Patriot Closing Collections: చేతులెత్తేసిన మోహన్‌లాల్-మమ్ముట్టి.. పేట్రియాట్‌ మూవీకి ఎన్ని కోట్ల నష్టమంటే?

మలయాళ నట దిగ్గజాలు మమ్ముట్టి, మోహన్‌లాల్‌లు దాదాపు 18 ఏళ్ల తర్వాత కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ పేట్రియాట్. మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహించారు. ఆంటో జోసెఫ్ ఫిల్మ్ కంపెనీ, మమ్ముట్టి కంపెనీ బ్యానర్‌లపై ఆంటో జోసెఫ్, కేజీ అనిల్ కుమార్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫాహద్ ఫాజిల్, కుంచకో బోబన్, నయనతార, దర్శన, రేవతి, రాజీవ్ మీనన్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

సుశిన్ శ్యామ్ సంగీత దర్శకత్వం వహించగా.. మానుష్ నందన్ సినిమాటోగ్రాఫర్‌గా, మహేశ్ నారాయణన్, రాహుల్ రాధాకృష్ణన్‌లు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. దేశభక్తి, యాక్షన్, పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళం, ఇంగ్లీష్, హిందీ భాషల్లో మే 1న వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. ఈ నేపథ్యంలో పేట్రియాట్ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమాకు క్లోజింగ్ కలెక్షన్స్ ఎంత? పేట్రియాట్ మూవీకి లాభమెంత? నష్టమెంత? ఈ వివరాల్లోకి వెళితే..

Patriot Box Office Closing Collections Worldwide How much loss or profit for Mammootty and Mohanlal s Movie

పేట్రియాట్ బడ్జెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి పేట్రియాట్ మూవీకి 140 కోట్ల బడ్జెట్ అయినట్లు మలయాళ సినీ వర్గాలు తెలిపాయి. విదేశాల్లో చిత్రీకరణకు తోడు నిర్మాణ విలువల కోసం నిర్మాతల ఎక్కడా తగ్గకుండా ఖర్చుపెట్టారు. పేట్రియాట్ మూవీ లాభాల్లోకి రావాలంటే 140 కోట్ల రూపాయల షేర్ వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

పేట్రియాట్ కలెక్షన్స్
పేట్రియాట్‌కు ఇండియాలో తొలిరోజున 11.60 కోట్ల రూపాయలు, రెండో రోజున 7.13 కోట్ల రూపాయలు, మూడో రోజున 6.38 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 1.97 కోట్ల రూపాయలు, ఐదో రోజున 1.74 కోట్ల రూపాయలు, ఆరో రోజున 1.47 కోట్ల రూపాయలు, ఏడో రోజున 1.14 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజున 82 లక్షల రూపాయలు, తొమ్మిదో రోజున 1.15 కోట్ల రూపాయలు, పదో రోజున 1.24 కోట్ల రూపాయలు, పదకొండవ రోజున 55 లక్షల రూపాయలు, పన్నెండో రోజున 55 లక్షల రూపాయలు, పదమూడో రోజున 35 లక్షల రూపాయలు, పద్నాలుగో రోజున 13 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇప్పటి వరకు ఇండియాలో 36.41 కోట్ల రూపాయల గ్రాస్.. 31.39 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసింది పేట్రియాట్.

పేట్రియాట్ ఓవర్సీస్ కలెక్షన్స్
పేట్రియాట్‌కు ఇండియాలో కంటే ఓవర్సీస్‌లో మెరుగైన వసూళ్లు వచ్చాయి. నార్త్ అమెరికా, సింగపూర్, మలేషియా, గల్ఫ్, యూకే, యూరప్ తదితర దేశాలలో కలిపి ఇప్పటి వరకు మోహన్‌లాల్ - మమ్ముట్టి మూవీకి 43.25 కోట్ల రూపాయలు వసూలైంది. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి వరల్డ్ వైడ్‌గా పేట్రియాట్ మూవీకి దాదాపు 80 కోట్ల రూపాయల గ్రాస్ వసూలైంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు కేరళలో 29 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 3.79 కోట్ల రూపాయలు, తమిళనాడులో 2.24 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 44 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 1.62 కోట్ల రూపాయలు చొప్పున రాబట్టింది.

పేట్రియాట్‌కు లాభమెంత? నష్టమెంత?
తొలిరోజు నుంచే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న పేట్రియాట్ మూవీ ఫస్ట్ వీకెండ్ వరకు భారీ వసూళ్లు సాధించింది. అయితే వర్కింగ్ డేస్ మొదలైన నాటి నుంచి పేట్రియాట్ కలెక్షన్స్ పడుతూ వచ్చాయి. మోహన్‌లాల్- మమ్ముట్టిల క్రేజ్ కూడా దీనిని ఆపలేకపోయింది. ఓవర్సీస్‌లో భారీ వసూళ్ల కారణంగా పేట్రియాట్ మూవీ పరువు కాస్తయినా నిలబడింది. లేదంటే 50 కోట్ల లోపే ఈ సినిమా చాప చుట్టేసేదని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బడ్జెట్ పరంగా 140 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 80 కోట్ల రూపాయల గ్రాస్.. 41 కోట్ల రూపాయల షేర్ చొప్పున కేవలం 57 శాతం బడ్జెట్ రికవరీని మాత్రమే సాధించింది. అయితే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్, శాటిలైట్ రైట్స్‌ను జీ 5 సంస్థ దాదాపు 40 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. దాంతో థియేట్రికల్ కలెక్షన్+ నాన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్‌తో కలిపి 120 కోట్ల రూపాయలకు పైగా రికవరీ అయ్యింది.

దీని ప్రకారం పేట్రియాట్ మూవీ బడ్జెట్ పరంగా దాదాపు 20 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చిందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే రిలీజ్‌కు ముందు ఈ సినిమాకు థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగిందని కేరళ సినీ వర్గాలు చెబుతున్నాయి. దీని ప్రకారం చూస్తే నిర్మాతలు సేఫ్ జోన్‌లోకి వెళ్లినట్లే. అయితే డిస్ట్రిబ్యూటర్లు మాత్రం భారీగా నష్టాలను మూటకట్టుకున్నట్లుగా ట్రేడ్ పండితుల అంచనా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X