Malli Pelli Closing Collection భారీ నష్టాల్లో మళ్లీ పెళ్లి.. కోలుకోలేని దెబ్బ..ఎన్ని కోట్ల నష్టమంటే?

ప్రముఖ నటుడు వీకే నరేష్, పవిత్రా లోకేష్ నటించిన మళ్లీ పెళ్లి చిత్రం కంటెంట్ పరంగా ఆకట్టుకొన్నప్పటికీ.. కలెక్షన్లపరంగా బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. భారీ క్రేజ్, అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించలేకపోయిందనే కలెక్షన్ల వివరాలను బట్టి స్పష్టమైంది. ప్రతిష్టాత్మక విజయకృష్ణ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గత నాలుగు రోజుల కలెక్షన్లు ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

తెలుగు సినిమా పరిశ్రమలో వీకే నరేష్, పవిత్రా లోకేష్ రిలేషన్‌షిప్ ఓ సెన్సేషనల్ వ్యవహారం. వారిద్దరి బంధం మీడియాలో వివాదాస్పదంగా మారింది. వారి జీవితాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాపై ప్రత్యేకమైన ఆసక్తి నింపింది. అంతేకాకుండా టీజర్లు, ట్రైలర్లు సినిమాపై మంచి క్రేజ్‌ను పెంచాయి.

Pavitra Lokeshs Malli Pelli closing collections worldwide

మళ్లీ పెళ్లి సినిమా ప్రమోషన్స్ క్రేజీగా మొదలైనప్పటికీ.. ఆ సినిమా వివాదాస్పద అంశాలతో ముందుకెళ్లింది. ఈ సినిమాను రిచ్‌గా, క్వాలిటీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌లో తెరకెక్కించారు. అయితే ఈ సినిమాను దాదాపు 16 కోట్ల రూపాయలతో తెరకెక్కించినట్టు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే సినిమా కంటెంట్ చూస్తే.. ఆ రేంజ్ బడ్జెట్ అయిందా అనే అనుమానం కలుగుతుంది.

మళ్లీ పెళ్లి చిత్రం తొలి రోజు ఓ మోస్తారు ఓపెనింగ్స్ లభించాయి. ఈ సినిమాకి మొదటి రోజు 45 లక్షల గ్రాస్, రెండో రోజు 18 లక్షలు, మూడో రోజు 15 లక్షలు గ్రాస్ కలెక్షన్లు నమోదయ్యాయి. గత మూడు రోజుల్లో మొత్తంగా 78 లక్షల గ్రాస్ వసూళ్లు కలెక్ట్ చేసింది. అయితే ఈ సినిమాకు ఏర్పడిన బజ్ ముందు కలెక్షన్లు చూస్తే చాలా పేలవంగా వసూళ్లు నమోదు అయ్యాయి.

ఇక ప్రతీ సినిమాకు అగ్ని పరీక్షగా నిలిచే సోమవారం రోజున మళ్లీ పెళ్లి చతికిల పడింది. బాక్సాఫీస్ వద్ద చాలా దారుణంగా కలెక్షన్లు నమోదు చేసింది. చాలా చోట్ల కలెక్షన్ల లేకపోవడంతో థియేటర్ల నుంచి సినిమాను ఎత్తి వేసినట్టు తెలిసింది. 4వ రోజున కేవలం 10 శాతం కంటే తక్కువగా ఆక్యుపెన్సీ నమోదైనట్టు సమాచారం.

Pavitra Lokeshs Malli Pelli closing collections worldwide

ఇక మళ్లీ పెళ్లి నాలుగో రోజు అత్యల్పంగా కలెక్షన్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 5 లక్షలకు మించి కలెక్షన్లు రాబట్టలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు ముగిసిందనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది. ఈ సినిమా థియేట్రికల్‌గా భారీ నష్టాల్లో కూరుకుపోయిందనే చెప్పాలి.

మళ్లీ పెళ్లి చిత్రం కూడా కన్నడలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. పవిత్రా లోకేష్‌కు సొంత రాష్ట్రంలో ఆమెకు ఉన్న ఇమేజ్ కూడా పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయింది. దాదాపు అక్కడ కూడా పేలవమైన కలెక్షన్లను నమోదు చేసినట్టు సమాచారం. తెలుగు, తమిళంలో ఈ సినిమా నష్టాల్లోనే ముగిసిందని ట్రేడ్ రిపోర్ట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X