Patriot Day 5 Collections: దారుణంగా పడిపోయిన పేట్రియాట్‌ కలెక్షన్స్.. మోహన్‌లాల్- మమ్ముట్టి మూవీకి ఎంతంటే?

మోహన్‌లాల్, మమ్ముట్టిలు కలిసి నటించిన చిత్రం పేట్రియాట్. ఆంటో జోసెఫ్ ఫిల్మ్ కంపెనీ, మమ్ముట్టి కంపెనీ బ్యానర్‌లపై ఆంటో జోసెఫ్, కేజీ అనిల్ కుమార్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా.. మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహించారు. సమ్మర్ కానుకగా మే 1వ తేదీన పేట్రియాట్ సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? ఐదో రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

పేట్రియాట్‌లో రేవతి, నయనతార, ఫహద్ ఫాజిల్ తదితర దిగ్గజాలతో పాటు కుంచకో బోబన్, దర్శన, రాజీవ్ మీనన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సుశిన్ శ్యామ్ సంగీత దర్శకత్వం వహించగా.. మానుష్ నందన్ సినిమాటోగ్రాఫర్‌గా, మహేశ్ నారాయణన్, రాహుల్ రాధాకృష్ణన్‌లు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపి ఈ చిత్రాన్ని దాదాపు 140 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించినట్లు సినీ వర్గాలు తెలిపాయి. దాంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ వాల్యూ సుమారుగా 140 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Patriot movie 5 Days Box Office Collections Worldwide Mammootty Mohanlal Film witnessed post-weekend drop

పేట్రియాట్ 4 రోజుల కలెక్షన్స్
పేట్రియాట్‌కు తొలిరోజున 10 కోట్ల రూపాయలు, రెండో రోజున 6.15 కోట్ల రూపాయలు, మూడో రోజున 5.50 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 2.89 కోట్ల రూపాయలు చొప్పున ఇండియాలో 24.76 కోట్ల రూపాయల నెట్... 28.63 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక నివేదించింది.

పేట్రియాట్ ఓవర్సీస్ కలెక్షన్స్
ఓవర్సీస్‌లో మాత్రం పేట్రియాట్‌కు భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. తొలి రోజున ఓవర్సీస్‌లో 18 కోట్ల రూపాయలు రాబట్టిన ఈ చిత్రం.. నాలుగు రోజుల్లో విదేశాల్లో 38.50 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. నార్త్ అమెరికాలో 334K డాలర్లు (3.18 కోట్ల రూపాయలు) రాబట్టింది. అయితే సింగపూర్, మలేషియా, థాయిలాండ్, యూకే, యూరప్, గల్ఫ్ దేశాలో పేట్రియాట్ మూవీకి అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 4 రోజుల వరకు 65 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పటి వరకు కేరళలో 20.45 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 3.22 కోట్ల రూపాయలు, తమిళనాడులో 1.75 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 1.35 కోట్ల రూపాయలు, ఏపీ, తెలంగాణలలో 32 లక్షల రూపాయల చొప్పున పేట్రియాట్ మూవీ వసూలు చేసింది.

పేట్రియాట్ 5వ రోజు వసూళ్లు
మిక్స్‌డ్ టాక్‌తో పాటు రివ్యూల కారణంగా పేట్రియాట్ మూవీ అనుకున్న స్థాయిలో సత్తా చాటలేకపోతోంది. వాజా 2, భరతనాట్యం 2, మోహినియాట్టం, పల్లిచట్టంబి మూవీల నుంచి గట్టి పోటీ వస్తుండటంతో 18 ఏళ్ల తర్వాత కలిసిన మోహన్‌లాల్, మమ్ముట్టిల జోడీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతోంది. వీకెండ్ వరకు బండి నెట్టుకురాగా.. సోమవారం నుంచి పేట్రియాట్ భారీగా కలెక్షన్స్ కోల్పోయింది. సోమవారం దాదాదు 47 శాతం మేర బుకింగ్స్ పడిపోయినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

5వ రోజు పేట్రియాట్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. మంగళవారం మోహన్‌లాల్ - మమ్ముట్టి మూవీకి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇండియాలో 573 షోలు ప్రదర్శితమై.. 9 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీతో 22 లక్షల రూపాయల నికర వసూళ్లు సాధించింది. 5వ రోజు పేట్రియాట్ మూవీ కేరళలో 2 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 30 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 4 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X