Pathaan 53 Days Collections: పఠాన్ ఊరమాస్.. 53వ రోజూ భారీగా.. లాభాలతో షారూఖ్ సంచలన రికార్డు
దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండియన్ సినిమాలో హవాను చూపిస్తూ.. నెంబర్ వన్ స్టార్ హీరోగా సత్తా చాటుతోన్నాడు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్. కెరీర్ ఆరంభం నుంచీ వరుస పెట్టి మూవీలు చేస్తోన్న ఆయన.. ఈ మధ్య కాలంలో మాత్రం కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఈ పరిస్థితుల్లోనే ఇటీవలే 'పఠాన్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
దీనికి మొదటి రోజు నుంచీ భారీ వసూళ్లు వస్తున్నాయి. ఈ వారంలో క్రమంగా పడిపోతున్నా.. లాభాలను మాత్రం పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో 'పఠాన్' సినిమా 53 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

పఠాన్‌గా షారూఖ్ వచ్చేశాడు
బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ నటించిన తాజా సినిమానే 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం విలన్‌గా నటించాడు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్ర చేశాడు. ఈ చిత్రానికి విశాల్ శేఖర్ సంగీతాన్ని అందించాడు.

పఠాన్ మూవీ బిజినెస్, రిలీజ్
చాలా మంది స్టార్లు కలిసి నటించిన 'పఠాన్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్‌కు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 కోట్లు వరకూ బిజినెస్ జరిగింది. అందుకు తగ్గట్లుగానే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8000లకు పైగా థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేశారు.

52 రోజుల్లో ఎంత వచ్చిందంటే
క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'పఠాన్' మూవీకి ఆరంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీ స్థాయిలోనే వస్తున్నాయి. ఇలా 52 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 541.18 కోట్లు నెట్, రూ. 1047.00 కోట్లు గ్రాస్‌ను వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించారు.

53వ రోజు ఎంత కలెక్ట్ చేసింది
షారూఖ్ ఖాన్ - సిద్దార్థ్ ఆనంద్ కాంబోలో రూపొందిన 'పఠాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే 53వ రోజు కాస్త పెరిగి రూ. 45 లక్షలు గ్రాస్, రూ. 25 లక్షలు వరకూ నెట్ వసూలు అయింది.

53 రోజులకూ కలిపి ఎంతంటే?
షారూఖ్, దీపిక, జాన్ అబ్రహం కలిసి నటించిన 'పఠాన్' మూవీకి ఓవరాల్‌గా మాత్రం భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 53 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 541.43 కోట్లు నెట్ వసూలైంది. ఇందులో రూ. 18.59 కోట్లు నెట్ దక్షిణాది భాషల నుంచి, రూ. 532.84 కోట్లు హిందీ బెల్ట్ ద్వారా వచ్చాయి. ఈ మూవీ రూ. 1047.45 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఓవర్సీస్‌లో ఎంతొచ్చిందంటే
ఇండియన్ సూపర్ స్టార్ షారూఖ్ నటించిన 'పఠాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేశారు. అందుకు తగ్గట్లుగా విదేశాల్లో కూడా ఈ సినిమా భారీ స్పందనను సొంతం చేసుకుంది. అలాగే, కలెక్షన్లను కూడా భారీ స్థాయిలోనే రాబడుతూ దూసుకెళ్తోంది. ఫలితంగా ఈ మూవీ 53 రోజుల్లో ఓవర్సీస్‌లో 47.72 మిలియన్ డాలర్లు (391.65 కోట్లు) వరకూ రాబట్టింది.

లాభాలతో షారూఖ్ సంచలనం
సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్‌లో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన 'పఠాన్' మూవీ రూ. 541 కోట్లు వరకూ నెట్ కలెక్షన్లను వసూలు చేసింది. దీంతో ఈ చిత్రం రూ. 260 కోట్ల టార్గెట్‌తో వచ్చి ఏకంగా రూ. 280 కోట్లు లాభాలను సొంతం చేసుకుంది. తద్వారా షారూఖ్ ఖాన్ కెరీర్‌లోనే ఇన్ని కోట్ల లాభాలను ఖాతాలో వేసుకున్న సినిమాగా ఇది సంచలనం సృష్టించింది.


Click it and Unblock the Notifications











