోజు ఎంత కలెక్ట్ చేసింది
సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారూఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే 40వ రోజు భారీగా పెరిగి రూ. 4.00 కోట్లు గ్రాస్, రూ. 2.70 కోట్లు వరకూ నెట్ వసూలు అయ్యాయి.

40 రోజులకూ కలిపి ఎంతంటే?
బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ నటించిన ‘పఠాన్' మూవీకి ఓవరాల్‌గా మాత్రం భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 40 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 534.78 కోట్లు నెట్ వసూలైంది. ఇందులో రూ. 18.30 కోట్లు నెట్ దక్షిణాది భాషల నుంచి వచ్చింది. అలాగే, ఈ మూవీ రూ. 1036 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఓవర్సీస్‌లో ఎంతొచ్చిందంటే
సీనియర్ హీరో షారూఖ్ నటించిన ‘పఠాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అందుకు తగ్గట్లుగానే విదేశాల్లో కూడా ఈ సినిమా భారీ స్పందనను సొంతం చేసుకుంది. అలాగే, కలెక్షన్లను కూడా భారీ స్థాయిలోనే రాబడుతూ దూసుకెళ్తోంది. ఫలితంగా ఈ మూవీ 40 రోజుల్లో ఓవర్సీస్‌లో 47.30 మిలియన్ డాలర్లు (387 కోట్లు) వరకూ వసూళ్లను రాబట్టి సత్తా చాటింది.

లాభాలతో రికార్డు.. 40వ రోజూ
బాద్‌షా షారూఖ్ ఖాన్ హీరోగా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ‘పఠాన్' మూవీ ఆదివారమైన 40వ రోజు కూడా రూ. 2 కోట్లుకు పైగా నెట్‌ను వసూలు చేసి చరిత్రను సృష్టించింది. అలాగే, రూ. 260 కోట్లు నెట్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకూ రూ. 274 కోట్లకు పైగా లాభాలను సొంతం చేసుకుని మరో అరుదైన రికార్డును కూడా ఖాతాలో వేసుకుంది.


Click it and Unblock the Notifications











