Pathaan 8 Days Collections: పఠాన్ ఊరమాస్ కొట్టుడు.. షారూఖ్ సంచలనం.. రాజమౌళి రికార్డులు బ్రేక్

చాలా మంది హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్లుగా హవాను చూపిస్తున్నారు. కానీ, చాలా కాలం క్రితమే ఈ స్థాయిని ఏర్పరచుకుని దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించిన స్టార్ బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్. కెరీర్ ఆరంభం నుంచీ వరుసగా సినిమాలు చేసిన ఈ సీనియర్ హీరో.. దాదాపు ఐదేళ్లుగా వెండితెరపై సందడి చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇటీవలే షారూఖ్ 'పఠాన్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో 'పఠాన్' ఎనిమిది రోజుల కలెక్షన్ల రిపోర్టును మీరే చూసేయండి!

పఠాన్‌గా షారూఖ్ ఖాన్ ఎంటర్

పఠాన్‌గా షారూఖ్ ఖాన్ ఎంటర్


బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ నటించిన తాజా సినిమానే 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం కీలక పాత్రను చేశాడు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. విశాల్ శేఖర్ ఈ మూవీకి సంగీతం అందించాడు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ కామియో రోల్ చేశాడు.

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్


బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 - 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే దీన్ని దాదాపు 8000లకు పైగా థియేటర్లలో దీన్ని విడుదల చేశారు.

వారం రోజుల్లో ఎంత వచ్చింది?

వారం రోజుల్లో ఎంత వచ్చింది?


సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో సీనియర్ స్టార్ షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గానే వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఇలా వారం రోజుల్లో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 330 కోట్లు నెట్‌తో పాటు రూ. 634 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

 ఎనిమిదో రోజు ఎంత వచ్చింది?

ఎనిమిదో రోజు ఎంత వచ్చింది?


షారూఖ్ ఖాన్ - దీపికా పదుకొనె జంటగా నటించిన 'పఠాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇలా 8వ రోజు ఈ చిత్రానికి ఓవరాల్‌గా రూ. 18 - 20 కోట్లు గ్రాస్, రూ. 12 - 14 కోట్లు నెట్ వచ్చినట్లు తెలిసింది.

ఎనిమిది రోజులకు కలిపి ఇలా

ఎనిమిది రోజులకు కలిపి ఇలా


పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'పఠాన్' మూవీకి హిందీలో మాత్రం భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఎనిమిది రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 344 కోట్లు వరకూ నెట్ వసూలు అయింది. అలాగే, రూ. 670 గ్రాస్ కలెక్ట్ చేసింది. తద్వారా ఈ క్రేజీ మూవీ ఇప్పటికే ఎన్నో రికార్డులను సైతం బ్రేక్ చేసేసింది.

ఓవర్సీస్‌లోనూ ఆ మార్కు దాటి

ఓవర్సీస్‌లోనూ ఆ మార్కు దాటి


బాలీవుడ్ సీనియర్ షారూఖ్ ఖాన్‌ను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే 'పఠాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు. దీంతో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 31 మిలియన్స్ వరకూ రాబట్టి సంచలనం సృష్టించింది. ఇందులో ఒక్క నార్త్ అమెరికాలోనే దాదాపు పది మిలియన్లు డాలర్లకు పైగా గ్రాస్‌ను వసూలు చేసి సత్తా చాటింది.

హిందీతో పాటు మనవి వెనక్కే

హిందీతో పాటు మనవి వెనక్కే


షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' మూవీ ఎనిమిది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 670 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. తద్వారా తక్కువ రోజుల్లోనే ఈ మార్కును చేరుకున్న ఇండియన్ సినిమాగా ఇది చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలోనే 'కేజీఎఫ్ 2', 'బాహుబలి 2' సహా హిందీ సినిమాల రికార్డులన్నీ బ్రేక్ చేసేసింది. దీంతో షారూఖ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతోన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X