Bheemla Nayak 12 days Collections: పవన్‌కు మరో భారీ ఎదురుదెబ్బ.. అలా జరిగితేనే భీమ్లా నాయక్ హిట్
గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీలు ఎక్కువగా వస్తున్నాయి. దీనికి కారణం ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు రావడమే. అంతేకాదు, దర్శక నిర్మాతలతో పాటు హీరోలు కూడా ధైర్యంగా ముందుకు వస్తుండడంతో ఈ తరహా చిత్రాలు రూపొందుతున్నాయి. ఇలా ఇటీవల వచ్చిన సినిమానే 'భీమ్లా నాయక్'. టాలీవుడ్ స్టార్ హీరోలు పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. దగ్గుబాటి రానా కలిసి నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీన ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది.
Recommended Video
అందుకు అనుగుణంగానే కలెక్షన్లు కూడా భారీగా వచ్చాయి. కానీ, కొద్ది రోజులుగా వసూళ్లు డ్రాప్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం మరింత డౌన్ అయింది. ఇక, భీమ్లా నాయక్ 12 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును చూద్దాం పదండి!

భారీ మల్టీస్టారర్‌గా ‘భీమ్లా నాయక్'
పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్‌లో రీవేంజ్ డ్రామాగా వచ్చిన చిత్రమే ‘భీమ్లా నాయక్'. విలక్షణ దర్శకుడు సాగర్ కే చంద్ర రూపొందించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణతో పాటు మాటలు ఇచ్చాడు. థమన్ సంగీతం అందించాడు. ఇందులో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ ఇలా
క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ‘భీమ్లా నాయక్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కలిసి రూ. 88.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా హక్కులు రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 9 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 106.75 కోట్లు బిజినెస్‌ను చేసుకుందని ట్రేడ్ వర్గాల సమాచారం.

12వ రోజు ఎక్కడ ఎంత వచ్చింది?
‘భీమ్లా నాయక్'కు 12వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలెక్షన్లు భారీగా తగ్గాయి. దీంతో నైజాంలో రూ. 6 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్‌లో రూ. 3 లక్షలు, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. మంగళవారం దీనికి రూ. 27 లక్షలు షేర్‌తో పాటు రూ. 50 లక్షలు గ్రాస్ వచ్చింది.

12 రోజులకు కలిపి ఎంతొచ్చింది?
‘భీమ్లా నాయక్' తెలుగు రాష్ట్రాల్లో 12 రోజుల్లో మంచిగా వసూలు చేసింది. ఫలితంగా నైజాంలో రూ. 34.56 కోట్లు, సీడెడ్‌లో రూ. 10.95 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.48 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.41 కోట్లు, వెస్ట్‌లో రూ. 4.93 కోట్లు, గుంటూరులో రూ. 5.16 కోట్లు, కృష్ణాలో రూ. 3.73 కోట్లు, నెల్లూరులో రూ. 2.52 కోట్లతో కలిపి రూ. 74.74 కోట్లు షేర్, రూ. 114.10 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
12 రోజుల్లో ఏపీ, తెలంగాణలో రూ. 74.74 కోట్లు వసూలు చేసి సత్తా చాటిన ‘భీమ్లా నాయక్' మూవీ మిగిలిన ప్రాంతాల్లోనూ రాణించింది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 8.19 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.45 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో మొత్తంగా 12 రోజుల్లోనే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 95.38 కోట్లు షేర్‌తో పాటు రూ. 155.20 కోట్ల గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘భీమ్లా నాయక్'కు ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.75 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 108 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 12 రోజుల్లో రూ. 95.38 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 12.62 కోట్లు వస్తేనే ఈ మూవీ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.


Click it and Unblock the Notifications











