Bheemla Nayak Collections: మూడు రోజుల్లోనే అన్ని కోట్ల టార్గెట్ ఫినీష్.. అందులో మాత్రం నిరాశగానే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. అంతలా అతడు ఆరంభం నుంచే తనదైన శైలి యాక్టింగ్, స్టైల్స్‌తో క్రేజ్‌ను విపరీతంగా సంపాదించుకున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో ఫ్యాన్ బేస్ మరింత విస్తృతం అయిపోయింది. ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా ప్రాంతాల్లో పవన్ సినిమాలకు భారీ వసూళ్లు వస్తున్నాయి. ఇక, తాజాగా వచ్చిన 'భీమ్లా నాయక్' మూవీ అయితే సంచలన కలెక్షన్లతో దూసుకుపోతోంది. మరీ ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఈ సినిమా ఎవరూ ఊహించని రీతిలో వసూళ్లను రాబడుతోంది. ఫలితంగా అక్కడ అదిరిపోయే రికార్డును చేరుకుంది. అసలు మూడు రోజుల్లో ఈ చిత్రం ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

స్టార్ హీరోల కాంబోలో భీమ్లా నాయక్

స్టార్ హీరోల కాంబోలో భీమ్లా నాయక్

పవన్ కల్యాణ్.. దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రమే 'భీమ్లా నాయక్'. సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ దీనికి దర్శకత్వ పర్యవేక్షణతో పాటు డైలాగ్‌లను అందించాడు. థమన్ ఈ మూవీకి సంగీతం సమకూర్చాడు. ఇందులో మలయాల భామలు నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా చేశారు.

బిజినెస్‌కు తగ్గట్లుగా.. గ్రాండ్‌ రిలీజ్

బిజినెస్‌కు తగ్గట్లుగా.. గ్రాండ్‌ రిలీజ్

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'భీమ్లా నాయక్' మూవీపై ఆరంభం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో అన్ని ప్రాంతాల్లో కలిపి ఈ చిత్రానికి రూ. 106.75 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా కలిపి అన్ని ఏరియాల్లోనూ కలుపుకుని 2000 పైగా థియేటర్లలో ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేసేశారు.

ఓవర్సీస్‌లో రెండు మిలియన్ల మార్క్

ఓవర్సీస్‌లో రెండు మిలియన్ల మార్క్


తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు నైజాంలో భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకే అక్కడ అతడి సినిమాలకు కలెక్షన్లు పోటెత్తుతాయి. ఇప్పుడు 'భీమ్లా నాయక్'తో అది మరోసారి రుజువైంది. ఈ సినిమా ఇప్పటికే అక్కడ 2 మిలియన్ డాలర్ల మార్కును కూడా చేరుకుంది. ఫలితంగా వేగంగా ఈ మార్క్ అందుకున్న చిత్రాల జాబితాలో చేరింది.

మూడు రోజులు బాక్సాఫీస్ కలెక్షన్లు

మూడు రోజులు బాక్సాఫీస్ కలెక్షన్లు


ఆంధ్రా, తెలంగాణలో 3 రోజుల్లో రూ. 53.07 కోట్లు వసూలు చేసి సత్తా చాటిన 'భీమ్లా నాయక్' మూవీ మిగిలిన ప్రాంతాల్లోనూ సత్తాను చాటుకుంది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 10.02 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో మొత్తంగా 3 రోజుల్లోనే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 69.19 కోట్లు షేర్‌తో పాటు రూ. 108.50 కోట్ల గ్రాస్ వచ్చింది.

 మూడు రోజుల్లోనే టార్గెట్ పూర్తి చేసి

మూడు రోజుల్లోనే టార్గెట్ పూర్తి చేసి

పవర్ స్టార పవన్ కల్యాణ్ క్రేజ్‌తో పాటు 'భీమ్లా నాయక్' మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఉండడంతో.. ఓవర్సీస్‌లో ఈ చిత్రానికి రూ. 9 కోట్లు బిజినెస్ జరిగింది. ఇక, దీనికి అక్కడ భారీ స్పందన దక్కుతుండడంతో కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఫలితంగా ఈ మూవీ మూడు రోజుల్లోనే రూ. 10.02 కోట్లు రాబట్టింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చాలా వేగంగా పూర్తి చేసేసింది.

 తెలుగు రాష్ట్రాల్లో మూడో స్థానంలోనే

తెలుగు రాష్ట్రాల్లో మూడో స్థానంలోనే


'భీమ్లా నాయక్' మూవీ మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.51 కోట్లు రాబట్టింది. దీంతో ఈ జాబితాలో మూడో స్థానానికి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మూడో రోజు ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసిన చిత్రాల జాబితాలో బాహుబలి 2 (16.60 కోట్లు), పుష్ప (14.38 కోట్లు) దీనికంటే ముందున్నాయి. అల వైకుంఠపురములో, సాహో నాలుగు, ఐదు స్థానాలకు పడిపోయాయి.

ఓవరాల్‌గా ఐదో స్థానానికే పరిమితం

ఓవరాల్‌గా ఐదో స్థానానికే పరిమితం


మూడు రోజుల్లో 'భీమ్లా నాయక్' మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 53.07 కోట్లు షేర్ వసూలు చేసింది. ఈ జాబితాలో చూసుకుంటే.. బాహుబలి 2 రూ. 74.40 కోట్లతో అన్నింటి కంటే ముందుంది. ఆ తర్వాత సాహో (58.67 కోట్లు), సైరా (55.82 కోట్లు), వకీల్ సాబ్ (53.37 కోట్లు) మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఏపీ టికెట్ రేట్ల ప్రభావం భీమ్లాపై భారీగా చూపినట్లైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X