Pathaan 6 Weeks Collections: మళ్లీ సంచలన వసూళ్లు.. 6 వారాల్లో కోట్ల వర్షం.. లాభమే అన్ని వందల కోట్లా!

విలక్షణమైన నటన, విభిన్నమైన సినిమాలతో ఇండియన్ సినిమాలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్. సుదీర్ఘ కాలంగా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తోన్న ఆయన.. ఈ మధ్య కాస్త స్లో అయ్యాడు. దీంతో అభిమానులు నిరాశ చెందుతోన్నారు.

ఈ పరిస్థితుల్లో ఇటీవలే షారూఖ్ 'పఠాన్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభం నుంచీ భారీ వసూళ్లు వస్తున్నాయి. అదే 7వ వారంలోనూ కొనసాగడంతో కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'పఠాన్' సినిమా 6 వారాల బాక్సాఫీస్ రిపోర్టును చూడండి!

పఠాన్‌గా షారూఖ్ ఖాన్ ప్రవేశం

పఠాన్‌గా షారూఖ్ ఖాన్ ప్రవేశం

బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ నటించిన తాజా సినిమానే 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం విలన్‌గా నటించాడు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. విశాల్ శేఖర్ దీనికి మ్యూజిక్ అందించారు. ఇక, కండల వీరుడు సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్‌ చేశాడు.

పఠాన్ మూవీ బిజినెస్, విడుదల

పఠాన్ మూవీ బిజినెస్, విడుదల

షారూఖ్ ఖాన్ హీరోగా సిద్దార్థ్ ఆనంద్ రూపొందించిన 'పఠాన్'పై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్‌కు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 కోట్లు వరకూ బిజినెస్ జరిగింది. అందుకు తగ్గట్లే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8000లకు పైగా థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేశారు.

41 రోజుల్లో ఎంత వచ్చిందంటే

41 రోజుల్లో ఎంత వచ్చిందంటే

పాటతోనే వివాదంగా మారిపోయిన 'పఠాన్' మూవీకి ఆరంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీ స్థాయిలోనే వస్తున్నాయి. ఇలా 41 రోజుల్లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 535.50 కోట్లు నెట్‌, రూ. 1038 కోట్లు గ్రాస్‌ను వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించారు.

42వ రోజు ఎంత కలెక్ట్ చేసింది

42వ రోజు ఎంత కలెక్ట్ చేసింది

షారూఖ్ ఖాన్ - దీపికా పదుకొణె జంటగా నటించిన 'పఠాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే 42వ రోజు మరోసారి భారీగా పెరిగి రూ. 2.00 కోట్లు గ్రాస్, రూ. 1.05 కోట్లు వరకూ నెట్ వసూలు అయింది.

42 రోజులకూ కలిపి ఎంతంటే?

42 రోజులకూ కలిపి ఎంతంటే?

ఇండియన్ సూపర్ స్టార్ షారూఖ్ నటించిన 'పఠాన్' మూవీకి ఓవరాల్‌గా మాత్రం భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 42 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 536.55 కోట్లు నెట్ వసూలైంది. ఇందులో రూ. 18.34 కోట్లు నెట్ దక్షిణాది భాషల నుంచి వచ్చింది. అలాగే, ఈ మూవీ రూ. 1040 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

ఓవర్సీస్‌లో ఎంతొచ్చిందంటే

ఓవర్సీస్‌లో ఎంతొచ్చిందంటే

ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న షారూఖ్ నటించిన 'పఠాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అందుకు తగ్గట్లుగానే విదేశాల్లో కూడా ఈ సినిమా భారీ స్పందనను సొంతం చేసుకుంది. అలాగే, కలెక్షన్లను కూడా భారీ స్థాయిలోనే రాబడుతూ దూసుకెళ్తోంది. ఫలితంగా ఈ మూవీ 42 రోజుల్లో ఓవర్సీస్‌లో 47.70 మిలియన్ డాలర్లు (390 కోట్లు) వరకూ వసూళ్లను రాబట్టి సత్తా చాటింది.

సంచలనం.. లాభమే అన్ని కోట్లు

సంచలనం.. లాభమే అన్ని కోట్లు

సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన 'పఠాన్' మూవీ 42వ రోజు కూడా కోటికి పైగానే వరకూ నెట్‌ను వసూలు చేసి సత్తా చాటుకుంది. మొత్తంగా హిందీలో ఇప్పటి వరకూ రూ. 518.10 అలాగే, రూ. 260 కోట్లు నెట్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకూ రూ. 276 కోట్లకు పైగా లాభాలను సొంతం చేసుకుని షారూఖ్ కెరీర్‌లో టాప్ మూవీగా నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X