100 కోట్లకు చేరువగా మమ్ముట్టి, మోహన్‌లాల్ మూవీ.. 4 రోజుల్లో ఎన్ని కోట్లంటే?

మలయాళం సూపర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్‌లాల్ కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం పెట్రియాట్. ఈ చిత్రంలో టాప్ స్టార్స్ ఫాహద్ ఫాజిల్, నయనతార, దర్శన రాజేంద్రన్, రేవతి, కుంచకో బోబన్, రాజీవ్ మీనటన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మహేష్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నారు.క ఆంటో జోసెఫ్ ఫిల్మ్ కంపెనీ, బ్లూ టైగర్స్ లండన్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రానికి ఆంటో జోసెఫ్, కేజీ అనిల్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

స్పై, యాక్షన్, థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. సినిమాటోగ్రఫి: మనుష్ నందన్, ఎఢిటింగ్: మహేష్ నారాయణన్, రాహుల్ రాధాక్రిష్ణన్, మ్యూజిక్: సుషిన్ శ్యామ్ తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రం మే 1 తేదీ, 2026 రోజున రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే..

Patriot Box Office Report

మల్టీ స్టారర్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను భారీ వ్యయంతో నిర్మించారు. ఈ సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపి ఈ చిత్రాన్ని సుమారుగా 140 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా రిలీజ్‌కు ముందే భారీ క్రేజ్‌ను సంపాదించుకొన్నది. దాంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ వాల్యూ సుమారుగా 140 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇండియాలో ముఖ్యంగా కేరళలో ఈ మూవీ కలెక్షన్లు వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 10 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను నమోదు చేసింది. రెండో రోజు ఈ చిత్రం 6.5 కోట్ల రూపాయలు, రెండో రోజు 6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం మూడు రోజుల్లో 22 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా వసూలు చేసింది. ఇందులో అధిక భాగం కేరళ నుంచే రాబట్టిందని ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి.

ఈ మూవీకి ఓవర్సీస్ మార్కెట్‌లో భారీ ఆదరణ లభించింది. ఈ చిత్రం సింగపూర్, మలేషియాతోపాటు నార్త్ అమెరికాలో అత్యధికంగా వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో 40 కోట్ల రూపాయల మేర కలెక్షన్లు నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం 3 రోజుల్లో 62 కోట్ల రూపాయల నెట్, 75 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ అనలిస్టులు తెలిపారు.

ఇక నాలుగో రోజు మూవీ కలెక్షన్ల విషయానికి వస్తే.. కేరళలో ఈ చిత్రం తొలి సోమవారం 2.5 నుంచి 3 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చు. ఇండియాలో 3.5 కోట్ల రూపాయలు రాబట్టే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్‌గా 4 నుంచి 4.5 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చు. దాంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా సుమారుగా 80 కోట్ల రూపాయలు నమోదు చేయవచ్చు. త్వరలోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X