Pati Patni Aur Woh Do Day 1 Collections: పతీ పత్ని ఔర్ వో దో కలెక్షన్స్... ఆయుష్మాన్ మూవీకి తొలి రోజు ఎంతంటే?

బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖొరానా హీరోగా రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్, వామికా గబ్బిలు హీరోయిన్లుగా నటించిన మూవీ పతీ పత్ని ఔర్ వో దో. టీ సిరీస్- బీఆర్ స్టూడియోస్‌ బ్యానర్‌లపై భూషణ్ కుమార్, రేణు రవి చోప్రా, కృషన్ కుమార్‌లు నిర్మించిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి.. ముదసర్ అజీజ్ దర్శకత్వ వహిస్తున్నారు. విజయ రాజ్, విశాల్ వశిష్ట, దుర్గేష్ కుమార్, దీపిక అమీన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Also Read
Kara Closing Collections: కర క్లోజింగ్ కలెక్షన్స్.. ధనుష్ మూవీకి లాభమెంత? నష్టమెంత?
Kara Closing Collections: కర క్లోజింగ్ కలెక్షన్స్.. ధనుష్ మూవీకి లాభమెంత? నష్టమెంత?

జిష్ణు భట్టాచార్జీ సినిమాటోగ్రాఫర్‌గా, నినాద్ ఖాన్లోకర్ ఎడిటర్‌గా వ్యవహరిస్తుండగా 8 మంది సంగీత దర్శకులు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. సమ్మర్ కానుకగా మే 15న పతీ పత్ని ఔర్ వో దో మూవీ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ఎన్నికోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

Recommended For You
'రాత్రికి రాత్రే 45 ఏళ్లు రావుగా... మా ఇంట్లోనూ అద్దం ఉంది’
'రాత్రికి రాత్రే 45 ఏళ్లు రావుగా... మా ఇంట్లోనూ అద్దం ఉంది’

పతీ పత్ని ఔర్ వో దో బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి పతీ పత్ని ఔర్ వో దో మూవీకి 60 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ముంబై, ప్రయాగ్‌రాజ్‌తో పాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. నిర్మాణ విలువల కోసం నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 120 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

Pati Patni Aur Woh Do Day 1 Expected Box Office Collections Worldwide Ayushmann Khurrana s film Opening day Report

పతీ పత్ని ఔర్ వో దో బుకింగ్స్
టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలతో పతీ పత్ని ఔర్ వో దో మూవీపై హైప్ నెలకొంది. దానికి తగినట్లుగానే బుకింగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. పరం సుందరి, దే దే ప్యార్ దే 2 వంటి రామ్ కామ్స్ మాదిరిగానే ఈ సినిమాపైనా బజ్ క్రియట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దేశంలోని రెండు పెద్ద మల్టీప్లెక్స్ ఛైన్స్‌ పీవీఆర్ ఐనాక్స్, సినీ పోలీస్‌లలో 13 వేలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లుగా వార్తలు వస్తున్నాయి.

You May Also Like
యాంకర్ ప్రదీప్‌పై మనసుపడ్డ నటి.. అలా బయటపెట్టిన డింపుల్ బ్యూటీ
యాంకర్ ప్రదీప్‌పై మనసుపడ్డ నటి.. అలా బయటపెట్టిన డింపుల్ బ్యూటీ

సమ్మర్ హాలీడేస్, వీకెండ్ కారణంగా పతీ పత్ని ఔర్ వో దో సినిమాకు కుటుంబ ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే హిందీలో అక్షయ్ కుమార్ నటించిన భూత్ బంగ్లా.. తమిళంలో సూర్య నటించిన కరుప్పు సినిమాల నుంచి ఆయుష్మాన్ ఖొరానా మూవీకి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ రొమాంటిక్ కామెడీ సినిమాలను ఇష్టపడే వారి నుంచి రెస్పాన్స్ బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

యాంకర్ శ్రీముఖి బర్త్ డే... ఈసారి రాములమ్మకు గిఫ్ట్ అదిరిపోయిందిగా!
యాంకర్ శ్రీముఖి బర్త్ డే... ఈసారి రాములమ్మకు గిఫ్ట్ అదిరిపోయిందిగా!

పతీ పత్ని ఔర్ వో దో తొలిరోజు వసూళ్ల అంచనా
తొలిరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు పతీ పత్ని ఔర్ వో దో మూవీకి ఇండియాలో 374 సెంటర్స్‌లో 4727 షోలు ప్రదర్శితమై 8 శాతం ఆక్యూపెన్సీ నమోదైనట్లు ట్రాక్ టాలీవుడ్ నివేదించింది. వీటిలో 26 సెంటర్స్‌లో హౌస్‌ఫుల్ అవ్వగా.. 32 కేంద్రాలలో ఫాస్ట్ ఫిల్లింగ్ రిపోర్ట్స్ వస్తున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు పతీ పత్ని ఔర్ వో దో మూవీకి తొలిరోజున ఇండియాలో 2.10 కోట్ల రూపాయల నెట్ వసూలైనట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. భారత్‌లో 4 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయలు చొప్పున తొలిరోజున పతీ పత్ని ఔర్ వో దో మూవీ వరల్డ్ వైడ్‌గా 6 కోట్ల రూపాయల రేంజ్‌లో ఓపెనింగ్స్ రాబడుతుందని అంచానా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X