Patriot Advance Booking: మమ్ముట్టి- మోహన్‌లాల్ హవా... రిలీజ్‌కు ముందే పేట్రియాట్‌కు ఎన్ని కోట్లంటే?
మలయాళ చిత్ర పరిశ్రమకు రెండు కళ్లుగా, కేరళ సినీ రంగాన్ని దశాబ్ధాలుగా శాసిస్తున్నారు మమ్ముట్టి, మోహన్‌లాల్. ఈ వయసులోనూ కుర్రాళ్లతో సమానంగా సినిమాలు చేస్తూ పోటీ ఇస్తున్నారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఈ దిగ్గజాలిద్దరూ కలిసి నటించిన మూవీ పేట్రియాట్. దేశభక్తి, యాక్షన్, పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళం, ఇంగ్లీష్, హిందీ భాషల్లో మే 1న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.. ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో పేట్రియాట్ మూవీకి అడ్వాన్స్ బుకింగ్ దుమ్మురేపుతోంది. ఈ నేపథ్యంలో ఈ వివరాలు పరిశీలిస్తే..
పేట్రియాట్ తారాగణం
పేట్రియాట్ మూవీకి మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహించారు. ఆంటో జోసెఫ్ ఫిల్మ్ కంపెనీ, మమ్ముట్టి కంపెనీ బ్యానర్‌లపై ఆంటో జోసెఫ్, కేజీ అనిల్ కుమార్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫాహద్ ఫాజిల్, కుంచకో బోబన్, నయనతార, దర్శన, రేవతి, రాజీవ్ మీనన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సుశిన్ శ్యామ్ సంగీత దర్శకత్వం వహించగా.. మానుష్ నందన్ సినిమాటోగ్రాఫర్‌గా, మహేశ్ నారాయణన్, రాహుల్ రాధాకృష్ణన్‌లు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

పేట్రియాట్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి పేట్రియాట్ సినిమాకు 140 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా మలయాళ సినీ వర్గాలు చెబుతున్నాయి. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలకు తోడు, మమ్ముట్టి- మోహన్‌లాల్‌ల కాంబో కారణంగా పేట్రియాట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగినట్లుగానే అడ్వాన్స్ బుకింగ్‌లో ఈ సినిమా దుమ్మురేపుతోంది.
కేరళలో పేట్రియాట్‌కు భారీ స్పందన
మమ్ముట్టి, మోహన్‌లాల్‌ల సొంత రాష్ట్రం కేరళలో పేట్రియాట్‌కు ఊహించని స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు కేరళలో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్‌లో 1.25 లక్షల టికెట్లు బుక్ అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఒక్క కేరళలోనే ఇప్పటి వరకు పేట్రియాట్ మూవీకి 2 కోట్ల రూపాయలు వసూలైంది. ఈ ట్రెండ్స్‌ను బట్టి చూస్తుంటే రిలీజ్ నాటికి ప్రీ సేల్స్ పరంగా పేట్రియాట్ కొత్త లెక్కలు సెట్ చేస్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మలయాళ సినీ చరిత్రలో భారీ వసూళ్లు సాధించిన సినిమాలుగా ఉన్న లోకా చాప్టర్ వన్: చంద్ర, ఎల్ 2: ఎంపురాన్, తుడారం, వాజా 2 తదితర సినిమాల రికార్డులను పేట్రియాట్ బద్ధలు కొడుతుందని భావిస్తున్నారు.
పేట్రియాట్ ఓవర్సీస్ కలెక్షన్స్
అటు ఓవర్సీస్‌లోనూ పేట్రియాట్ అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్మురేపుతోంది. నార్త్ అమెరికా, యూకే, యూరప్, సింగపూర్, మలేషియా తదితర దేశాలలో కలిపి అడ్వాన్స్ సేల్స్‌లో 2 లక్షల డాలర్లకు (1.8 కోట్ల రూపాయలు) పైగా వసూలు చేసింది. ఇప్పటి వరకు వస్తున్న వార్తలను బట్టి పేట్రియాట్ మూవీ వరల్డ్ వైడ్‌గా 4 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. రిలీజ్‌కు మరో రెండ్రోజులు సమయం ఉండటంతో పేట్రియాట్ ప్రీ సేల్స్‌లో ఎన్ని కోట్లు రాబడుతుంది? మోహన్‌లాల్, మమ్ముట్టి జోడీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications


