Pathaan 44 Days Collections: పఠాన్ మరో సెన్సేషన్.. ఇండియాలోనే తొలి సినిమాగా రికార్డు.. అన్ని కోట్లా!
దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండియన్ సినిమాల్లో తనదైన రీతిలో హవాను చూపిస్తూ నెంబర్ వన్ స్టార్ హీరోగా దూసుకుపోతోన్నాడు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్. యాక్టింగ్‌తో పాటు విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న ఆయన.. సరైన హిట్ కోసం చాలా కాలం గ్యాప్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే షారూఖ్ 'పఠాన్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభం నుంచీ భారీ వసూళ్లు వస్తున్నాయి. అదే 7వ వారంలోనూ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 'పఠాన్' సినిమా 44 రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై లుక్కేద్దాం పదండి!

పఠాన్‌గా మారిపోయిన షారూఖ్
సీనియర్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన తాజా సినిమానే 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం విలన్‌గా నటించాడు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. విశాల్ శేఖర్ దీనికి మ్యూజిక్ అందించారు. ఇక, మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించాడు.

పఠాన్ మూవీ బిజినెస్, రిలీజ్
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన 'పఠాన్'పై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్‌కు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 కోట్లు వరకూ బిజినెస్ జరిగింది. అందుకు తగ్గట్లుగానే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8000లకు పైగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేశారు.

43 రోజుల్లో ఎంత వచ్చిందంటే
వివాదాలతో అందరి దృష్టిలో పడిన 'పఠాన్' మూవీకి ఆరంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీ స్థాయిలోనే వస్తున్నాయి. ఇలా 43 రోజుల్లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 537.44 కోట్లు నెట్, రూ. 1040.50 కోట్లు గ్రాస్‌ను వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

44వ రోజు ఎంత కలెక్ట్ చేసింది
షారూఖ్ ఖాన్ హీరోగా సిద్దార్థ్ ఆనంద్ రూపొందించిన 'పఠాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే 44వ రోజు భారీగా పడిపోయి రూ. 75 లక్షలు గ్రాస్, రూ. 56 లక్షలు వరకూ నెట్ వసూలు అయింది.

44 రోజులకూ కలిపి ఎంతంటే?
ఇండియన్ సూపర్ స్టార్ షారూఖ్ నటించిన 'పఠాన్' మూవీకి ఓవరాల్‌గా మాత్రం భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 44 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 538.00 కోట్లు నెట్ వసూలైంది. ఇందులో రూ. 18.40 కోట్లు నెట్ దక్షిణాది భాషల నుంచి, రూ. 519.50 కోట్లు హిందీ బెల్ట్ ద్వారా వచ్చాయి. ఈ మూవీ రూ. 1041.25 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఓవర్సీస్‌లో ఎంతొచ్చిందంటే
షారూఖ్ హీరోగా చేసిన 'పఠాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో అత్యధిక లోకేషన్లలోనే రిలీజ్ చేశారు. అందుకు తగ్గట్లుగానే విదేశాల్లో కూడా ఈ సినిమా భారీ స్పందనను సొంతం చేసుకుంది. అలాగే, కలెక్షన్లను కూడా భారీ స్థాయిలోనే రాబడుతూ దూసుకెళ్తోంది. ఫలితంగా ఈ మూవీ 44 రోజుల్లో ఓవర్సీస్‌లో 47.90 మిలియన్ డాలర్లు (390 కోట్లు) వరకూ వసూళ్లను రాబట్టి సత్తా చాటింది.

ఇండియాలోనే తొలి సినిమా
షారూఖ్ ఖాన్ - సిద్దార్థ్ ఆనంద్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'పఠాన్' మూవీ 44వ రోజు భారీగా డౌన్ అయింది. దీంతో మొత్తంగా దీనికి రూ. 56 లక్షలు నెట్ మాత్రమే వచ్చింది. ఇక, ఈ సినిమాకు ఐదో వారంలో రూ. 8.73 కోట్లు నెట్ వసూళ్లుగా రాగా.. ఆరో వారంలో రూ. 8.85 కోట్లు రాబట్టింది. తద్వారా 5వ వారం కంటే 6వ వారంలో ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సాధించింది.


Click it and Unblock the Notifications











