Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నిజమా?: "అత్తారింటికి దారేది" రికార్డు బ్రద్దలైంది
హైదరాబాద్ : తమిళ సూపర్ స్టార్ విజయ్ తాజా చిత్రం "కత్తి" భాక్సాఫీస్ వద్ద సునామీలా విరుచుకుపడుతోంది. ఈ చిత్రం కలెక్షన్స్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. తమిళనాడు, కర్ణాట, కేరళలలో ఈ చిత్రం రికార్డులు బ్రద్దలు కొట్టే దిసగా పరుగెడుతోంది. రిలీజైన తొలిరేజే ఈ చిత్రం 15.5 కోట్లు సాధించింది. అనేకమైన వివాదాల మధ్య 450 థియోటర్స్ లో ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రం కలెక్షన్స్ అత్తారింటికి దారేది తొలిరోజు కలెక్షన్స్ రికార్డులు బ్రద్దలు కొట్టిందని ట్రేడ్ లో చెప్తున్నారు.
కత్తి తొలి రోజు కలెక్షన్స్ చూస్తే...
తమిళనాడు- 12.00 కోట్లు
కేరళ - 1.75 కోట్లు
కర్ణాటక - 1.5 కోట్లు
మిగిలిన భారత దేశం - 0.25 కోట్లు
మొత్తం - 15.5 కోట్లు (విజయ్ కెరీర్ లో ఆల్ టైమ్ రికార్డు)
కత్తి చిత్రం దీపావళి సందర్భంగా బుధవారం విడుదలైంది. అనేక సమస్యల మధ్య విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ ని తెచ్చుకుంది.
ఇక మురుగదాస్ కథలన్నీ విభిన్నంగా ఉంటాయి. షార్ట్ టర్మ్ మొమొరీ లాస్ అనే కథాంశంతో 'గజిని' తీర్చిదిద్దారు. 'రమణ', 'సెవెన్త్‌సెన్స్', 'తుపాకీ' కూడా సాధారణ సినిమాలకు విభిన్నంగా సాగేవే. అందుకే మురుగదాస్ సినిమా వస్తోందంటే అందరిలోనూ ఆసక్తి. ఇప్పుడాయన 'కత్తి' పదును చూపించారు. విజయ్, సమంత జంటగా నటించిన చిత్రమిది. కె.కరుణామూర్తి, ఎ.శుభాస్కరన్ సంయుక్తంగా నిర్మించారు. అనిరుథ్ స్వరాలు అందించారు.
తెలుగు వెర్షన్ కి వస్తే.... ఈ నెల 24న 'కత్తి' పాటల్ని విడుదల చేస్తారు. చిత్ర సమర్పకుడు ఠాగూర్ మధు మాట్లాడుతూ ''థ్రిల్లర్ నేపథ్యంలో సాగే యాక్షన్ చిత్రమిది. సెంటిమెంట్‌కీ చోటుంది. అనిరుథ్ స్వరాలు అదనపు ఆకర్షణ. ఈ నెల 31న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు.