Pathaan 52 Days Collections: పఠాన్‌కు ఊహించని వసూళ్లు.. అన్ని కోట్లతో రికార్డు.. లాభం ఎంతో తెలిస్తే!
విలక్షణమైన నటన, విభిన్నమైన సినిమాలు చేస్తూ ఇండియన్ సినిమాలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. సుదీర్ఘ కాలంగా సూపర్ స్టార్‌గా సత్తా చాటుతోన్నాడు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్. చాలా కాలంగా హిట్ లేక ఇబ్బంది పడుతోన్న ఆయన.. ఇటీవలే 'పఠాన్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి మొదటి రోజు నుంచీ భారీ వసూళ్లు వస్తున్నాయి. ఈ వారంలో క్రమంగా పడిపోతున్నా.. లాభాలను మాత్రం పెంచుకుంటూనే ఉంటోంది. ఈ నేపథ్యంలో 'పఠాన్' సినిమా 52 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి!

పఠాన్‌గా షారూఖ్ ఖాన్ ఎంట్రీ
సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ నటించిన తాజా సినిమానే 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం విలన్‌గా నటించాడు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్ర చేశాడు. ఈ సినిమాకు విశాల్ శేఖర్ సంగీతాన్ని సమకూర్చారు.

పఠాన్ మూవీ బిజినెస్, రిలీజ్
స్పై థ్రిల్లర్‌గా రూపొందిన షారూఖ్ 'పఠాన్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్‌కు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 కోట్లు వరకూ బిజినెస్ జరిగింది. అందుకు తగ్గట్లుగానే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8000లకు పైగా థియేటర్లలో ఈ సినిమాను ప్రేక్షకులకు అందించారు.

51 రోజుల్లో ఎంత వచ్చిందంటే
ఎంతో మంది స్టార్లు కలిసి చేసిన 'పఠాన్' మూవీకి ఆరంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీ స్థాయిలోనే వస్తున్నాయి. ఇలా 51 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 540.98 కోట్లు నెట్, రూ. 1046.60 కోట్లు గ్రాస్‌ను వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించారు.

52వ రోజు ఎంత కలెక్ట్ చేసింది
షారూఖ్ ఖాన్ - దీపికా పదుకొణె కలయికలో రూపొందిన 'పఠాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే 52వ రోజు భారీగా పడిపోయి రూ. 40 లక్షలు గ్రాస్, రూ. 20 లక్షలు వరకూ నెట్ వసూలు అయింది.

52 రోజులకూ కలిపి ఎంతంటే?
షారూఖ్ హీరోగా సిద్దార్థ్ తెరకెక్కించిన 'పఠాన్' మూవీకి ఓవరాల్‌గా మాత్రం భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 52 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 541.18 కోట్లు నెట్ వసూలైంది. ఇందులో రూ. 18.58 కోట్లు నెట్ దక్షిణాది భాషల నుంచి, రూ. 522.60 కోట్లు హిందీ బెల్ట్ ద్వారా వచ్చాయి. ఈ మూవీ రూ. 1047 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఓవర్సీస్‌లో ఎంతొచ్చిందంటే
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ నటించిన 'పఠాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేశారు. అందుకు తగ్గట్లుగా విదేశాల్లో కూడా ఈ సినిమా భారీ స్పందనను సొంతం చేసుకుంది. అలాగే, కలెక్షన్లను కూడా భారీ స్థాయిలోనే రాబడుతూ దూసుకెళ్తోంది. ఫలితంగా ఈ మూవీ 52 రోజుల్లో ఓవర్సీస్‌లో 47.71 మిలియన్ డాలర్లు (391.60 కోట్లు) వరకూ రాబట్టింది.

లాభాలతో పఠాన్ రికార్డులు
సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన 'పఠాన్' మూవీ రూ. 541 కోట్లు వరకూ నెట్ కలెక్షన్లను వసూలు చేసింది. దీంతో ఈ చిత్రం రూ. 260 కోట్ల టార్గెట్‌తో వచ్చి ఏకంగా రూ. 280 కోట్లు లాభాలను సొంతం చేసుకుంది. తద్వారా షారూఖ్ ఖాన్ కెరీర్‌లోనే ఇన్ని కోట్ల లాభాలను ఖాతాలో వేసుకున్న చిత్రంగా ఇది రికార్డును దక్కించుకుంది.


Click it and Unblock the Notifications











