Pathaan 5 Weeks Collections: పఠాన్ పెను సంచలనం.. లాభమే వందల కోట్లు.. బాహుబలిని దాటి నెంబర్ వన్‌గా!
సుదీర్ఘ కాలంగా ఇండియన్ సినిమాలో సూపర్ స్టార్ రేంజ్‌తో దూసుకుపోతూ.. తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతోన్నాడు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్. నాలుగున్నర దశాబ్దాల సినీ చరిత్రలో ఎన్నో హిట్లను అందుకున్న అతడు.. కొంత కాలంగా భారీ సక్సెస్ కోసం వేచి చూస్తోన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే షారూఖ్ 'పఠాన్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభం నుంచే భారీ స్పందన వస్తోంది. ఇదే 5 వారంలోనూ కంటిన్యూ అయింది. ఈ నేపథ్యంలో 'పఠాన్' సినిమా 5 వారాల రిపోర్టును మీరే చూడండి!

పఠాన్‌గా మారిపోయిన షారూఖ్
బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన తాజా సినిమానే 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం విలన్‌గా నటించాడు. అలాగే, మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేశాడు. విశాల్ శేఖర్ దీనికి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు.

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'పఠాన్'పై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్‌కు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 - 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అందుకు తగ్గట్లుగానే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8000లకు పైగా థియేటర్లలో దీన్ని తీసుకు వచ్చారు.

34 రోజుల్లో ఎంత వచ్చిందంటే
బాలీవుడ్‌లోని స్టార్లు కలిసి నటించిన 'పఠాన్' సినిమాకు ఆరంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీ స్థాయిలోనే వస్తున్నాయి. ఇలా 34 రోజుల్లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 526.58 కోట్లు నెట్, రూ. 1021.50 కోట్లు గ్రాస్‌ను వసూలైనట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

35వ రోజు ఎంత కలెక్ట్ చేసింది
షారూఖ్ ఖాన్ హీరోగా సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించిన 'పఠాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే 35వ రోజు కూడా దీనికి వసూళ్లు తగ్గి రూ. 1.50 కోట్లు గ్రాస్, రూ. 77 - 80 లక్షలు నెట్ వసూలైంది.

5 వారాలకూ కలిపి ఎంతంటే?
ఫుల్ లెంగ్త్ యాక్షన్ జోనర్‌లో వచ్చిన 'పఠాన్' మూవీకి ఓవరాల్‌గా మాత్రం భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 5 వారాల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 527.35 కోట్లు నెట్ వసూలైది. ఇందులో రూ. 18.20 కోట్లు నెట్ దక్షిణాది భాషల నుంచి వచ్చింది. అలాగే, ఈ మూవీ రూ. 1023 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఓవర్సీస్‌లో ఎంత వచ్చింది?
స్పై థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన 'పఠాన్' చిత్రాన్ని షారూఖ్ ఖాన్ క్రేజ్ వల్ల చాలా దేశాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే విదేశాల్లో కూడా ఈ సినిమా భారీ స్పందనను సొంతం చేసుకుంది. అలాగే, కలెక్షన్లను కూడా అత్యధికంగానే రాబట్టింది. ఫలితంగా ఈ మూవీ 5 వారాల్లో ఓవర్సీస్‌లో 46.90 మిలియన్ డాలర్లు (385 కోట్లు) వరకూ వసూళ్లను రాబట్టింది.

5 వారాల్లో ఎన్నో రికార్డులతో
షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' 5 వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 527.35 కోట్లు నెట్‌ను రాబట్టింది. అందులో హిందీ వెర్షన్‌కు మాత్రమే రూ. 509.15 కోట్లు నెట్ వచ్చింది. తద్వారా 'బాహుబలి 2' రికార్డు (511 కోట్లు)కు రూ. 1.85 కోట్లు దూరంలో నిలిచింది. ఇక, ఈ చిత్రం రూ. 250 కోట్ల బిజినెస్‌తో విడుదలవగా.. ఇప్పటికే రూ. 277 కోట్ల వరకూ లాభాల వచ్చాయి.


Click it and Unblock the Notifications











