Pathaan 45 Days Collections: పఠాన్‌కు బిగ్ షాక్.. షారూఖ్ మరో రికార్డు.. 10 కోట్లు వస్తే సంచలనమే
సుదీర్ఘ కాలంగా బాలీవుడ్‌లో తనదైన చిత్రాల్లో నటిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్‌ను అంతకంతకూ పెంచుకుంటూనే వెళ్తోన్నాడు బాద్‌షా షారూఖ్ ఖాన్. అయితే, కొంత కాలంగా ఆయన సరైన విజయాలను మాత్రం సొంతం చేసుకోవడం లేదు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇటీవలే షారూఖ్ 'పఠాన్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి మొదటి రోజు నుంచీ భారీ వసూళ్లు వస్తున్నాయి. అయితే, తాజాగా వసూళ్లు బాగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో 'పఠాన్' సినిమా 45 రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై లుక్కేద్దాం పదండి!

స్పై థ్రిల్లర్ స్టోరీతో షారూఖ్
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన తాజా సినిమానే 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం విలన్‌గా నటించాడు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. విశాల్ శేఖర్ దీనికి మ్యూజిక్ అందించారు. ఇక, మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్ర చేశాడు.

పఠాన్ మూవీ బిజినెస్, రిలీజ్
ఇండియన్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన 'పఠాన్'పై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్‌కు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 కోట్లు వరకూ బిజినెస్ జరిగింది. అందుకు తగ్గట్లుగానే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8000లకు పైగా థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేశారు.

44 రోజుల్లో ఎంత వచ్చిందంటే
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'పఠాన్' మూవీకి ఆరంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీ స్థాయిలోనే వస్తున్నాయి. ఇలా 44 రోజుల్లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 538.01 కోట్లు నెట్, రూ. 1041.25 కోట్లు గ్రాస్‌ను వచ్చినట్లు నిర్మాతలు వెల్లడించారు.

45వ రోజు ఎంత కలెక్ట్ చేసింది
షారూఖ్ ఖాన్ - సిద్దార్థ్ ఆనంద్ కాంబోలో వచ్చిన 'పఠాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే 45వ రోజు భారీగా పడిపోయి రూ. 75 లక్షలు గ్రాస్, రూ. 31 లక్షలు వరకూ నెట్ వసూలు అయింది.

45 రోజులకూ కలిపి ఎంతంటే?
స్పై థ్రిల్లర్ జోనర్‌లో షారూఖ్ నటించిన 'పఠాన్' మూవీకి ఓవరాల్‌గా మాత్రం భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 45 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 538.32 కోట్లు నెట్ వసూలైంది. ఇందులో రూ. 18.52 కోట్లు నెట్ దక్షిణాది భాషల నుంచి, రూ. 519.80 కోట్లు హిందీ బెల్ట్ ద్వారా వచ్చాయి. ఈ మూవీ రూ. 1042 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఓవర్సీస్‌లో ఎంతొచ్చిందంటే
షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేశారు. అందుకు తగ్గట్లుగానే విదేశాల్లో కూడా ఈ సినిమా భారీ స్పందనను సొంతం చేసుకుంది. అలాగే, కలెక్షన్లను కూడా భారీ స్థాయిలోనే రాబడుతూ దూసుకెళ్తోంది. ఫలితంగా ఈ మూవీ 45 రోజుల్లో ఓవర్సీస్‌లో 47.55 మిలియన్ డాలర్లు (390 కోట్లు) వరకూ వసూళ్లను రాబట్టి దూసుకెళ్తోంది.

ఆఫర్ వల్ల తక్కువ.. పది కోట్లు
షారూఖ్ ఖాన్ - సిద్దార్థ్ ఆనంద్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'పఠాన్' మూవీ 45వ రోజు భారీగా డౌన్ అయింది. దీంతో మొత్తంగా దీనికి రూ. 31 లక్షలు నెట్ మాత్రమే వచ్చింది. ఈ వసూళ్లు తగ్గడానికి నిర్మాతలు పెట్టిన ఆఫర్ కారణం అని అంటున్నారు. ఇక, ఈ సినిమా ఓవర్సీస్‌లో పది కోట్లు రాబడితే రూ. 400 కోట్లు వసూలు చేసిన చిత్రంగా సంచలన రికార్డును సాధిస్తుంది.


Click it and Unblock the Notifications











