Pathaan 43 Days Collections: పఠాన్‌కు బిగ్ షాక్.. తొలిసారి ఇంత తక్కువ.. మొత్తంగా 1000 కోట్లు పైనే!

ఇండియన్ సినిమాలో కొందరు హీరోలు మాత్రమే తమదైన రీతిలో ప్రేక్షకులను అలరిస్తూ ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. అందులో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ ఒకడు. అలా సుదీర్ఘ కాలంగా విలక్షణమైన చిత్రాలు చేస్తూ ముందుకు సాగుతోన్నాడు. అయితే, ఇటీవల కాస్త గ్యాప్ తీసుకున్న షారూఖ్.. గత జనవరిలో 'పఠాన్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభం నుంచీ భారీ వసూళ్లు వస్తున్నాయి. అదే 7వ వారంలోనూ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 'పఠాన్' సినిమా 43 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును చూద్దాం పదండి!

పఠాన్‌గా వచ్చేసిన బాలీవుడ్ స్టార్

పఠాన్‌గా వచ్చేసిన బాలీవుడ్ స్టార్


బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన తాజా సినిమానే 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం విలన్‌గా నటించాడు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. విశాల్ శేఖర్ దీనికి మ్యూజిక్ అందించారు. ఇక, మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కామియో రోల్ చేశాడు.

పఠాన్ మూవీ బిజినెస్, విడుదల

పఠాన్ మూవీ బిజినెస్, విడుదల

సీనియర్ హీరో షారూఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందిన 'పఠాన్'పై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్‌కు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 కోట్లు వరకూ బిజినెస్ జరిగింది. అందుకు తగ్గట్లే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8000లకు పైగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేసుకున్నారు.

42 రోజుల్లో ఎంత వచ్చిందంటే

42 రోజుల్లో ఎంత వచ్చిందంటే

రిలీజ్‌కు ముందే సంచలనం అయిన 'పఠాన్' మూవీకి ఆరంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీ స్థాయిలోనే వస్తున్నాయి. ఇలా 42 రోజుల్లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 536.78 కోట్లు నెట్‌, రూ. 1039 కోట్లు గ్రాస్‌ను వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

43వ రోజు ఎంత కలెక్ట్ చేసింది

43వ రోజు ఎంత కలెక్ట్ చేసింది

షారూఖ్ ఖాన్ - సిద్దార్థ్ ఆనంద్ కాంబోలో వచ్చిన 'పఠాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే 43వ రోజు భారీగా పడిపోయి రూ. 1.00 కోట్లు గ్రాస్, రూ. 65 లక్షలు వరకూ నెట్ వసూలు అయింది.

43 రోజులకూ కలిపి ఎంతంటే?

43 రోజులకూ కలిపి ఎంతంటే?

పాన్ ఇండియా హీరో షారూఖ్ నటించిన 'పఠాన్' మూవీకి ఓవరాల్‌గా మాత్రం భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 43 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 537.43 కోట్లు నెట్ వసూలైంది. ఇందులో రూ. 18.38 కోట్లు నెట్ దక్షిణాది భాషల నుంచి, రూ. 519.05 కోట్లు హిందీ బెల్ట్ ద్వారా వచ్చాయి. ఈ మూవీ రూ. 1040 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఓవర్సీస్‌లో ఎంతొచ్చిందంటే

ఓవర్సీస్‌లో ఎంతొచ్చిందంటే

షారూఖ్ నటించిన 'పఠాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో అత్యధిక లోకేషన్లలోనే రిలీజ్ చేశారు. అందుకు తగ్గట్లుగానే విదేశాల్లో కూడా ఈ సినిమా భారీ స్పందనను సొంతం చేసుకుంది. అలాగే, కలెక్షన్లను కూడా భారీ స్థాయిలోనే రాబడుతూ దూసుకెళ్తోంది. ఫలితంగా ఈ మూవీ 43 రోజుల్లో ఓవర్సీస్‌లో 47.80 మిలియన్ డాలర్లు (390 కోట్లు) వరకూ వసూళ్లను రాబట్టి సత్తా చాటింది.

తొలిసారి షాక్.. అయినా కోట్లే

తొలిసారి షాక్.. అయినా కోట్లే

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ హీరోగా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన 'పఠాన్' మూవీ 43వ రోజు భారీగా డౌన్ అయింది. దీంతో మొత్తంగా దీనికి రూ. 65 లక్షలు నెట్ మాత్రమే వచ్చింది. ఈ సినిమా రన్‌లో ఇదే అత్యల్పం అని చెప్పొచ్చు. అయినప్పటికీ ఇది రూ. 1040 కోట్లు గ్రాస్ మార్కును చేరింది. అలాగే, లాభాల పరంగానూ ఎన్నో రికార్డులు నమోదు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X