Pathaan 41 Days Collections: 41వ రోజూ ఊహించని వసూళ్లు.. ఏకంగా అన్ని వందల కోట్లు.. లాభాలతో రికార్డు
తనదైన నటన, విభిన్నమైన సినిమాలు చేస్తూ సుదీర్ఘ కాలంగా ఇండియన్ సినిమాలో హవాను చూపిస్తూ స్టార్‌గా దూసుకుపోతోన్నాడు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం హిట్లను అందుకోవడంలో ఇబ్బంది పడుతోన్న ఆయన.. చాలా ఏళ్ల పాటు సినిమాలు చేయలేదు. ఈ పరిస్థితుల్లో గత జనవరిలోనే షారూఖ్ 'పఠాన్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభం నుంచీ భారీ వసూళ్లు వస్తున్నాయి. అదే 7వ వారంలోనూ కొనసాగడంతో కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'పఠాన్' సినిమా 41 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును చూడండి!

పఠాన్‌గా మారిన షారూఖ్ ఖాన్
బాలీవుడ్ సీనియర్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన తాజా సినిమానే 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం విలన్‌గా నటించాడు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. విశాల్ శేఖర్ దీనికి మ్యూజిక్ అందించారు. అలాగే, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేశాడు.

పఠాన్ మూవీ బిజినెస్, విడుదల
షారూఖ్ ఖాన్ - సిద్దార్థ్ ఆనంద్ కాంబోలో వచ్చిన 'పఠాన్'పై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్‌కు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 కోట్లు వరకూ బిజినెస్ జరిగింది. అందుకు తగ్గట్లే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8000లకు పైగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేశారు.

40 రోజుల్లో ఎంత వచ్చిందంటే
కాంట్రవర్శీలతో సంచలనంగా మారిన 'పఠాన్'కు ఆరంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీ స్థాయిలోనే వస్తున్నాయి. ఇలా 40 రోజుల్లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 534.78 కోట్లు నెట్, రూ. 1036 కోట్లు గ్రాస్‌ను వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించారు.

41వ రోజు ఎంత కలెక్ట్ చేసింది
షారూఖ్ ఖాన్, దీపికా, జాన్ అబ్రహం కలిసి నటించిన 'పఠాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే 41వ రోజు భారీగా పెరిగి రూ. 2.00 కోట్లు గ్రాస్, రూ. 85 లక్షలు వరకూ నెట్ వసూలు అయింది.

41 రోజులకూ కలిపి ఎంతంటే?
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ నటించిన 'పఠాన్' మూవీకి ఓవరాల్‌గా మాత్రం భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 41 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 535.57 కోట్లు నెట్ వసూలైంది. ఇందులో రూ. 18.32 కోట్లు నెట్ దక్షిణాది భాషల నుంచి వచ్చింది. అలాగే, ఈ మూవీ రూ. 1038 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఓవర్సీస్‌లో ఎంతొచ్చిందంటే
ఇండియన్ సూపర్ స్టార్ షారూఖ్ నటించిన 'పఠాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అందుకు తగ్గట్లుగానే విదేశాల్లో కూడా ఈ సినిమా భారీ స్పందనను సొంతం చేసుకుంది. అలాగే, కలెక్షన్లను కూడా భారీ స్థాయిలోనే రాబడుతూ దూసుకెళ్తోంది. ఫలితంగా ఈ మూవీ 41 రోజుల్లో ఓవర్సీస్‌లో 47.50 మిలియన్ డాలర్లు (389 కోట్లు) వరకూ వసూళ్లను రాబట్టి సత్తా చాటింది.

ఇప్పటికీ స్పీడ్.. లాభాలతోనూ
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ హీరోగా సిద్దార్థ్ ఆనంద్ రూపొందించిన 'పఠాన్' మూవీ సోమవారమైన 41వ రోజు కూడా రూ. దాదాపు కోటి వరకూ నెట్‌ను వసూలు చేసి సత్తా చాటుకుంది. అలాగే, రూ. 260 కోట్లు నెట్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకూ రూ. 275 కోట్లకు పైగా లాభాలను సొంతం చేసుకుని షారూఖ్ చిత్రాల్లోనే టాప్ మూవీగా రికార్డును క్రియేట్ చేసింది.


Click it and Unblock the Notifications











