twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pathaan Day 1 Collections: చరిత్ర సృష్టించిన పఠాన్.. తొలిరోజే అన్ని కోట్లు..ఇండియాలో తొలి మూవీగా!

    |

    విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలతో దాదాపు మూడు నాలుగు దశాబ్దాలుగా హిందీ చిత్ర పరిశ్రమలో హవాను చూపిస్తూ టాప్ హీరోగా వెలుగొందుతోన్నాడు బాద్‌షా షారూఖ్ ఖాన్. ఏజ్ బార్ అవుతోన్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తోన్న ఆయన.. కొంత కాలం పాటు బ్రేక్ తీసుకున్నాడు.

    ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సీనియర్ హీరో 'పఠాన్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి అదిరిపోయే స్పందన దక్కింది. దీంతో ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో 'పఠాన్' ఫస్ట్ డే కలెక్షన్ల రిపోర్టును చూద్దాం పదండి!

     పఠాన్‌గా షారూఖ్ ఖాన్ అరాచకం

    పఠాన్‌గా షారూఖ్ ఖాన్ అరాచకం

    బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రమే 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. ఇందులో జాన్ అబ్రహం కీలక పాత్రను చేశాడు. విశాల్ శేఖర్ ఈ మూవీకి సంగీతం అందించాడు. సల్మాన్ ఖాన్ అతిథి పాత్రను చేశాడు.

    పైన ఏమీ లేకుండా అనుష్క హాట్ షో: కోహ్లీ వైఫ్ ఎద అందాల ట్రీట్పైన ఏమీ లేకుండా అనుష్క హాట్ షో: కోహ్లీ వైఫ్ ఎద అందాల ట్రీట్

    అన్ని కోట్ల బిజినెస్... భారీ రిలీజ్

    అన్ని కోట్ల బిజినెస్... భారీ రిలీజ్

    స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 - 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే దీన్ని దాదాపు 8000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేశారు.

    అలాంటి టాక్.. భారీ ఓపెనింగ్స్

    అలాంటి టాక్.. భారీ ఓపెనింగ్స్

    బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో సీనియర్ పానిండియా స్టార్ షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గానే వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి మొదటి రోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనాలు వేశాయి.

    మళ్లీ మొదలెట్టిన యాంకర్ స్రవంతి: క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయిందిగా!మళ్లీ మొదలెట్టిన యాంకర్ స్రవంతి: క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయిందిగా!

    దక్షిణాది రాష్ట్రాల్లో మోస్తరుగానే

    దక్షిణాది రాష్ట్రాల్లో మోస్తరుగానే

    షారూఖ్ ఖాన్ - దీపికా పదుకొనె జంటగా నటించిన 'పఠాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అయితే, మొదటి రోజుల ఈ మూవీకి తెలుగు, తమిళం సహా దక్షిణాదిలో ఆశించిన రీతిలో కలెక్షన్లు రాలేదని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఫస్ట్ డే దీనికి రూ. 3.50 - 4.50 కోట్లు నెట్ వచ్చిందని తెలిసింది.

    హిందీలో అరాచకమైన వసూళ్లు

    హిందీలో అరాచకమైన వసూళ్లు

    క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'పఠాన్' మూవీకి హిందీలో మాత్రం భారీ వసూళ్లు వచ్చినట్లు తెలిసింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం హిందీ బెల్ట్‌లోనే మొదటి రోజు రూ. 65 కోట్లు వరకూ గ్రాస్, రూ. 55 కోట్లు వరకూ నెట్‌ కలెక్సన్లను వసూలు చేసిందట. ఇందులో అడ్వాన్స్ సేల్స్ ద్వారానే రూ. 27.12 కోట్లు వసూలు అయినట్లు కూడా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    ఒంటిపై బట్టలు లేకుండా శృతి హాసన్: హీరోయిన్ హాట్ మసాజ్ ఫొటో వైరల్ఒంటిపై బట్టలు లేకుండా శృతి హాసన్: హీరోయిన్ హాట్ మసాజ్ ఫొటో వైరల్

    ఓవర్సీస్‌లో సంచలన కలెక్షన్లు

    ఓవర్సీస్‌లో సంచలన కలెక్షన్లు

    బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్‌ను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే 'పఠాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు. దీంతో ఈ మూవీ ఏకంగా ఓవర్సీస్‌లో మాత్రమే రూ. 38 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక, ఆయా దేశాల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఈ చిత్రం హాఫ్ మిలియన్ డాలర్లకు పైగానే వసూలు చేసింది.

    ఇండియాలోనే టాప్ మూవీగా

    ఇండియాలోనే టాప్ మూవీగా

    'పఠాన్' మూవీ మొదటి రోజు మొత్తంగా రూ. 103 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు తెలిసింది. తద్వారా తొలి రోజే వంద కోట్లు రాబట్టిన ఆరో చిత్రంగా ఇది రికార్డు సాధించింది. అలాగే, ఒక్క హిందీ బెల్ట్‌లో రూ. 55 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. దీంతో 'కేజీఎఫ్ చాప్టర్ 2' హిందీ వెర్షన్ పేరిట ఉన్న రూ. 53.95 కోట్లు రికార్డు బ్రేక్ చేసి నెంబన్ వన్ ప్లేస్‌కు చేరిపోయింది.

    English summary
    Shah Rukh Khan Did Pathaan Movie Under Siddharth Anand Direction. Lets See This Movie Day 1 Worldwide Box Office Collections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X