Pathaan 46 Days Collections: మళ్లీ వసూళ్లు డబుల్.. లాభమే అన్ని వందల కోట్లు.. షారూఖ్ సంచలన రికార్డు

బాలీవుడ్ హీరోగా కెరీర్‌ను మొదలు పెట్టినా.. తనలోని అన్ని టాలెంట్లనూ బయట పెట్టుకుంటూ చాలా తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు బాద్‌షా షారూఖ్ ఖాన్. అలా దాదాపు మూడు దశాబ్దాలుగా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే షారూఖ్ 'పఠాన్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి మొదటి రోజు నుంచీ భారీ వసూళ్లు వస్తున్నాయి. ఈ వారంలో క్రమంగా పడిపోతున్నా.. ఇప్పుడు మళ్లీ పెరిగాయి. ఈ నేపథ్యంలో 'పఠాన్' సినిమా 46 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరు కూడా చూడండి!

అదిరే యాక్షన్‌ మూవీగా పఠాన్

అదిరే యాక్షన్‌ మూవీగా పఠాన్

బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన తాజా సినిమానే 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం విలన్‌గా నటించాడు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్ర చేశాడు. విశాల్ శేఖర్ దీనికి మ్యూజిక్ అందించారు.

పఠాన్ మూవీ బిజినెస్, రిలీజ్

పఠాన్ మూవీ బిజినెస్, రిలీజ్

స్పై థ్రిల్లర్ జోనర్‌లో షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన 'పఠాన్'పై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్‌కు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 కోట్లు వరకూ బిజినెస్ జరిగింది. అందుకు తగ్గట్లుగానే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8000లకు పైగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేశారు.

45 రోజుల్లో ఎంత వచ్చిందంటే

45 రోజుల్లో ఎంత వచ్చిందంటే

ఎంతో మంది స్టార్లు నటించిన 'పఠాన్' మూవీకి ఆరంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీ స్థాయిలోనే వస్తున్నాయి. ఇలా 45 రోజుల్లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 538.32 కోట్లు నెట్‌, రూ. 1042 కోట్లు గ్రాస్‌ను వచ్చినట్లు నిర్మాతలు వెల్లడించారు.

46వ రోజు ఎంత కలెక్ట్ చేసింది

46వ రోజు ఎంత కలెక్ట్ చేసింది

షారూఖ్ ఖాన్ హీరోగా సిద్దార్థ్ ఆనంద్ రూపొందించిన 'పఠాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే 46వ రోజు భారీగా పడిపోయి రూ. 1.50 కోట్లు గ్రాస్, రూ. 77 లక్షలు వరకూ నెట్ వసూలు అయింది.

46 రోజులకూ కలిపి ఎంతంటే?

46 రోజులకూ కలిపి ఎంతంటే?

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన షారూఖ్ 'పఠాన్' మూవీకి ఓవరాల్‌గా మాత్రం భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 46 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 539.14 కోట్లు నెట్ వసూలైంది. ఇందులో రూ. 18.54 కోట్లు నెట్ దక్షిణాది భాషల నుంచి, రూ. 520.60 కోట్లు హిందీ బెల్ట్ ద్వారా వచ్చాయి. ఈ మూవీ రూ. 1043.50 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఓవర్సీస్‌లో ఎంతొచ్చిందంటే

ఓవర్సీస్‌లో ఎంతొచ్చిందంటే

షారూఖ్ రేంజ్‌కు తగ్గట్లుగానే 'పఠాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేశారు. అందుకు తగ్గట్లుగా విదేశాల్లో కూడా ఈ సినిమా భారీ స్పందనను సొంతం చేసుకుంది. అలాగే, కలెక్షన్లను కూడా భారీ స్థాయిలోనే రాబడుతూ దూసుకెళ్తోంది. ఫలితంగా ఈ మూవీ 46 రోజుల్లో ఓవర్సీస్‌లో 47.55 మిలియన్ డాలర్లు (390 కోట్లు) వరకూ వసూళ్లను రాబట్టింది.

లాభాలతో షారూఖ్ రికార్డు

లాభాలతో షారూఖ్ రికార్డు

షారూఖ్ ఖాన్ - సిద్దార్థ్ ఆనంద్ కలయికలో తెరకెక్కిన 'పఠాన్' మూవీ 46వ రోజు కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఇలా ఇప్పటి వరకూ ఈ సినిమా రూ. 540 కోట్లు వరకూ నెట్ కలెక్షన్లను వసూలు చేసింది. దీంతో ఈ చిత్రం రూ. 260 కోట్ల టార్గెట్‌తో వచ్చి ఏకంగా రూ. 280 కోట్లు లాభాలను సొంతం చేసుకుంది. తద్వారా షారూఖ్ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X