Pathaan 9 Days Collections: పఠాన్ మరో సంచలనం.. RRR రికార్డుకు ఎసరు.. 10 కోట్లు వస్తే టాప్ ప్లేస్
దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండియన్ సినిమాపై తనదైన రీతిలో ప్రభావాన్ని చూపిస్తూ నేషనల్ రేంజ్ స్టార్‌గా వెలుగొందుతోన్నాడు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్. అలా చాలా కాలం పాటు ఎన్నో అత్యుత్తమ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈ స్టార్ హీరో.. కొంత కాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. ఈ పరిస్థితుల్లో ఇటీవలే షారూఖ్ 'పఠాన్' అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి ఆరంభం నుంచే భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో 'పఠాన్' మూవీ తొమ్మిది రోజుల కలెక్షన్ల రిపోర్టును మీరు కూడా చూసేయండి మరి!

పఠాన్‌గా వచ్చిన షారూఖ్ ఖాన్
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన తాజా సినిమానే 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం కీలక పాత్రను చేశాడు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. విశాల్ శేఖర్ ఈ మూవీకి సంగీతం అందించాడు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ చిన్న పాత్ర చేశాడు.

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్
పాన్ ఇండియా స్టార్ షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 - 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే దీన్ని దాదాపు 8000లకు పైగా థియేటర్లలో దీన్ని రిలీజ్ చేశారు.

ఎనిమిది రోజుల్లో ఎంతొచ్చింది?
యాక్షన్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో స్టార్ షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గానే వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఇలా ఎనిమిది రోజుల్లో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 336 కోట్లు నెట్‌తో పాటు రూ. 667 కోట్లు గ్రాస్ రాబట్టింది.

తొమ్మిదో రోజు ఎంత వచ్చింది?
షారూఖ్ ఖాన్ - దీపికా పదుకొనె జోడీగా చేసిన 'పఠాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇలా 9వ రోజు ఈ చిత్రానికి ఓవరాల్‌గా రూ. 28 - 30 కోట్లు గ్రాస్, రూ. 14 - 16 కోట్లు నెట్ వచ్చినట్లు తెలిసింది.

తొమ్మిది రోజులకు కలిపి ఇలా
ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'పఠాన్' మూవీకి హిందీలో మాత్రం భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 9 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 360 కోట్లు వరకూ నెట్ వసూలు అయింది. అలాగే, రూ. 695 - 967 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసింది. తద్వారా ఈ క్రేజీ మూవీ ఇప్పటికే ఎన్నో రికార్డులను సైతం బద్దలు కొట్టేసింది.

ఓవర్సీస్‌లో RRR రికార్డుపై గురి
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్‌ను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకు అనుగుణంగానే 'పఠాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు. దీంతో ఈ మూవీ 9 రోజుల్లో ఓవర్సీస్‌లో 33 మిలియన్స్ వరకూ రాబట్టి సంచలనం సృష్టించింది. తద్వారా ఫుల్ రన్‌లో RRR వసూలు చేసిన 34 మిలియన్ డాలర్ల రికార్డుకు ఈ సినిమా చేరువగా వచ్చేసింది.

హిందీలో పెను సంచలనానికి
షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' మూవీ తొమ్మిది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 690 కోట్లకు కోట్లు గ్రాస్ వసూలు చేసింది. అందులో హిందీలోనే దాదాపు రూ. 680 కోట్ల వరకూ వచ్చింది. తద్వారా బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల జాబితాలో ఇది రెండో స్థానానికి చేరుకుంది. అదే సమయంలో 'దంగల్' రూ. 702 రికార్డును బ్రేక్ చేయడానికి రెడీగా ఉంది.


Click it and Unblock the Notifications











