Patriot Day 2 Collections: పేట్రియాట్‌ 2వ రోజు కలెక్షన్స్.. మోహన్‌లాల్- మమ్ముట్టి మూవీకి ఎన్ని కోట్లంటే?

దాదాపు 18 ఏళ్ల తర్వాత మలయాళ సూపర్‌స్టార్స్ మోహన్‌లాల్, మమ్ముట్టిలు కలిసి నటించిన చిత్రం పేట్రియాట్. దేశభక్తి, పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహించారు. ఆంటో జోసెఫ్ ఫిల్మ్ కంపెనీ, మమ్ముట్టి కంపెనీ బ్యానర్‌లపై ఆంటో జోసెఫ్, కేజీ అనిల్ కుమార్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సమ్మర్ కానుకగా మే 1వ తేదీన పేట్రియాట్ సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

పేట్రియాట్‌లో రేవతి, నయనతార, ఫహద్ ఫాజిల్ తదితర దిగ్గజాలతో పాటు కుంచకో బోబన్, దర్శన, రాజీవ్ మీనన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సుశిన్ శ్యామ్ సంగీత దర్శకత్వం వహించగా.. మానుష్ నందన్ సినిమాటోగ్రాఫర్‌గా, మహేశ్ నారాయణన్, రాహుల్ రాధాకృష్ణన్‌లు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? రెండో రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

Patriot Day 2 Expected Box Office Collections Worldwide Mammootty- Mohanlal s film witnessed a massive decline

పేట్రియాట్ బడ్జెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి పేట్రియాట్ మూవీకి 140 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు కేరళ సినీ వర్గాలు తెలిపాయి. ఈ మూవీ లాభాల్లోకి రావాలంటే దాదాప 280 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. పేట్రియాట్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను జీ5 సొంతం చేసుకుంది. అలాగే ఈ మూవీ శాటిలైట్ రైట్స్‌ని జీ సినిమాలు దక్కించుకుంది.

పేట్రియాట్ తొలిరోజు కలెక్షన్స్
పేట్రియాట్ మూవీకి తొలిరోజున కేరళలో 8.50 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 1.50 కోట్ల రూపాయలు, తమిళనాడులో 75 లక్షల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 20 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 47 లక్షల రూపాయలు చొప్పున ఇండియాలో తొలిరోజున 12 కోట్ల రూపాయలకు పైగా నికర వసూళ్లు వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అటు ఓవర్సీస్‌లో మాత్రం పేట్రియాట్ దుమ్మురేపింది. నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, యూరప్, గల్ఫ్, సింగపూర్, మలేషియా తదితర దేశాలలో ఏకంగా 18 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. దాంతో తొలిరోజున పేట్రియాట్ మూవీ 30 కోట్లకు పైగా వసూలు చేసింది.

పేట్రియాట్ రెండో రోజు వసూళ్ల అంచనా
పలు సినిమాలు నుంచి పోటీతో పాటు మిక్స్‌డ్ టాక్ కారణంగా పేట్రియాట్‌కు బుకింగ్స్ అంతంత మాత్రంగా సాగుతున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. రెండో రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు పేట్రియాట్ మూవీకి ఇండియాలో 912 షోలు ప్రదర్శితమై.. 31 శాతం ఆక్యూపెన్సీ నమోదైంది. ఇప్పటి వరకు రెండో రోజున భారత్‌లో 90 కోట్ల రూపాయల నికరంగా రాబట్టింది. రెండో రోజు మోహన్‌లాల్- మమ్ముట్టిల సినిమాకు కేరళలో 4 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో 5 కోట్ల రూపాయలు చొప్పున 10 నుంచి 12 కోట్ల రూపాయల రేంజ్‌లో వసూళ్లు రాబడుతుందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X